dean jones
-
‘ప్రొఫెసర్’ కన్నుమూత
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్, వ్యాఖ్యాత డీన్ మెర్విన్ జోన్స్ (59) గురువారం హఠాన్మరణం చెందాడు. ఐపీఎల్ వ్యాఖ్యాతల బృందంలో సభ్యుడిగా ఉన్న జోన్స్ ముంబైలోని ఒక హోటల్లో బస చేస్తున్నాడు. బుధవారం రాత్రి ముంబై, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహిరించిన అతను చనిపోవడానికి ముందు కూడా స్టార్ స్పోర్ట్స్‌వారి ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో పాల్గొన్నాడు. మధ్యాహ్న భోజనానికి ముందు తీవ్ర గుండెపోటు కారణంగా హోటల్ గదిలోనే మరణించినట్లు సమాచారం. లంచ్‌కు వెళ్లటం గురించి జోన్స్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో గదికి వెళ్లి పరిశీలించడంతో ఈ విషయం తెలిసింది. బ్రెట్ లీ కొద్ది సేపు ‘సీపీఆర్’ చేసేందుకు ప్రయత్నించినా అప్పటికే చనిపోయినట్లు అర్థమైంది. ఆటగాడిగా క్రికెట్ గుడ్‌బై చెప్పిన తర్వాత జోన్స్ కోచ్‌గా, కామెంటేటర్‌గా మళ్లీ తన అనుబంధాన్ని కొనసాగించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 2015నుంచి 2019 వరకు ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కు జోన్స్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆటగాడిగా పలు ఘనతలు సాధించడంతో పాటు సునిశీత పరిశీలన, క్రికెట్ పరిజ్ఞానం, వ్యూహాలపై అతని విశ్లేషణలకు క్రికెట్ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే జోన్స్‌ను ‘ప్రొఫెసర్’ అని కూడా అతని సన్నిహితులు పిలుస్తారు. డీన్ జోన్స్ మృతి పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అతని ఘనతలను ప్రశంసిస్తూ నివాళులు అర్పించారు. మద్రాస్ స్పెషల్ డీన్ జోన్స్ పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు ఉన్నాయి. ఆస్ట్రేలియా సాధించిన అనేక విజయాల్లో అతను భాగంగా నిలిచాడు. 1987 వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆసీస్ జట్టులో కీలక పాత్ర (314 పరుగులు) పోషించిన డీన్ జోన్స్ కెరీర్లో 1989 యాషెస్ సిరీస్ ప్రదర్శన మరో మైలురాయి. ఆసీస్ 4–0తో నెగ్గిన ఈ సిరీస్‌లో జోన్స్ 566 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్ ఊపందుకుంటున్న సమయంలో జోన్స్ అందరికన్నా ప్రత్యేకంగా నిలిచాడు. వేగవంతమైన బ్యాటింగ్ శైలి, మైదానంలో చురుకైన ఫీల్డింగ్ కలగలిపి అసలైన వన్డే క్రికెటర్‌గా ఎదిగాడు. వికెట్ల మధ్య చురుకైన సింగిల్స్, వికెట్లకు అడ్డంగా వెళ్లి లెగ్‌సైడ్ వైపు షాట్లు ఆడటం, పేసర్ల బౌలింగ్‌లో కూడా క్రీజ్ వదలి ముందుకు దూసుకొచ్చి పరుగులు రాబట్టడం...టి20 క్రికెట్లో ఇప్పుడు చూస్తున్న ఇలాంటి శైలి ఆటను జోన్స్ 80వ, 90వ దశకాల్లోనే వన్డేల్లో చూపించాడు. నాటి రోజుల్లోనే అతను సుమారు 45 సగటుతో పరుగులు చేయడం విశేషం. అయితే జోన్స్ కెరీర్ మొత్తానికి హైలైట్‌గా నిలిచిన ఇన్నింగ్స్ 1986లో మద్రాసులో భారత్‌తో జరిగిన చారిత్రాత్మక ‘టై’ టెస్టులో వచ్చింది. తీవ్రమైన ఎండ, ఉక్కపోత మధ్య ఏకంగా 502 నిమిషాలు క్రీజ్‌లో నిలిచిన జోన్స్... 330 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లతో 210 పరుగులు చేయడం అతడిని చిరస్థాయిగా నిలబెట్టింది. ఆట ముగిసిన తర్వాత హాస్పిటల్‌కు తీసుకెళ్లి జోన్స్‌కు సెలైన్లు ఎక్కించాల్సి వచ్చింది. -
బ్రెట్ లీ ఉన్నా సేవ్ చేయలేకపోయాడు!
ముంబై: ప్రముఖ వ్యాఖ్యాత, ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ గుండె పోటుకు గురై ఈరోజు(గురువారం) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే డీన్ జోన్స్‌కు గుండె పోటు వచ్చిన సమయంలో ఎవరూ ఆయన వద్ద లేరా అని ఇప్పటివరకూ అభిమానుల్లో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంది. కాగా, జోన్స్ వెంట ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఉన్నాడట. వీరిద్దరూ కలిసి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత హోటల్ లాబీలో ఉన్నారట. (చదవండి: జోన్స్ ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే) వీరిద్దరూ బ్రేక్ ఫాస్ట్ చేసి వచ్చిన కాసేపటికి జోన్స్ కు హార్ట్ ఎటాక్ గురయ్యారు. జోన్స్‌ను కాపాడటానికి లీ చేసిన ప్రయత్నం ఫలిచం లేదు. సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్-శ్వాస పునరుద్ధరణ ప్రక్రియ) చేసినా జోన్స్ ను కాపాడలేకపోయాడు. సీపీఆర్ చేసినా జోన్స్‌ను కాపాడలేకపోయాననే పశ్చాత్తాపం బ్రెట్లీలో కనబడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్ ముంబైలో ఉన్నారు. జోన్స్‌తో పాటు బ్రాడ్ కాస్టింగ్ కామెంటరీ చేస్తున్నాడు. కాగా, మధ్యాహ్నం గం.11.30 నుంచి గం 12.00 మధ్యలో డీన్ జోన్స్ తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో తుదిశ్వాస విడిచారు. ఆసీస్ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్ ఆడారు. తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తారు. (చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్ ఇకలేరు..) -
జోన్స్ ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ కన్నుమూశారనే వార్త క్రికెట్ ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. ఐపీఎల్-13 సీజన్లో భాగంగా ముంబైలో ఉండి బ్రాడ్‌కాస్టింగ్ కామెంటరీ అందిస్తున్న జోన్స్.. ఈ రోజు(గురువారం) మధ్యాహ్న ఒంటి గంట ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. గుండె పోటుకు గురైన జోన్స్ మృతి చెందడంపై క్రీడాలోకం ఘనంగా నివాళులు అర్పిస్తోంది. ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్‌లతో పాటు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌లు జోన్స్‌కు నివాళులు అర్పించారు. ఈ మేరకు తమ ట్వీట్ల ద్వారా సానుభూతి తెలిపారు.(చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్ ఇకలేరు..) ఉదయం బానే ఉన్నారు..: ఇర్ఫాన్ ‘జోన్స్ లేరనే వార్త షాక్‌కు గురి చేసింది. చాలా కలత చెందా. ఆయన ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే ఈ చేదు వార్త వినాల్సి వచ్చింది. నేను రెండు రోజుల క్రితం జోన్స్ కుమారుడితో మాట్లాడా. అప్పటికి ఆయనకు ఎటువంటి సమస్య లేదు. అంతా నార్మల్‌గానే ఉంది. జోన్స్ మృతిచెందారనే వార్తను నమ్మలేకపోతున్నా’ అని ఇర్ఫాన్ సంతాపం వ్యక్తం చేశాడు. షాక్‌కు గురయ్యా..: కోహ్లి ‘జోన్స్ చనిపోయారనే వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబానికి, ఆయన స్నేహితులకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దాం’ అని కోహ్లి తన ట్వీట్లో సంతాపం తెలిపాడు. మిమ్మల్ని మిస్సవుతున్నాం..: వార్నర్ ‘ఈ వార్తను నమ్మలేకపోయా. చాలా బాధాకరం. జోన్స్ ఆత్మకు శాంతి చేకూరాలి. డీయోనో.. నిన్ను మిస్సవుతున్నాం’ అని వార్నర్ ట్వీట్ చేశాడు. అతని కామెంటరీని ఎంజాయ్ చేసేవాళ్లం: కైఫ్ ‘జోన్స్ కామెంటరీనీ ఎంజాయ్ చేసేవాళ్లం. మీ అసాధారణ బ్యాటింగ్, ప్రొఫెషనల్ అనాలిసిస్ ఎప్పుడూ అద్భుతమే. మిమ్మల్ని టీవీలో చూసే అవకాశాన్ని మిస్సవుత్నున్నాం. మీతో కలిసి క్రికెట్ విశ్లేషణ ఇక ఉండదు అనేది జీర్ణించుకోలేకపోతున్నాం’ అని కైఫ్ పేర్కొన్నాడు. -
ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్ ఇకలేరు..
-
ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్ ఇకలేరు..
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్(59)ఇకలేరు. ఈరోజు గుండె పోటుకు గురైన డీన్‌జోన్స్ కన్నుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్ ముంబైలో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుకు గురైన జోన్స్ తుదిశ్వాస విడిచారు. ఆసీస్ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్ ఆడారు. తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తారు. 1984-1992 మధ్య కాలంలో ఆసీస్ తరఫున క్రికెట్ ఆడారు జోన్స్. టెస్టు క్రికెట్లో 3,631 పరుగుల్ని జోన్స్ సాధించగా, అందులో 11 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టు కెరీర్లో రెండు డబుల్ సెంచరీలు జోన్స్ సాధించాడు. ఇక వన్డే కెరీర్లో 7 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీల సాయంతో 6,068 పరుగులు సాధించారు. వన్డేల్లో జోన్స్ సగటు 44. 61గా ఉంది. 1986లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జోన్స్ డబుల్ సెంచరీ సాధించారు. ఆ టెస్టు టైగా ముగిసింది. జోన్స్ వీరోచిత బ్యాటింగ్‌తో ఆసీస్ ఓడిపోయే టెస్టు మ్యాచ్‌ను టైగా ముగించింది. జోన్స్ తన ఫస్టక్లాస్ కెరీర్లో 51.85 సగటుతో 19,188 పరుగులు సాధించారు. ఆయన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 324 నాటౌట్. చాంపియన్ కామెంటేటర్ జోన్స్ మృతిని ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ధృవీకరించింది. ‘ జోన్స్ ఇకలేరు. ఇది చాలా విషాదకరమైన ఘటన. ఈ వార్తను షేర్ చేయడం కలిచి వేస్తోంది. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో జోన్స్ ప్రాణాలు విడిచారు. ఆయన మృతికి నివాళులర్పిస్తున్నాం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మేము ఆస్ట్రేలియా హై కమిషన్‌తో టచ్‌లో ఉన్నాం. జోన్స్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దక్షిణాసియాలో క్రికెట్ అభివృద్ధి చెందడానికి జోన్స్ ఎంతో కృషి చేశారు. ఈ గేమ్‌కు ఆయనొక గొప్ప అంబాసిడర్. ఆయనకు క్రికెట్ అంటే ప్రాణం. ఎప్పుడూ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుండే వారు. కామెంటరీలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఒక చాంపియన్ కామెంటేటర్. జోన్స్ కామెంటరీకి లక్షలాది అభిమానులున్నారు. ఆయన్ని మాతో పాటు ఫ్యాన్స్ కూడా మిస్సవుతున్నందుకు చింతిస్తున్నాం’ అని స్టార్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. -
‘అది కోహ్లికి ఆక్సిజన్‌లా పనిచేస్తుంది’
న్యూఢిల్లీ: ఇప్పటికే పలు క్రికెట్ జట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని స్లెడ్జ్ చేయడాన్ని దాదాపు నిలిపేశాయనే చెప్పాలి. ప్రధానంగా ఆస్ట్రేలియా జట్టు కోహ్లిని స్లెడ్జ్ చేసే సాహసం చేయడం లేదు. కోహ్లిని రెచ్చగొడితే దానికి పర్యావసనం తీవ్రంగా ఉంటుందనే దానికి దూరంగా ఉంటుంది ఆసీస్. సాధారణంగా ప్రతీ ప్లేయర్‌ని మాటలతో రెచ్చగొట్టే ఆసీస్.. కోహ్లి విషయంలో మాత్రం కాస్త ఆచితూచి వ్యహరిస్తోంది. కోహ్లిని స్లెడ్జ్ చేసి మూల్యం చెల్లించుకోవద్దని ఇప్పటికే పలువురు విశ్లేషకులు అభిప్రాయపడగా, ఆసీస్ దిగ్గజ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాడు. (అచ్చం స్మిత్‌ను దింపేశావ్‌గా..) ఒకవేళ కోహ్లిని స్లెడ్జ్ చేస్తే అది అతనికి అది ఆక్సిజన్‌లా పనిచేస్తుందన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లిని స్లెడ్జింగ్ చేసి రెచ్చగొట్టడానికి ప్రయత్నించవద్దన్నాడు. ఎలుగుబంటిని రెచ్చగొడితే ఎటువంటి పర్యావసానాలు ఉంటాయో, కోహ్లిని రెచ్చగొట్టినా కూడా అదే విధంగా ఉంటుందన్నాడు. ఈ సీజన్ చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనున్న నేపథ్యంలో డీన్ జోన్స్ ముందుగా ఆ జట్టు క్రికెటర్లను హెచ్చరించాడు. ఈ క్రమంలోనే కోహ్లిని ఆసీస్ క్రికెటర్లు రెచ్చగొట్టకపోవడానికి ఐపీఎల్లో ఆడటమే కారణమన్న ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వ్యాఖ్యలను జోన్స్ ఖండించాడు. క్లార్క్ వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. ఏ క్రికెటర్‌నైనా ఐపీఎల్ ఆడకుండా కోహ్లి చేస్తాడనడం సమంజసం కాదన్నాడు. అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు. ఆ తరహా వ్యాఖ్యలు క్లార్క్ ఎందుకు చేశాడో తనకు అర్థం కావడం లేదన్నాడు. గత పర్యటనలో ఆసీస్ జట్టు ప్రణాళికలో భాగంగానే కోహ్లిని స్లెడ్డింగ్ చేయలేదన్నాడు. ఇక ముందైనా ఇలా చేయడమే ఆసీస్ జట్టుకు శ్రేయస్కరమన్నాడు. ప్రధానంగా భారత క్రికెట్ జట్టులో కోహ్లి, ధోనిలను రెచ్చగొట్టకుండా ఉండటమే ఉత్తమం అని జోన్స్ అభిప్రాయపడ్డాడు. (హార్దిక్ మాటల్లో ఆంతర్యం ఏమిటి?) -
ఇదేం పని జోన్స్.. ట్రోల్ చేసిన ఆకాష్
హైదరాబాద్: ప్రత్యర్థి ఆటగాళ్లను దూషించడం, ఎగతాళి చేయడంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ముందు వరుసలో ఉంటారనేది జగమెరిగిన సత్యం. ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు విదేశీ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ హేళన చేస్తూ మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్, వ్యాఖ్యాత డీన్ జోన్స్ కూడా అనేక మార్లు పలువురు క్రికెటర్లను అవహేళన చేస్తూ మాట్లాడటం, ట్వీట్లు చేయడం జరిగింది. అయితే ఒకరిపై వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయన్న నానుడి డీన్ జోన్స్ విషయంలో తేటతెల్లమైంది. 1990లలో టీమిండియాతో జరిగిన ఓ టెస్టు సందర్భంగా డీన్ జోన్స్ ఆడిన తొండటకు సంబంధించిన వీడియోను మాజీ టెస్టు ఓపెనర్ ఆకాష్ చోప్రా తన ట్విటర్లో పోస్ట్ చేసి ట్రోల్ చేశాడు. ఈ వీడియోలో లెఫ్టార్మ్ స్పిన్నర్ వెంకటపతి రాజు వేసిన బంతిని జోన్స్ ముందుకు వచ్చి ఆడబోయాడు. అయితే బంతి బ్యాట్‌కు తగలకుండా బ్యాట్స్‌మన్ ప్యాడ్స్‌కు తగిలి నెమ్మదిగా కీపర్ వైపు వెళ్లింది. అయితే వెంటనే డీన్ జోన్స్ ఆ బంతిని చేతితో అడ్డుకుని బౌలర్‌వైపు విసిరాడు. ఈ విషయాన్ని గమనించిన భారత కీపర్ అంపైర్ వైపు అసహనంగా చూశాడు. కానీ అంపైర్‌తో సహా అందరూ బంతి బ్యాట్/కాలికి తగిలి బౌలర్ వైపు వచ్చింది అనుకున్నారు. కానీ రిప్లైలో చూస్తే జోన్స్ బంతిని చేతితో విసిరినట్టు తేలింది. అయితే ఈ వీడియోను ఆకాష్ చోప్రా ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘బంతిని చేతితో అడ్డుకొని ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించారు. మీరు అక్కడ ఏం చేశారు? దీనిని నుంచి ఎలా బయటపడ్డారు’అనే కామెంట్‌ను జతచేశాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొండాట ఆడటం ఆసీస్ క్రికెటర్లకే సాధ్యమని.. అది కచ్చితంగా అవుటేనని పేర్కొన్న నెటిజన్లు ఇదేం పని జోన్స్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై డీన్ జోన్స్ ఎలా స్పందిస్తాడో చూడాలి. Handling the ball. Obstructing the field. @ProfDeano, what did you do there? And how did you get away with it?? 🤦♂️🤷♂️ https://t.co/3edCHomneC — Aakash Chopra (@cricketaakash) April 8, 2020 చదవండి: డీన్ జోన్స్‌కు పార్థీవ్ అదిరిపోయే పంచ్ ‘మనసులో మాట.. ఆల్‌రౌండర్‌గా మారాలి’ -
డీన్ జోన్స్‌కు పార్థీవ్ అదిరిపోయే పంచ్
బెంగళూరు: వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పార్థీవ్ పటేల్‌ను జట్టుతో పాటే ఉంచుకుంది. గత సీజన్లో పార్థీవ్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేయడంతో పార్థీవ్నే అట్టిపెట్టుకుంది. 2019 సీజన్లో పార్థీవ్ పలు మంచి ఇన్నింగ్స్‌లు ఆడి 373 పరుగులు చేశాడు. దాంతో పార్థీవ్‌పై మరొకసారి నమ్మకం ఉంచింది ఆర్సీబీ యాజమాన్యం. కాగా, పార్థీవ్ను తిరిగి జట్టులో కొనసాగించడంపై ఆసీస్ మాజీ క్రికెటర్, క్రికెట్ విశ్లేషకుడు డీన్ జోన్స్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘ పార్థీవ్ను అట్టిపెట్టుకున్నారా. అసలు ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరక్టర్ ఎవరు? అని ట్వీట్ చేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన పార్థీవ్ పటేల్ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ‘ మీరు ప్రశాంతంగా ఉంటే మంచిది. వచ్చే ఐపీఎల్లో మీ సెలక్ట్ డగౌట్లో కూర్చుని మ్యాచ్‌లు చూస్తే బాగుంటుంది’ అని పేర్కొన్నాడు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. 2018లో తిరిగి ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పట్నుంచీ పార్ధీవ్ తుది జట్టులో చోటుకు ఎటువంటి ఢోకా ఉండటం లేదు. వికెట్ కీపరే కాకుండా ఓపెనర్ కూడా కావడంతో పార్థీవ్ ఆర్సీబీ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటూ వస్తున్నాడు. 2014లో ఆర్సీబీ తరఫున పార్థీవ్ ఆడాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు కూడా పార్థీవ్ ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్లో 139 మ్యాచ్‌లు ఆడిన పార్థీవ్ 22.60 సగటుతో 2,848 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 13 హాఫ్ సెంచరీలు చేయగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 81. -
అప్పుడు రెండొందలు కొడితే బంతి మార్చేవారు..!
సిడ్నీ: భారత్ తొలి డే అండ్ నైట్ టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. నవంబర్ 22 నుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టుకు మంచు ప్రభావం చూపే అవకాశం ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ఓ సలహా ఇచ్చాడు. గులాబి బంతి తడిస్తే కొత్తది తీసుకుంటే సరిపోతుందని చెప్పాడు. ఈ సందర్భంగా డీన్ జోన్స్ మాట్లాడుతూ ..‘డే అండ్ నైట్ టెస్టు గొప్ప ముందడుగు. మంచు ప్రభావం గురించి తప్పక ఆలోచించాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ బంతి తడిస్తే కొత్త బంతిని తీసుకోండి. ఆట నిబంధనలు మారుతున్నాయి. ఉదాహరణకు బ్రాడ్‌మన్ కాలంలో ఒక జట్టు 200 పరుగులు చేస్తే రెండో కొత్త బంతి ఇచ్చేవారు. మనం రాత్రిపూట ఆడుతున్నాం. ఒకవేళ బంతి తడిస్తే మార్చేయండి. నా దృష్టిలోనైతే ఇది తేలికైన పని. సౌరవ్ గంగూలీ టెస్టు క్రికెట్‌తో పాటు రాత్రిపూట క్రికెట్‌కు అభిమాని అని తెలుసు’ అని డీన్ జోన్స్ వెల్లడించాడు. ‘రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా గులాబి టెస్టులదే. ప్రస్తుతం ప్రజలు బిజీగా గడుపుతున్నారు. గులాబి టెస్టులకు ఆస్ట్రేలియాలో రేటింగ్స్ బాగున్నాయి. సంప్రదాయ టెస్టులతో పోలిస్తే ఎంత భారీస్థాయిలో ఉన్నాయో చెప్పలేను. బిజీగా ఉండటంతో పగటి పూట టెస్టు క్రికెట్ చూడటం జనాలకు కష్టమవుతోంది. గులాబి బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అలవాటు పడితే సులభంగానే ఉంటుంది’ అని జోన్స్ అన్నాడు.(ఇక్కడ చదవండి: ‘పింక్ బాల్’ ఎందుకు గుచ్చుకుంటోంది! ) -
ధోనికి చోటు.. కోహ్లికి నో చాన్స్!
మెల్బోర్న్: తమ కలల జట్టు ఇదేనంటూ ప్రకటించడం మాజీ క్రికెటర్లకు ఓ సరదా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన ఎలెవన్ ఇదేనంటూ వార్తల్లో నిలుస్తారు. ఎప్పుడూ వివాదాలను వెంట మోసుకుని తిరిగే ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ తన డ్రీమ్ టీ20 జట్టును తాజాగా ప్రకటించాడు. ఇందులో అసలు టీ20 ఫార్మాట్‌తో పరిచయం లేని దిగ్గజ క్రికెటర్లను మరీ ఎంపిక చేశాడు జోన్స్. అయితే టీ20 క్రికెట్‌తో సంబంధం లేకపోయినా వారు పరిస్థితులకు తగ్గట్టు ఆడే ఆటగాళ్లుగా భావించే ఒక జట్టును ఎంపిక చేసుకున్నాడు. ఇక్కడ ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌తో పాటు విండీస్ మాజీ ఓపెనర్ గోర్డన్ గ్రీనిడ్జ్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. ఇక మూడో స్థానంలో వివ్ రిచర్డ్స్కు చోటిచ్చాడు. బ్రియాన్ లారా, ఎంఎస్ ధోని, మార్టిన్ క్రోలను మిడిల్ ఆర్డర్లో ఎంచుకున్నాడు. కాగా, భారత్ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ధోనిని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేసిన జోన్స్.. విరాట్ కోహ్లికి చాన్స్ ఇవ్వలేదు. జోన్స్ డ్రీమ్ టీ20 జట్టు ఇదే.. మాథ్యూ హేడెన్, గ్రీనిడ్జ్, వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, మార్టిన్ క్రో, ఇయాన్ బోథమ్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, వసీం అక్రమ్, ఆంబ్రోస్, జోయల్ గార్నర్ -
కోహ్లి మోనాలిసా పెయింటింగ్లాంటోడు!
సిడ్నీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లి రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవిదేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్, మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ టీమిండియా సారథిపై ప్రశంసలు జల్లు కురిపించారు. కోహ్లి బ్యాటింగ్ చేస్తుంటే అలానే చూడాలనిపిస్తుందని పేర్కొన్నాడు. షాట్ సెలక్షన్, టైమింగ్‌లో ప్రస్తుత క్రికెటర్లలో కోహ్లిని మించిన వారెవరూ లేరని పొగడ్తలతో ముంచెత్తాడు. కేవలం స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ కోహ్లి అదరగొడుతుండటం అతని ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించాడు. కోహ్లితో జాగ్రత్తగా ఉండమని ఆసీస్ ఆటగాళ్లను కూడ హెచ్చరించాడు. (సచిన్ రికార్డులపై కన్నేసిన కోహ్లి) ‘కోహ్లి బ్యాటింగ్‌లో లోపాలను వెతకాలనుకోవడం.. మోనాలిసా పెయింటింగ్‌లో తప్పులను వెతకడంవంటిది. ఏ జట్టయినా అతన్ని కవర్ డ్రైవ్ ఆడకుండా చూడాలి. ఆస్ట్రేలియా బౌలర్లూ అదే పని చేయాలి. పిచ్‌పై వేర్వేరు ప్రాంతాల్లో బౌలింగ్ చేయాలి. అతని వికెట్ దక్కాలని అనుకునే బౌలర్లు వైవిధ్యమైన బంతులేయాలి’అంటూ డీన్ జోన్స్ పేర్కొన్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో అదరగొట్టడం ఖాయమని జోన్స్‌తో సహా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆసీస్‌లోనూ కోహ్లికి ఘనమైన రికార్డే ఉంది. ఆసీస్ గడ్డపై ఎనిమిది టెస్టుల్లో ఐదు శతకాల సహాయంతో 992 పరుగులు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో మరో రెండు శతకాలు సాధిస్తే సచిన్ టెండూల్కర్(6) రికార్డును కోహ్లి అధిగమించే అవకాశం ఉంది. (కోహ్లికైతే ఇలాగే చేస్తారా: గావస్కర్) -
భారత్ సిరీస్ నెగ్గక పోతేనే ఆశ్చర్యం!
సిడ్నీ : ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గకపోతేనే ఆశ్చర్యమని ఆ జట్టు మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ సిరీస్ నెగ్గేందుకు కోహ్లిసేనకు ఇదే మంచి అవకాశమని చెప్పుకొచ్చాడు. రెండు నెలలు సుదీర్ఘంగా సాగే ఈ పర్యటనలో భారత్, ఆసీస్‌తో 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ముందుగా ఈ నెల 21 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే కోహ్లిసేనకు మాత్రం డిసెంబర్ 6న ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌తోనే అసలు పరీక్ష ఎదురుకానుంది. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గని టీమిండియాకు ఇదో అద్భుత అవకాశమని డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ కంట్రీ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్‌లో అశ్విన్ చెలరేగుతాడనుకుంటున్నా. గత పర్యటనల్లో అతను రాణించాడు. అప్పుడు అతని ప్రదర్శనతో భారత్ గెలిచేంత పనిచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ఇదో మంచి అవకాశం. ఇప్పటి వరకు వారు ఇక్కడ టెస్ట్ సిరీస్ నెగ్గలేదు. ఇప్పుడు కూడా నెగ్గకపోతే ఆశ్చర్యపోవాల్సిందే. అశ్విన్‌కు తోడుగా కుల్దీప్కు జతయ్యాడు. అతను కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆసీస్ జట్టులో స్పిన్ బౌలింగ్ ఎదుర్కునే సత్తా పీటర్ హ్యాండ్స్కోంబ్, ఆరోన్ ఫించ్లకే ఉంది. ఈ ఇద్దరు అశ్విన్-కుల్దీప్లను ఎదుర్కుంటారని భావిస్తున్నా’ అని తెలిపాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లికి ఇక్కడ మంచి రికార్డే ఉంది. మొత్తం ఇక్కడ 8 మ్యాచ్‌లాడిన ఈ రన్ మెషిన్ 62 సగటుతో 992 పరుగులు చేశాడు. 169 పరుగుల అత్యధిక స్కోర్ ఐదు సెంచరీలు సాధించాడు. 2014-15 పర్యటనలో సైతం కోహ్లి బ్యాట్‌తో చెలరేగాడు. 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలతో 692 పరుగులు చేసి ప్రతీ మ్యాచ్ గెలిపించేంత పనిచేశాడు. టెస్ట్ సిరీస్ నెగ్గి ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించాలంటే కోహ్లి సేనకు ఇదే సదావకాశమని క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఆస్ట్రేలియా బయల్దేరిన టీమిండియా -
‘కోహ్లి సేన నం.1 జట్టు కానే కాదు’
హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్లు నోటి దురుసు ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ సారి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవటం వారికి అలవాటు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ పనికట్టుకొని టీమిండియాపై విమర్శలు చేస్తున్నాడు. కోహ్లి సేనను విమర్శిస్తునే పాకిస్తాన్ జట్టును పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. పాకిస్తాన్ జట్టుతో టీమిండియా టెస్టులు ఆడటంలేదు కాబట్టి నంబర్ వన్ జట్టు ఎలా అవుతుందని జోన్స్ ప్రశ్నిస్తున్నాడు. చాంపియన్ జట్టంటే అన్ని జట్లతో ఆడి గెలవాలని, కానీ బలమైన పాక్‌తో తలపడితేనే కోహ్లి సేన అసలు ఆట బయటపడుతుందంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఫీల్డింగ్ గల జట్టని అభివర్ణించాడు. అయితే జోన్స్‌కు పాకిస్తాన్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ‘మీరు నోరు మూసుకుంటే మంచిది’ అంటూ నెటిజన్లు జోన్స్‌ను ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ముందు వ్యాఖ్యాతగా నిష్పక్షపాతంగా ఉండాలని కొందరు సూచించారు. (కోహ్లిని ఎగతాళి చేస్తూ..) గతంలో కూడా టీమిండియాపై జోన్స్ తన అక్కసును వెల్లగక్కాడు. పాకిస్తాన్లో ఆడితే ఏం చనిపోరని భారత ఆటగాళ్లను, బోర్డును అనడం అప్పట్లో వివాదస్పదమయ్యాయి. ఇక ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా రెండు రోజుల్లో హాంకాంగ్, పాకిస్తాన్ జట్లతో తలపడాల్సి వచ్చినప్పుడు బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేయగా.. వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన ఎవరూ చనిపోరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇలా అవసరం లేకున్నా టీమిండియాపై విమర్శంచిడం, వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: ఆ మాత్రానికే చచ్చిపోరులే: డీన్ జోన్స్ -
ఆ మాత్రానికే చచ్చిపోరులే: మాజీ క్రికెటర్
బ్రిస్బేన్: ఆసియాకప్‌లో భారత క్రికెట్ జట్టు వరుస మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన ఎవరూ చచ్చిపోరని ఆసీస్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నెల్లో ఆరంభం కానున్న ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు.. క్వాలిఫయర్ మ్యాచ్ ఆడిన మరుసటి రోజే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తలపడనుంది. దీనిపై గతంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది. అసలు బుర్రుండే షెడ్యూల్‌ను ఖరారు చేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలకమైన మ్యాచ్‌కి ముందు కనీసం ఒక్కరోజు కూడా భారత ఆటగాళ్లకి విశ్రాంతి లేకపోతే ఎలా..? అని ప్రశ్నించింది. అయితే దీనిపై తాజాగా స్పందించిన డీన్ జోన్స్.. వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన ఎవరూ చనిపోరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తాము క్రికెట్ ఆడిన రోజుల్లో బ్యాక్ టూ బ్యాక్ వన్డేలు ఆడేవాళ్లమని, ఇక టెస్టుల విషయానికొస్తే 11 రోజుల మ్యాచ్‌లను మూడుసార్లు ఆడామంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం క్రికెటర్లు ప్రతీ దానికి ఏదొక ఫిర్యాదు చేయడం అలవాటు మార్చుకున్నారని, తమ రోజుల్లో వరుస మ్యాచ్‌లు ఆడటానికే చూసేవాళ్లమన్నాడు. ఈ తరం క్రికెటర్లు అథ్లెట్ తరహాలో ఫిట్‌గా ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు వరుసగా ఆడటానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించాడు. ఆసియాకప్ షెడ్యూల్లో సెప్టెంబర్ 18న క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత రోజు పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో పాల్గొనుంది. -
డీన్ జోన్స్ తర్వాత కోహ్లినే..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా కోల్పోయినప్పటికీ కోహ్లి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొలి వన్డేలో 75 పరుగులు చేసిన కోహ్లి.. రెండో వన్డే 45 పరుగులు సాధించాడు. ఇక మూడో వన్డేలో 71 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రెండు రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్లోనే అత్యధికంగా 911 పాయింట్లను కోహ్లి సాధించాడు. 1991లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ (918) తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన క్రికెటర్ కోహ్లినే కావడం విశేషం. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. బౌలర్లలో 8 స్థానాలు ఎగబాకి కెరీర్లోనే అత్యుత్తమంగా ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరో స్పిన్నర్ చాహల్ 10వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
ఐపీఎల్: ఆమెనే బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టార్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు చూసేవారికి ఆమె సుపరిచితురాలు. ప్రతిరోజు ప్రత్యర్థి జట్లు మారతాయి. కానీ మ్యాచ్ ఉంటే చాలు ఆమె స్టేడియంలో ప్రత్యక్షమవుతారు. ఆమె మరెవరో కాదు స్పోర్ట్స్ జర్నలిస్ట్, కామెంటెటర్ మయాంతి లాంగర్. టీమిండియా క్రికెటర్ స్టూవర్ట్ బిన్నీ భార్యగా తొలుత ప్రపంచం ఆమెను గుర్తించినా, ప్రస్తుతం తన ప్రొఫెషనల్ వర్క్‌తో ఆమె ఆకట్టుకుంటున్నారు. మయాంతిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటెటర్ డీన్ జోన్స్ ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు. ఐపీఎల్లో తాను ఎంతో మంది గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. కానీ అందరిలోనూ మయాంతి లాంగర్ బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టార్ అని కితాబిచ్చారు. ఆమె తన వృత్తిపట్ల ఎంతో నిబద్దతతో ఉంటారని, గ్రేట్ జాబ్ మయాంతి అని ట్వీట్లో రాసుకొచ్చారు మాజీ క్రికెటర్ డీన్ జోన్స్. ఐపీఎల్లో మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే చర్చలో ఆమె తన విలువైన అభిప్రాయాలను షేర్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. యాంకర్, కామెంటెటర్ మయాంతి లాంగర్ భర్తే క్రికెటర్ బిన్నీ అంటూ నెటిజన్లు తరచుగా కామెంట్లు చేయడం తెలిసిందే. As much as I have loved working with many of the greats on this @IPL. Our BEST and BIGGEST STAR is @MayantiLanger_B !!! She is soooo good at her job. And all of us at @StarSportsIndia #kentcricketlive & #SelectDugout are in awe of how good she is! Great job Mayanti 👏🏻👏🏻👏🏻 pic.twitter.com/8Z5ukO6vUW — Dean Jones (@ProfDeano) 26 May 2018 -
రో‘హిట్’కు ఇది భయానకమైన సిరీస్
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో కోల్పోగా, కోహ్లీ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక ఆటగాడు రోహిత్ శర్మతో పాటు మురళీ విజయ్, రాహుల్‌ల ఆటతీరును మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటెటర్ డీన్ జోన్స్ హార్డ్ హిట్టర్ రోహిత్ శర్మకు కొన్ని విలువైన సూచనలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 2017లో రోహిత్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని నిలకడగల ఆటగాడు అజింక్య రహానేను పక్కనపెట్టారు. అయితే అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన రోహిత్ నైపుణ్యం ఉన్న ఆటగాడే కానీ, డిఫెన్స్ బ్యాటింగ్ చేయకపోవడం వల్లే విఫలమవుతున్నాడని జోన్స్ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో డిఫెన్స్ ఆటతీరు (రక్షణాత్మక ధోరణి) 70 శాతం ఉంటుందని, అదే వన్డేల విషయానికొస్తే 40 శాతం ఉంటుందన్నాడు. వన్డేల్లో డిఫెన్స్ ఆడే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కనుక, రోహిత్ నిర్దాక్షిణ్యంగా బౌలర్లపై విరుచుకుపడి పరుగులు సాధించేవాడు. కానీ టెస్టుల్లో నిలదొక్కుకోవాలన్నా, నిలకడగా పరుగులు చేయాలన్నా దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ ల తరహాలో డిఫెన్స్ నైపుణ్యాన్ని అలవరుచుకోవాలని రోహిత్ శర్మకు జోన్స్ సూచించాడు. టెస్టుల్లో మొదట రాణించలేడని పేరున్న విరాట్ కోహ్లీ డిఫెన్స్ ఆటతీరుతో శతకాల మీద శతకాలు చేశాడని గుర్తుచేశాడు. కేప్‌టౌన్, సెంచూరియన్ టెస్టుల్లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రోహిత్ కేవలం 19.50 సగటుతో 78 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లీ, రోహిత్‌పై నమ్మకం ఉంచి రెండో టెస్టులోని ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాస్తవానికి రోహిత్ విఫలమైన భయంకరమైన సిరీస్ అని అభిప్రాయపడ్డాడు. టెక్నిక్ మెరుగు పరుచుకున్న రోహిత్.. షాట్ల ఎంపికతో పాటు డిఫెన్స్ ఆటతీరుతోనే జట్టుకు విజయాలు అందించగలడని ఆసీస్ మాజీ క్రికెటర్ విలువైన సూచనలిచ్చాడు. -
సెహ్వాగ్‌ను మార్చేశా!
బ్రిస్బేన్:ప్రపంచ క్రికెట్లో పరుగుల వరద సృష్టిస్తూ వరుస రికార్డులను కొల్గగొడుతున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానుల జాబితాలో ఇప్పుడు ఆసీస్ దిగ్గజ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ కూడా చేరిపోయాడు. గత నెల్లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో విరాట్ కోహ్లి చేసిన సెంచరీని ఎగతాళి చేసిన డీన్ జోన్స్.. తాజాగా తాను విరాట్ కోహ్లికి అభిమానిని అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. దూకుడుగా ఆడే కోహ్లి స్వభావమే అతనికి తనను అభిమానిని చేసిందంటూ పేర్కొన్నాడు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి నా అభిమాన ఆటగాడిగా మారిపోయాడు. వీరేంద్ర సెహ్వాగ్ స్థానాన్ని అతడు భర్తీ చేశాడు. ఎందుకంటే కోహ్లికి ముందు నేను సెహ్వాగ్ అభిమానిని. దూకుడుగా ఆడే కోహ్లి స్వభావం నాకు ఎంతో నచ్చుతుంది. ఎలాంటి పిచ్‌పైన అయినా అతడు సులువుగా పరుగులు రాబడతాడు. కోహ్లీలోని అత్యుత్తమ ఆటగాడిని కోచ్ రవిశాస్త్రి బయటకు తీశాడు. నేను సెహ్వాగ్ నుంచి కోహ్లికి మారిపోయా'అని డీన్ జోన్స్ పేర్కొన్నాడు.గత నెలలో న్యూజిలాండ్ తో సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీని ఎగతాళి చేస్తూ డీన్ జోన్స్ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లి ఆట బాగుంది. కానీ మళ్లీ అది న్యూజిలాండ్ పైనే సెంచరీ చేశాడు అంటూ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. -
ఈసారి కోహ్లిని ఎగతాళి చేస్తూ..
ముంబై: ఇటీవల భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో తమ జట్టు ఓటమి పాలుకావడాన్ని జీర్ణించుకోలేని ఆసీస్ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డీన్ జోన్స్.. భారత్ గెలుపుకు వర్షమే కారణమని వ్యాఖ్యానించి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. భారత జట్టు విజయం సాధించాలంటే వర్షం పడాలేమో అని వ్యాఖ్యానించాడు. దాంతో భారత అభిమానులు జోన్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీకేమైనా బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆసీస్ క్రికెట్ జట్టు తొండాటను ఆడటంలో ఎప్పుడూ ముందుంటుందని, దానికి ఆ దేశ మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తారనడానికి ఇదే నిదర్శమని విమర్శల వర్షం కురిసింది. అయితే ఈసారి న్యూజిలాండ్ తో సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీని ఎగతాళి చేస్తూ డీన్ జోన్స్ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లి ఆట బాగుంది. కానీ మళ్లీ అది న్యూజిలాండ్ అంటూ జోన్స్ ఎగతాళి చేశాడు. దీనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. కివీస్ ఆటను చూసి ఆసీస్ నేర్చుకోవాలంటూ జోన్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఆసీస్ కన్నా న్యూజిలాండ్ గట్టి జట్టు అనే విషయం తెలుసుకోవాలని చురకలంటించారు. మీరు 4-1 తో ఓడారు.. మళ్లీ ఓడాలంటే రండి అంటూ ఒక నెటిజన్ ఘాటుగా తిప్పికొట్టాడు. దీంతో ఆయనకు భారత అభిమానులు చురకలు అంటిస్తున్నారు. కివీస్‌ను చూసి ఆసీస్ క్రికెట్ ఆడటం నేర్చుకోవాలని అంటున్నారు. ఆసీస్ కన్నా కివీసే గట్టి జట్టు అని మరొకరు దెప్పిపొడిచారు. వారు గెలిచారు.. మీరు 4-1తో ఓడారు.. సాక్ష్యం కావాలంటే మళ్లీ రండి బాబూ అని ఓ నెటిజన్ గట్టిగా బదులిచ్చాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే విరాట్ కు 200వ వన్డే. ఆ మ్యాచ్ లో విరాట్ సెంచరీ చేసి తన కెరీర్ లో 31వ వన్డే సెంచరీ సాధించాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. -
భారత క్రికెటర్ ను పొగిడినా తప్పని తిప్పలు!
కోల్ కతా: భారత్ తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఓటమిని జీర్ణించుకోలేని ఆ దేశ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డీన్ జోన్స్.. భారత్ గెలుపుకు వర్షమే కారణమని వ్యాఖ్యానించి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. భారత జట్టు విజయం సాధించాలంటే వర్షం పడాలేమో అని వ్యాఖ్యానించాడు. దాంతో భారత అభిమానులు జోన్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీకేమైనా బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆసీస్ క్రికెట్ జట్టు తొండాటను ఆడటంలో ఎప్పుడూ ముందుంటుందని, దానికి ఆ దేశ మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తారనడానికి ఇదే నిదర్శమని విమర్శల వర్షం కురిసింది. అయితే మూడో వన్డేలో భారత విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న తరువాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కొనియాడిన జోన్స్ విమర్శలకు గురయ్యాడు. హార్దిక్ బౌలింగ్ యాక్షన్ అచ్చం వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ లా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక్కడ స్పీడ్ సంగతిని పక్కన పెడితే హోల్డింగ్ తరహాలోనే పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. కాగా, డీన్ జోన్స్ తాజా వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాండ్యాలాంటి సాధారణ బౌలర్ ని దిగ్గజ బౌలర్ హోల్డింగ్ తో ఎలా పోల్చావంటూ ఒక అభిమాని విమర్శించగా, నువ్వొక పెద్ద క్రికెట్ అభిమానిలా కనబడతావ్. కానీ క్రికెటర్లను ఎలా పోల్చాలి అనేది నీకు ఇంకా తెలియలేదు. నువ్వు ఎక్కువగా రేడియోలో క్రికెట్ ను ఫాలో అవుతావేమో అంటూ మరొక అభిమాని మండిపడ్డాడు.ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు అందులో పస ఉండాలనే సంగతి గుర్తు పెట్టుకో డీన్ జోన్స్ అంటూ మరో అభిమాని చురకలంటించాడు. ఆరంభపు మ్యాచ్ లోభారత జట్టు విమర్శించి విమర్శల పాలైన డీన్ జోన్స్, ఇప్పడు హార్దిక్ బౌలింగ్ యాక్షన్ పొగిడి విమర్శలను చవిచూడటం గమనార్హం. -
నీకేమైనా బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా?
చెన్నై: ఆస్ట్రేలియన్లు గెలుపు కోసం ఏమైనా చేస్తారు. ఈ విషయం చాలాసార్లు రుజువైంది కూడా. ఈ క్రమంలోనే ఓటమిని మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు. ఎక్కడైనా మాకు మేము సాటి అన్నచందంగా వ్యవరిస్తారు. తాజాగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ కు ఎదురైన ఓటమిని ఆ దేశ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ తేలిగ్గా తీసుకోలేకపోయారు. అలాగని ఆసీస్ క్రికెటర్ల పేలవ ప్రదర్శనను ఏమీ అనకపోగా, భారత్ గెలుపుకు వర్షమే కారణమంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. 'నా వరకూ అయితే టీమిండియా గెలుపుకు వర్షం సహకరించింది. వారు విజయం సాధించాలంటే వర్షం పడాలేమో. అయినా ఫర్వాలేదు. ఇక రెండో గేమ్ తో ఆసీస్ విజయాల బాట పట్టాలి' అంటూ టీమిండియా విజయాన్ని తక్కువ చేశారు. దీనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. నీకేమైనా బ్రెయినక్ ఫేడ్ అయ్యిందా?, గతంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆసీస్ క్రికెటర్లు తొండాటను ఆ దేశ మాజీలు సమర్దించారు. అప్పుడు ఆసీస్ క్రికెటర్లకి బ్రెయిన్ ఫేడ్ అయ్యింది. ఇప్పుడు మరో ఆస్ట్రేలియన్ ఆ జాబితాలో చేరిపోయాడు' అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, వర్షం అనేది రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ ఉపయోగపడుతుంది. నువ్వు కొంత క్రికెట్ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి ఉంది. తెలుసుకోలేక పోతే చాలా కష్టం 'అని మరొక అభిమాని చమత్కరించారు. 'నువ్వు కనుక ఫుట్ బాల్ ఆడినట్లయితే చాలా గొప్ప డిఫెండర్ కావడం ఖాయం' అని మరొక వ్యక్తి విమర్శించారు. -
ఒకసారి ధోని వీడ్కోలు చెబితే..
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టును ఉన్నతస్థానంలో నిలపడంలో కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని తనదైన ముద్రను వేశాడు. ఇప్పటికే టెస్టు మ్యాచ్‌లకు వీడ్కోలు చెప్పిన ధోని.. ప్రస్తుతం పరిమిత ఓవర్ల కెప్టెన్ గా మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ధోని ఒకసారి భారత క్రికెట్ నుంచి దూరమైతే ఆ వెలితి పూడ్చలేనిదని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్. తన క్రికెట్ జీవితానికి ధోని ముగింపు పలికితే భారత క్రికెట్ చాలా కోల్పోతుందన్నాడు. ' భారత్ క్రికెట్ కు ధోని చాలా చేశాడు. వీడ్కోలుపై నిర్ణయాన్ని ధోనికే వదిలేయండి. మనకున్న గొప్ప ఆటగాళ్లను బలవంతంగా బయటకు పంపుతూనే ఉన్నాం. ప్రస్తుతం ధోని కెప్టెన్సీపై ఒత్తిడి అనేది ఉండకూడదు. టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లిని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా చేసే సమయం ఇంకా రాలేదనేది నా అభిప్రాయం. ఇంకా అందుకు సమయం ఉంది. నిజంగా ధోని సేవల్ని కోల్పోతే భారత్ క్రికెట్ జట్టు చాలా కోల్పోతుంది 'అని జోన్స్ తెలిపాడు. ఏదొక రోజు ధోని క్రికెట్ కు వీడ్కోలు చెప్పే సమయం వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అయితే అప్పటివరకూ భారత క్రికెట్ పెద్దలు వేచి చూడక తప్పదని జోన్స్ అన్నాడు. అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన ధోనిలాంటి ఆటగాడ్ని భారత్ ఎప్పటీ తేలేదని జోన్స్ పేర్కొన్నాడు. -
' టెస్టు మ్యాచ్ లకు పింక్ బాల్ ఓ ఉత్ర్పేరకం'
కోల్ కతా: డే అండ్ నైట్ టెస్టులకు ఉపయోగించే పింక్ బంతుల పట్ల ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ డీన్ జోన్స్ హర్షం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌ను కాపాడుకోవడానికి పింక్ బంతి ఓ ఉత్ర్పేరకంగా ఉపయోగడపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.టెస్టు క్రికెట్ కు ఆదరణ తగ్గిపోతున్న దశలో పింక్ బంతులతో డే అండ్ నైట్ టెస్టులకు శ్రీకారం చుట్టడం నిజంగా అభినందనీయమన్నాడు. పింక్ బాల్ అనేది టెస్టు క్రికెట్‌ను రక్షించడమే కాదు.. టెస్టు క్రికెట్‌కు ఒక ఉత్రేరకంగా కూడా పని చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని డీన్ జోన్స్ పేర్కొన్నాడు. గతేడాది నవంబర్‌లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ ఒక అద్భుతమైన ప్రయోగమన్నాడు. తొలుత డే అండ్ నైట్ వన్డేలు ప్రవేశపెట్టినప్పుడు కూడా పింక్ బాల్ ప్రయోగం ఫలించదనే అభిప్రాయం ఉండేదని, ఆ తరువాత అది తప్పని నిరూపితమైందని డీన్ జోన్స్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
'టీ 20 క్రికెట్ లో టీమిండియా మెరుగ్గా ఉంది'
అడిలైడ్: ట్వంటీ 20 క్రికెట్ లో టీమిండియా జట్టు సమతుల్యంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే ట్వంటీ 20 సిరీస్ కు ఎంపిక చేసిన టీమిండియా జట్టు చాలా మెరుగ్గా ఉందన్నాడు. మంచి మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మిడిల్ ఉండటంతో పాటు, స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ట్వంటీ 20 జట్టుతో కలవబోతుండటంతో టీమిండియా జట్టుకు అదనపు బలమన్నాడు. ఆసీస్ తో వన్డే సిరీస్ ను కోల్పోయినా అది ధోని సేనపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదన్నాడు. ప్రస్తుతం టీమిండియా దృష్టంతా ట్వంటీ 20 సిరీస్ పైనే ఉందన్నాడు. ట్వంటీ20 వరల్డ్ కప్ కు ఎనిమిది వారాలే సమయం ఉన్నందున టీమిండియాకు ఈ సిరీస్ ను సాధించడమే ప్రధానమన్నాడు. వన్డేల్లో పలు రకాల ప్రయోగాలు చేసిన టీమిండియా .. ట్వంటీ 20 సిరీస్ గెలవడానికి తీవ్రంగా శ్రమిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నాడు. -
కోహ్లి మాటను పరిగణనలోకి తీసుకోవాలి
భారత్ కొత్త కోచ్ ఎంపికపై డీన్‌జోన్స్ మెల్బోర్న్: ప్రపంచ కప్ తర్వాత భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే ప్రక్రియలో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా పాత్ర ఉండాలని ఆసీస్ మాజీ ఆటగాడు డీన్‌జోన్స్ అభిప్రాయ పడ్డారు. వన్డే ప్రపంచ కప్‌తో డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్ట్ ముగియనుంది. భవిష్యత్తులో కోహ్లి వన్డే, టి20 కెప్టెన్ కూడా అవుతాడనే విషయాన్ని మరువరాదని ఆయన అన్నారు. ‘భారత క్రికెట్ జట్టు అభివృద్ధికి ఎవరు ఉపయోగపడతారనే విషయంపై కోహ్లికి అవగాహన ఉంది. రాబోయే రోజుల్లో ఎవరితో కలిసి తాను సౌకర్యవంతంగా పని చేయచేయగలడనేది కూడా ముఖ్యం. కాబట్టి కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియలో కోహ్లికి కూడా భాగం కల్పించాలి’ అని జోన్స్ చెప్పారు. బీసీసీఐ భారీ డబ్బు ఇచ్చి సహాయక సిబ్బందిని పెట్టుకోవడంతోనే ఫలితాలు రావని, పదే పదే వారిని మార్చడం కూడా జట్టుకు మంచిది కాదని ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ అన్నారు. ప్రస్తుతం భారత్‌కు అత్యుత్తమ బౌలింగ్ కోచ్ అత్యవసరమని జోన్స్ వ్యాఖ్యానించారు. ప్రపంచ కప్‌కు రూబెల్ ఢాకా: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని బెయిల్‌పై విడుదలైన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్‌కు ఊరట లభించింది. అతను విదేశీ ప్రయాణం చేసేందుకు ఢాకా కోర్టు అనుమతినిచ్చింది. ఫలితంగా రూబెల్ ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లా జట్టు ప్రత్యేక శిబిరానికి రూబెల్ హాజరు కాలేదు. అయితే కోర్టు సడలింపు ఇవ్వడంతో అతని వీసా కోసం బంగ్లా బోర్డు, ఆస్ట్రేలియా హై కమిషన్‌కు దరఖాస్తు ఇవ్వనుంది.