polycet
-
TG: ఒక్క క్లిక్‌తో పాలిసెట్ ఫలితాలు
హైదరాబాద్: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఏటా నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఫతాలు సోమవారం విడుదల అయ్యాయి. మాసబ్ ట్యాంక్‌లోని ఎస్బీటీఈటీ ఎస్.వీ భవన్లో తెలంగాణ ఎస్బీటీఈటీ చైర్మన్ బి. వెంకటేషం ఫలితాలను విడుదల చేశారు. మే 24న పాలిసెట్ రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఒక్క క్లిక్‌తో ఫలితాలు చూసుకోండి.. -
TG: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ మూడు విడతల్లో జరగనుంది. జూన్ 27 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంజూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లుజులై 12న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 24న రెండో విడత సీట్ల కేటాయింపుజులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్ఆగస్టు 5న తుది విడత సీట్ల కేటాయింపుఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు. పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదీ..తెలంగాణలో రెండు విడతల్లో పాలిసెట్ కౌన్సెలింగ్ జరగనుంది.జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంజూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లుజూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లుజులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు పాలిసెట్‌లోనూ ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం ఉంటుంది. జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు విడుదలవుతాయి. -
ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సాక్షి,విజయవాడ: పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి బుధవారం(మే8)ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈ పరీక్షను ఏప్రిల్ 27న నిర్వహించారు.మొత్తం 1.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1.24 లక్షల మంది అర్హత సాధించారు. దీంతో ఈసారి 87.61 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... -
విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణలో పాలిసెట్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్) వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను వాయిదా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం మే 17న పాలిసెట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 24న నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి ఎ.పుల్లయ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. కాగా దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్నారు.. తెలంగాణలో నాలుగో విడుతలో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. చదవండి: ప్రణీత్ రావు పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు -
Telangana: పాలిసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: టెన్త్ ఉత్తీర్ణులకు ఇంజనీరింగ్, నాన్–ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టీ కల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్–2022 ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటిస్తారని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ విభాగం కార్యదర్శి డాక్టర్‘‘ సి.శ్రీనాథ్ తెలిపారు. ఉదయం 10.30 ఫలితాలు వెలువడతాయని, వెంటనే ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు. గత నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో పాలిసెట్ పరీక్ష జరిగింది. మొత్తం 1,13,979 మంది దరఖాస్తు చేసుకోగా, 1,04,432 (91.62 శాతం)మంది పరీక్షకు హాజరయ్యారు. పాలిసెట్ ఫలితాలు ‘సాక్షి’ వెబ్సైట్ www. sakshieducation.com లో అందుబాటులో ఉంటాయి. వెబ్‌సైట్‌కు లాగిన అయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, విజయవాడ: ఏపీ పాలిసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. 91.84 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. 1,31,608 మంది పరీక్షలు రాశారు. బాలురు 90.56 శాతం, బాలికలు 93.96 శాతం ఉత్తీర్ణులయ్యారు. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన పాలీసెట్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడొచ్చు. చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం -
18న ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ పాలిసెట్-2022 ఫలితాలను జూన్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను శనివారం ఉదయం 9:15 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడలోని గేట్ వే హోటల్లో విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వహించిన విషయం తెల్సిందే. ఇప్పటికే పాలిసెట్-2022 ఆన్సర్ కీని కూడా ఎస్బీటీఈటీ విడుదల చేసింది. ఈ ఫలితాలను విడుదల చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డ్ తెలిపింది. రిజిస్ట్రేషన్ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేసుకొని ఈ ఫలితాలను పొందవచ్చును. ఈ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్( www.sakshieducation.com )లో చూడొచ్చు. -
ఈనెల 30న పాలిసెట్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30న అర్హత పరీక్ష నిర్వహించ నున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ శాఖ కార్యదర్శి సి.శ్రీనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్–2022 దరఖాస్తు గడువును ఈనెల 6వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడిం చారు. అలాగే రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష నిర్వహించిన పన్నెండు రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
పాలిసెట్‌లో 37,978 సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్–2021 తొలివిడత అడ్మిషన్లలో 37,978 మందికి సీట్లు కేటాయించినట్లు సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాలిసెట్ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 18లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 312 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి.. మెరిట్ జాబితాను శాప్‌కు పంపాల్సి ఉందన్నారు. అందువల్ల వారికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. 259 కాలేజీలు.. 69,810 సీట్లు పాలిసెట్‌లో 64,188 మంది అర్హత సాధించగా 42,910 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో 41,978 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. 41,036 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. రాష్ట్రంలో 259 కాలేజీలు ఉండగా వాటిలో 69,810 సీట్లు ఉన్నాయి. తొలి విడతలో 37,978 సీట్లు భర్తీ కాగా 31,832 సీట్లు మిగిలాయి. అత్యధికంగా ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్ల భర్తీ ఇలా.. -
పాలిసెట్‌లో 94.20% ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశపరీక్ష (పాలిసెట్)–2021లో రికార్డుస్థాయి ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 68, 137 మంది పరీక్షలు రాయగా 64,187 మంది (94.20 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం పాలిసెట్–2021 ఫలితాలను ఆయ న విడుదల చేశారు. 120 మార్కులతో విశాఖకు చెందిన కల్లూరి రోషన్‌లాల్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొమ్మరాపు వివేక్‌వర్థన్ మొదటి ర్యాంకు సాధించారు. 119 మార్కులతో 9 మందికి రెండో ర్యాంకు లభించింది. శ్రీకాకుళం జిల్లా 95.52 శాతం ఉత్తీర్ణతతో ముందంజలో నిలిచింది. బాలికల ఉత్తీర్ణత శాతం నెల్లూరు జిల్లాలో, బాలుర ఉత్తీర్ణత శాతం ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉంది. ఈ ఏడాది కొత్తగా 5 కోర్సులు ఫలితాలు విడుదల చేసిన అనంతరం మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మిడ్‌లెవెల్ ఉద్యోగాలకు బాగా డిమాండ్ ఉందని, పాలిటెక్నిక్ పూర్తికాగానే ఉపాధి లభించే విధంగా కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి ఐటీ, రోబోటిక్స్, కోడింగ్ వంటి 5 కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వారంలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైతే ప్రైవేటు కాలేజీలను ప్రభుత్వ కాలేజీలుగా మార్చి మౌలిక వసతులు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గతేడాది పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు 81 వేలమందికి జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.128 కోట్లు, వసతిదీవెన ద్వారా రూ.54 కోట్లు అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంకేతికవిద్య కమిషనర్ పోలా భాస్కర్, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారురాజు తదితరులు పాల్గొన్నారు. గురుకుల విద్యార్థికి పాలిసెట్ ఫస్ట్ ర్యాంక్ పాలిసెట్‌లో మొదటి ర్యాంకు సాధించిన విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఏపీ గురుకుల పాఠశాల పదోతరగతి విద్యార్థి కల్లూరి రోషన్‌లాల్‌ను ఏపీ గురుకుల విద్యాలయాలసంస్థ కార్యదర్శి కల్నల్ వి.రాములు అభినందించారు. -
AP: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
-
AP: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణశాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మంచి ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 81వేల మంది విద్యార్థులకి రూ.128 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. 72 వేల మంది విద్యార్థులకి రూ.54 కోట్లు జగనన్న వసతి దీవెనగా అందించామని చెప్పారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం, అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు అని పేర్కొన్నారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు పాల్గొన్నారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఎంసెట్‌లో ముందుగా ఏ పరీక్ష?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో ముందుగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించాలా? ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించాలా? అన్న విషయంలో ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ చర్యలు చేపట్టింది. మరోవైపు రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలను జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. సాధారణంగా అందులో ముందు 3 రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్లైన్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ఆరు సెషన్లలో (రోజుకు రెండు సెషన్లు) నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైతే 8న కూడా ఒక సెషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు, ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒక రోజు గడువే ఉంటోంది. దీంతో మ్యాథమెటిక్స్ విద్యార్థుల వెసులుబాటు కోసం ముందుగా ఇంజనీరింగ్ ఎంసెట్ కాకుండా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం ఎంసెట్‌ను నిర్వహించాలనే ఆలోచనలు చేస్తోంది ఉన్నత విద్యామండలి. అయితే నీట్ తేదీలను ప్రకటించాక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అప్పుడే అగ్రికల్చర్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో ఎంసెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. జూన్‌లో పాలీసెట్! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్‌ను ఈసారి జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా పదో తరగతి పరీక్షలు పూర్తికాగానే ఏప్రిల్ చివరలో పాలీసెట్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) నిర్వహిస్తోంది. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మే 17 నుంచి 26వ తేదీ వరకు ఉండటంతో పాలీసెట్‌ను జూన్‌లో నిర్వహించేలా ఎస్బీటీఈటీ కసరత్తు చేస్తోంది. చదవండి: తెలంగాణ ఎంసెట్ 2021 షెడ్యూల్ విడుదల సింగరేణిలో 2087 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్... -
పాలిసెట్ అడ్మిషన్స్ షెడ్యూల్ పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీ పాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూలును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పొడిగించిన గడువు తేదీలు ఇలా.. ► ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: అక్టోబర్ 21 వరకు ► ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు: అక్టోబర్ 22 వరకు ► సీట్ల కేటాయింపు: అక్టోబర్ 24 సాయంత్రం 6 తర్వాత. పాలిసెట్‌లో 60,780 మంది అర్హత సాధించగా శనివారం వరకు 35,346 మంది వెబ్ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ అయ్యారు. 34,288 మంది ధ్రువపత్రాల పరిశీలన జరగగా, 28,682 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. -
రేపే ఏపీ పాలిసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ డిప్లొమాలో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్–2020) ఆదివారం(27) జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ► రాష్ట్ర వ్యాప్తంగా 388 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు 88,484 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కోవిడ్–19 నిబంధనలను అనుసరించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ► అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు పెన్ను, పెన్సిల్ తెచ్చుకోవాలి. తప్పనిసరిగా మాస్క్, గ్లౌజ్ ధరించాలి. శానిటైజర్, వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు. ► అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాక పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ► కరోనా లక్షణాలుండే విద్యార్థుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయనున్నారు. ► విద్యార్థి కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్‌ను నింపి సమర్పించాల్సి ఉంటుంది. హాల్ టికెట్, డిక్లరేషన్ ఫారాలను ‘హెచ్‌టీటీపీఎస్//పీఓఎల్‌వైసీఈటీఏపీ.ఎన్ఐసీ.ఐఎన్’ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
తెలంగాణలో ‘సెట్స్’ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కరసత్తు పూర్తయింది. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహించనుంది. అలాగే సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింతగ్ పరీక్షలను నిర్వహించనుంది. కోర్టు అనుమతితో ఈ తేదీలను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించనుంది. అలాగే అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర సెట్స్ తేదీలను పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 2020–21 విద్యా సంవత్సరంలో అకడమిక్ వ్యవహారాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే తాము తీసుకున్న నిర్ణయాలను హైకోర్టుకు తెలియజేసి, కోర్టు ఆమోదంతో అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని ప్రభుత్వం ఈ సందర్భంగా న్యాయస్థానంకు తెలిపింది. ఇక ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. -
లాసెట్ సహా ఇతర సెట్స్ దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: లాసెట్ దరఖాస్తుల గడువును రూ.4 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు. గతంలో ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులను సబ్మిట్ చేయని విద్యార్థులు కూడా దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని వెల్లడించారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. మరోవైపు రూ.1,000 ఆలస్య రుసుముతో ఐసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును రూ. 2 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్ మృణాళిని పేర్కొన్నారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్ దరఖాస్తుల గడువులను ఆలస్య రుసుముతో ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయా సెట్ల కన్వీనర్లు వెల్లడించారు. పీజీఈసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఇక పాలిసెట్ దరఖాస్తు గడు వును రూ.200 ఆలస్య రుసుముతో ఈనెల 25వతేదీ వరకు పొడిగించినట్లు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ వెల్లడించారు. -
ఈనెల 20న ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశా ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) కమిటీ సమావేశాలు బుధవారం నుం చి మొదలు కానున్నాయి. ఒక్కొక్క సెట్ కమిటీ సమావేశాన్ని ఒక్కో రోజు నిర్వహించేందుకు సెట్స్ కన్వీనర్లు తేదీలు ఖరారు చేశారు. ఆయా సెట్స్‌కు సంబంధిత యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బుధవారం ఐసెట్, 17న ఎడ్‌సెట్, 19వ తేదీన పీఈ సెట్ సమావేశాలను నిర్వహించేందుకు చర్య లు చేపట్టనున్నాయి. ఇక ఎక్కువ మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎంసెట్ కమిటీ సమావేశాన్ని ఈనెల 15న లేదా 18న నిర్వహించే అవకాశముంది. అదే రోజు ఈసెట్ కమిటీ స మావేశం కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వా త లాసెట్ కమిటీ సమావేశం నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ సమావేశాల్లో ఆ యా సెట్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ల జారీ తేదీలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనున్నారు. వాటితోపాటు అర్హతలు, ఇతర నిబంధనలను కూడా ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 20 లేదా 21న జారీ చేసే అవకాశం ఉంది. మార్చి 2న పాలిసెట్ నోటిఫికేషన్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2020 నోటిఫికేషన్‌ను మార్చి 2వ తేదీన జారీ చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కసరత్తు చేస్తోంది. ఇందులో పరీక్ష ఫీజు, ఇతర నిబంధనలను, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనుంది. ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించనుంది. -
24 నుంచి ఏపీ పాలీసెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి బ్యూరో: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన పాలిసెట్–19 కౌన్సెలింగ్ మే 24 నుంచి మే 29 వరకు జరగనుంది. మే 24న 1 నుంచి 8,000 వరకు, మే 25న 8,001 నుంచి 25,000 వరకు, మే 26న 25,001 నుంచి 45,000 వరకు, మే 27న 45,001 నుంచి 65,000 వరకు, మే 28న 65,001 నుంచి 87,000 వరకు, మే 29న 87,001 నుంచి చివరి ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 37 కేంద్రాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు తమ పాలిసెట్ ర్యాంకు కార్డు, పాలిసెట్ హాల్‌టికెట్, 10వ తరగతి హాల్‌టికెట్, 10వ తరగతి మార్కుల లిస్టు(నెట్ కాపి), 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్, నివాస, కుల, ఆదాయ/రేషన్‌కార్డు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు (విద్యార్థి, వారి తల్లితండ్రులది)లను తీసుకెళ్లాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌సెట్లను తీసుకువెళ్లాలి. దివ్యాంగ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్స్ విద్యార్థులు వారికి ప్రత్యేకంగా కేటాయించిన మూడు ప్రభుత్వ పాల్టెక్నిక్ కళాశాలల్లో మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలోని కేంద్రాలలో ఏదైనా ఒక కేంద్రానికి వెళ్లవచ్చు. వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలు... అర్హత సాధించిన విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తరువాత మే 27, 28 తేదీల్లో 1–45,000 ర్యాంకు వరకూ, మే 29, 30 తేదీల్లో 45,000 నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు మే 31 ఆప్షన్లు ఇవ్వటానికి చివరి రోజు, ఆప్షన్లలో మార్పులు కావాలంటే ఆ రోజు చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు జూన్ 2న ఉంటుంది. ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, బీసీలు, ఓసీలకు రూ.700 గా నిర్ణయించారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి ఫోన్‌నెం. 6301112473ను, వెబ్సైట్లో హెచ్‌టీటీపీఎస్ ఏపీపీఓఎల్‌వైసీఈటి.ఎన్ఐసి.ఐఎన్‌లను వినియోగించుకోవచ్చు. -
రేపటి నుంచే పాలిసెట్ కౌన్సెలింగ్..
-
100 కాలేజీలకు అనుబంధ గుర్తింపు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ను ఈ నెల 14 నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించిన సాంకేతిక విద్యా శిక్షణ మండలి రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేయలేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు పొందిన 162 కాలేజీల్లో రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఇప్పటివరకు 62 కాలేజీలకే అనుబంధ గుర్తింపునిచ్చింది. ఒక్కో బ్రాంచీలో 60 సీట్లుంటే దానిని ఒక సెక్షన్‌గా పరిగణించి రూ.30 వేలు గుర్తింపు ఫీజు చెల్లించిన ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని కాలేజీలు అదనపు సెక్షన్లు తెచ్చుకొని అదనపు ఫీజు చెల్లించడం లేదని, అలాంటి వాటికే అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని పేర్కొంటున్నారు. యాజమాన్యాలు మాత్రం కాలేజీల్లోని ఒక్కో సీటుపై రూ.500 చొప్పున విద్యార్థులు మూడేళ్లు ఉంటారు కాబట్టి ముందుగానే మూడేళ్ల ఫీజు రూ.1,500 చెల్లించాలంటూ సాంకేతిక విద్యా మండలి నిబంధన విధించిందని చెబుతున్నాయి. ఇప్పటివరకు ఎక్కడా లేని ఈ నిబంధనను ఇప్పుడు ఎందుకు పెట్టారని కాలేజీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఏటా అనుబంధ గుర్తింపు ఇస్తున్నపుడు ఆ సమయంలో చెల్లిస్తామని పేర్కొంటున్నాయి. అధికారులు ఒక రకంగా, యాజమాన్యాలు మరో రకంగా చెబుతుండటంతో గందరగోళం నెలకొంది. మొత్తానికి 100 వరకు కాలేజీలకు సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ఇంతవరకు అనుబంధ గుర్తింపు జారీ చేయకపోవడంతో యాజమా న్యాలు సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేశాయి. ముందు అనుబం ధ గుర్తింపు ఇవ్వాలని కోరాయి. అయితే ఫీజు చెల్లిస్తేనే అనుబంధ గుర్తింపు ఇస్తామని సాంకేతిక విద్యా, శిక్షణ మండలి అధికారులు పేర్కొనడంతో కొన్ని యాజమాన్యాలు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధం అవుతున్నాయి. అదనపు సెక్షన్లకు ఫీజు చెల్లించకపోవడంతో.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు కోసం రాష్ట్రంలోని 187 కాలేజీల్లోని 47,264 సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా 25 కాలేజీలు, 5,164 సీట్లకు కోత పెట్టింది. 162 కాలేజీల్లో 42,100 సీట్లకు గుర్తింపునిచ్చింది. దీంతో ఈ నెల 14 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అయితే అత్యధిక కాలేజీలు అదనపు సెక్షన్లకు అదనపు ఫీజు చెల్లించకపోవడంతో 100 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించలేదు. దీంతో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ నెల 14న రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ ఉంది. ఈనెల 15 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్పటివరకు ఫీజు చెల్లించే కాలేజీలను కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. గతేడాదే అమలు చేశాం బ్రాంచీల వారీగా, సెక్షన్ల వారీగా అనుబంధ గుర్తింపు ఫీజు చెల్లించాలన్నది పాత నిబంధనే. గతేడాది అమలు చేశాం. 60 మంది విద్యార్థులు ఉండే ఒక సెక్షన్‌కు రూ.30 వేల చొప్పున అనుబంధ గుర్తింపు ఫీజు నిర్ణయించాం. అదనపు సెక్షన్లకు కూడా రూ.30 వేల చొప్పున చెల్లించాలని గతేడాది చెప్పాం. కాలేజీలు ప్రారంభమయ్యాక అదనపు సెక్షన్ల ఫీజు చెల్లిస్తామని చెప్పడంతో ఊరుకున్నాం. కానీ చెల్లించలేదు. దీంతో ఈసారి ముందుగానే చెల్లించాలన్నాం. కొన్ని కాలేజీలు చెల్లించాయి. మరికొన్ని కాలేజీలు విద్యార్థిపై రూ.500 చొప్పున మూడేళ్లకు రూ.1500 అంటూ అపార్థం చేసుకుంటున్నాయి తప్ప మరేమీ లేదు. – వెంకటేశ్వర్లు, సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి -
17 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాలు ఏర్పాటు జిల్లాలో ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ 20 నుంచి 25వ తేదీ వరకుఆప్షన్లకు అవకాశం 26వే తేదీ ఆప్షన్లు మార్చుకునేందుకు సౌలభ్యం 28న సీట్ల కేటాయింపుఉత్తర్వులు జారీ పాలిసెట్ జిల్లా కన్వీనర్ జెడ్.రమేష్‌బాబు ఒంగోలు: పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పాలిసెట్ జిల్లా కన్వీనర్, ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జెడ్.రమేష్‌బాబు తెలిపారు. తన చాంబర్లో సోమవారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత కౌన్సెలింగ్‌కు, ఈ దఫా కౌన్సెలింగ్‌కు పలు మార్పులు జరిగాయని, అభ్యర్థులు కౌన్సెలింగ్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి: ♦ ఎస్ఎస్సీ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణతకు సంబం«ధించి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఒరిజినల్ మార్కుల మెమో ♦ ఆధార్ కార్డు( పరిశీలన సమయంలో ఒరిజినల్ కార్డు పరిశీలన) ♦ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు (లేదా) నాలుగు నుంచి పది వరకు విద్యాసంస్థలలో చదవకపోయి ఉంటే వారు రెసిడెన్స్ సర్టిఫికెట్ అందజేయాలి. ఒక వేళ ఈ రాష్ట్రంలో నివాసం ఉండనివారు అయితే వారి తల్లిదండ్రులు కనీసం పది సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉన్నట్లు నిరూపించే రెసిడెన్స్ సర్టిఫికెట్ జతచేయాలి ♦ జనవరి 1వ తేదీ తరువాత జారీచేసిన «ఆదాయ ధృవీకరణ పత్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన తెల్లరంగు రేషన్ కార్డు(ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత ఉన్నవారు) ♦ పర్మినెంట్/ ఆరు నెలలలోగా సంబంధిత అధికారి జారీచేసిన కుల ధృవీకరణ పత్రం ♦ అంగవైకల్యం కలిగిన వారు 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నట్లు జిల్లా మెడికల్ బోర్డు జారీచేసిన ధృవపత్రం ♦ చిల్డ్రన్ ఫర్ ఆర్మ్డ్ పర్సనల్(క్యాప్) అభ్యర్థులు మాజీ సైనికులకు సంబంధించి జిల్లా సైనిక సంక్షేమశాఖ జారీచేసిన ధృవపత్రం, ఐడెంటిటీ కార్డు, డిశ్చార్జిబుక్ వెరిఫికేషన్ నిమిత్తం తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ♦ ఆంగ్లో ఇండియన్ కేటగిరీకి సంబంధించి వారు నివాసం ఉంటున్న ప్రదేశానికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది ♦ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు కౌన్సెలింగ్ నిమిత్తం విజయవాడ బెంజ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, విశాఖపట్నంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300, బీసీ/ఓసీ అభ్యర్థులు రూ.600 ఫీజు నగదు రూపంలో కౌన్సెలింగ్ సెంటర్లో చెల్లించవచ్చు. ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశం పొందిన వారికి రూ.3800 , ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందిన వారు రూ.15500 నుంచి రూ.21వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీటు పొందిన తరువాత ఏపీ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌కు రూ.800 చెల్లించాలి. ఆప్షన్లు ఇలా..ఈ నెల 20వ తేదీ నుంచి ఆప్షన్లను ఒంగోలులోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ(ఈ కాలేజీ అవకాశం కల్పిస్తుంది), లేదా ఇతరత్రా ప్రైవేటు నెట్ సెంటర్ల నుంచి కూడా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 20, 21 తేదీల్లో ఒకటవ ర్యాంకు మొదలు 30వేల వరకు, 22,23 తేదీల్లో 30001 మొదలు 60వేల వరకు, 24, 25 తేదీల్లో 60001 మొదలు చివరి ర్యాంకు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా తమ ఆప్షన్లు మార్చుకోవాలని భావిస్తే ఈ నెల 26న మార్చుకోవచ్చు. 28వతేదీ సాయంత్రం 6గంటల తరువాత సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుంది. కేటాయించిన సీటుకు సంబంధించిన ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకునేందుకు అభ్యర్థి తప్పనిసరిగా ఐసీఆర్ ఫారం నెంబర్, హాల్‌టిక్కెట్ నెంబర్, పాస్‌వర్డు, పుట్టిన తేదీతో లాగిన్‌లో డౌన్లోడ్ చేసుకొని సీటు లభించిన కాలేజీలో రిపోర్టుచేయాల్సి ఉంటుంది. కోర్సులు ఇవి మాత్రమే:ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ : సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఈతముక్కల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ : ఈసీ, కంప్యూటర్స్, డీసీసీసీపీ కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ : సివిల్, ఎలక్ట్రికల్ అద్దంకి పాలిటెక్నిక్ కాలేజీ : కంప్యూటర్స్, ఈసీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో: సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఇ, ఈసీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇటీవల పలు కొత్తకోర్సులు వస్తున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే వాటికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రానందున గత ఏడాది ఏ కోర్సులు అయితే ఉన్నాయో వాటికి మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపారు. -
నేడు పాలీసెట్
సాక్షి, హైదరాబాద్ : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించనున్న పాలీసెట్–2018 కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలీసెట్ చైర్మన్ నవీన్ మిట్టల్ తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుం దని పేర్కొన్నారు. విద్యార్థులు గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవా లని నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించిన వివరాలకు 18005995577 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. పాలీసెట్‌కు 1,25,063 మంది దరఖాస్తు చేసుకోగా అందులో బాలురు 76,298, బాలికలు 48,765 మంది ఉన్నట్లు వెల్లడించారు. -
కొనసాగుతున్న పాలిసెట్ కౌన్సెలింగ్
నంద్యాలఅర్బన్: పాలిటెక్నిక్ కళాశాలల ప్రవేశానికి నిర్వహిస్తున్న పాలిసెట్ 2017 కౌన్సెలింగ్ కొనసాగుతుంది. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో గత నెల 30 నుంచి జరుగుతున్న కౌన్సెలింగ్‌లో ర్యాంకులు పెరిగే కొద్ది విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్ పర్యవేక్షణలో శనివారం 45,001 ర్యాంకు నుంచి 60వేల ర్యాంకు వరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 189మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా కౌన్సెలింగ్ పూర్తయిన 1 నుంచి 30వేల ర్యాంకు విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకుంటున్నారు. -
30 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
నంద్యాలఅర్బన్: పాలిసెట్-2017లో అర్హత సాధించిన విద్యార్థులకు సీట్ల కేటాయింపు కోసం ఈ నెల 30 నుంచి జూన్ 6 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వై. విజయభాస్కర్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక కళాశాలలో ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఉదయం 9గంటల నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్, పాలిసెట్ ర్యాంకు కార్డు, 10వ తరగతి సర్టిఫికెట్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ «ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు మొదలగు ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కళాశాలలకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చన్నారు. జూన్ 8వ తేదీ ఆప్షన్లను మార్చుకొనే అవకాశం ఉంటుందన్నారు. 10వ తేదీ కళాశాలల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఎస్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కర్నూలులో జరుగుతుందని, ఎన్సీసీ, పీహెచ్, క్యాబ్, స్పొర్ట్స్ కేటగిరీల సంబంధించిన వారికి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు. వివరాలకు https://appolycet.nic.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. తేదీ - ర్యాంకులు 30.05.17 1 - 10వేలు 31.05.17 10001 - 20,000 01.06.17 20,001 - 32,000 02.06.17 32,001 -45000 03.06.17 45,001 - 60,000 04.06.17 60,001 - 75,000 05.06.17 75,001 - 87,000 06.06.17 87,001 - చివరి వరకు