walkout.
-
వీడియో వైరల్.. ఇమ్రాన్‌కు భంగపాటు
జెనీవా: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భంగపాటు ఎదురయ్యింది. పాక్ ప్రధాని ఉపన్యాసం ప్రారంభం అయిన వెంటనే భారత ప్రతినిధి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం నాటి సర్వసభ్య సమావేశానికి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడమే కాక కశ్మీర్ సమస్యను లేవనెత్తడంతో భారత దౌత్యవేత్త మిజిటో వినిటో వాకౌట్ చేశారు. అనంతరం పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టీఎస్ తిరుమూర్తి స్పందించారు. భారత్ వ్యతిరేక ప్రకటనకు తగిన సమాధానం చెప్తామన్నారు. ఇమ్రాన్ ఖాన్ దౌత్యపరంగా చాలా తక్కువ స్థాయి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ మేరకు తిరుమూర్తి ట్వీట్ చేశారు. ‘75 వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి చాలా తక్కువ స్థాయి దౌత్యపరమైన ప్రకటన చేశారు. పాకిస్తాన్ తన సొంత మైనారిటీలను హింసించడం గురించి, సరిహద్దు ఉగ్రవాదం గురించి దుర్మార్గపు అబద్ధాలు, వ్యక్తిగత దాడులకు దిగింది. ఇందుకు తగిన సమాధానం ఎదురు చూస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: ‘ఉగ్ర అడ్డాగా సోషల్ మీడియా’) అంతకు ముందు విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, వీడియోల ద్వారా ఉగ్రవాదులు సోషల్ మీడియాలో దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ) 45వ సమావేశాల్లో భారత్ పేర్కొంది. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ పెరిగిపోవడం పట్ల ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత మిషన్ కార్యదర్శి పవన్ బాధే ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలు, యువతను తమ శ్రేణుల్లో నియమించుకునే ఉద్దేశంతో ఈ ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. భద్రతా దళాలు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు ఉగ్రవాదులు వీరిని ఉసిగొల్పుతున్నారని మండిపడిన సంగతి తెలిసిందే. -
మెట్రో రైలు-ఉబెర్ ఒప్పందానికి డ్రైవర్ల సెగ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థ ఉబర్‌తో హైదరాబాద్ మెట్రోరైలు అవగాహన ఒప్పందానికి డ్రైవర్ షాక్ తగిలింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉబెర్ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా తమకు జీతాలు పెంచాలంటూ డ్రైవర్లు నినదించారు. అలవెన్సులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు. సుమారు17మంది డ్రైవర్లు డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోతే ఉబెర్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో సమావేశం మధ్యలోనుంచే ఉబెర్ సీవోవో బార్నీ హర్ఫర్డ్ నిష్క్రమించారు. మెట్రోరైలు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా లాస్ట్‌మైల్ కనెక్టివిటీలో భాగంగా ఇప్పటికే ఓలా, తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న హెచ్‌ఎమ్మార్ గురువారం ఉబెర్‌తో కూడా ఎంఓయూ కుదుర్చుకునే కార్యక్రమాన్ని తలపెట్టింది. అయితే ఉబెర్ సీవోవో మధ్యలోనే లేచి వెళ్లిపోవడంతో దీనికి బ్రేక్ పడిందా లేక ఒప్పందం జరిగిందా అనేది క్లారిటీ రాలేదు. ఈ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సహా, ఐటీ సెక్రెటరీ జయేశ్‌రంజన్, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉబెర్ ఇండియా, సౌత్ ఆఫ్రికా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధుకన్నన్, ప్రెసిడెంట్ అమిత్‌జైన్ తదితరులు హాజరైనారు. -
కేఎస్‌సీఏ నుంచి కుంబ్లే, శ్రీనాథ్ వాకౌట్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) వార్షిక సభ్య సమావేశం గందరగోళంగా మారింది. ఆదివారం జరిగిన ఈ సమావేశం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వాకౌట్ చేశారు. నిధులు దుర్వినియోగం చేశారని వారు మండిపడ్డారు. క్రికెట్ కోసం ఖర్చు చేయాల్సిన వంద కోట్ల రూపాయిల నిధులను క్లబ్ హౌస్‌ల కోసం వినియోగించాలని క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుందని కుంబ్లే ఆరోపించాడు. క్రికెట్ అభివృద్ధి కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించాడు. 2010లో మూడేళ్లకాలానికి గాను కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా కుంబ్లే ఎన్నికయ్యాడు. మాజీ పేసర్లు వెంకటేశ్ ప్రసాద్, శ్రీనాథ్ కూడా కేఎస్‌సీఏ పాలక మండలికి ఎన్నికయ్యారు.