
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30న అర్హత పరీక్ష నిర్వహించ నున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ శాఖ కార్యదర్శి సి.శ్రీనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్–2022 దరఖాస్తు గడువును ఈనెల 6వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడిం చారు.
అలాగే రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష నిర్వహించిన పన్నెండు రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.