సాక్షి, హైదరాబాద్: లాసెట్ దరఖాస్తుల గడువును రూ.4 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు. గతంలో ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సబ్మిట్ చేయని విద్యార్థులు కూడా దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని వెల్లడించారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. మరోవైపు రూ.1,000 ఆలస్య రుసుముతో ఐసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు.
ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును రూ. 2 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్ మృణాళిని పేర్కొన్నారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్ దరఖాస్తుల గడువులను ఆలస్య రుసుముతో ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయా సెట్ల కన్వీనర్లు వెల్లడించారు. పీజీఈసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఇక పాలిసెట్ దరఖాస్తు గడు వును రూ.200 ఆలస్య రుసుముతో ఈనెల 25వతేదీ వరకు పొడిగించినట్లు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment