TS LAWCET
-
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాసెట్-2023 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఈ రిజల్ట్స్‌ను గురువారం మధ్యాహ్నం రిలీజ్ చేశారు. తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేట్ న్యాయ కళాశాలల్లోని మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుతో పాటు పీజీ ఎల్ఎల్ఎం కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ మే 25వ తేదీన ఈ పరీక్ష నిర్వహించగా.. 43,692 మంది దరఖాస్తు చేసుకోగా 36,218 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ☛ TS LAWCET-2023 ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే.. -
లా కోర్సుల్లో 5,747 మందికి ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్ ముగిసింది. ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు, ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సు, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 6,724 సీట్లు ఉన్నాయి. ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించగా తొలివిడతలో 5,747 సీట్లు భర్తీ అయినట్లు టీఎస్‌సెట్ అడ్మిషన్స్–2022 కన్వీనర్ పి.రమేశ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్‌లో 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. అందులో 5,747 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 28 నుంచి డిసెంబర్ 3వ తేదీలోపు నిర్దేశించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. ఈ నెల 30 నుంచే సంబంధిత కోర్సులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు వివరించారు. -
తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలో జరిగిన లాసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా సెట్లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ లా సెట్లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు. ►లాసెట్ ఫలితాలు.. ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే.. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్, లా సెట్ కన్వీనర్.. జిబి రెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: లాసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా సెట్లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ లా సెట్లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు. మూడేళ్లు, అయిదేళ్ల పీజీ లాసెట్ జూలై 21, 22 తేదీల్లో జరిగింది. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ పాల్గొన్నారు. -
టీఎస్ ఐసెట్, లాసెట్ దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తు గడువును ఆలస్య రుసుముతో వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఇకపై గడువు పొడిగించలేమని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2022–2023)లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అపరాధ రుసుము లేకుండా జూలై 4 వరకు గడువు పొడిగించినట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా సోమవారంతో గడువు ముగియడంతో మరోసారి పొడిగించినట్లు పేర్కొన్నారు. టీఎస్ ఐసెట్‌ను జూలై 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (చదవండి: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..) -
TS: డిసెంబర్ 1 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలంగాణ ఎడ్‌సెట్ కన్వీనర్ రమేశ్‌బాబు తెలిపారు. 1 నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 18–20 తేదీల మధ్య వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు వచ్చిన అభ్యర్థులు డిసెంబర్ 28లోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. 30వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు. (‘వడ్లు దంచంగా రాడే.. వండంగ రాడే’.. ఈ పాట ఎక్కడైనా విన్నారా) 27 నుంచి లాసెట్ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: లాసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ లాసెట్ కన్వీనర్ రమేశ్‌బాబు తెలిపారు. 27 నుంచి డిసెంబర్ 6 వరకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, 11 నుంచి 13 వరకు కాలేజీల ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. డిసెంబర్ 17న సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు పొందిన అభ్యర్థులు వచ్చే నెల 23 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. మూడేళ్ల, ఐదేళ్ల న్యాయవాద కోర్సుల తరగతులు డిసెంబర్ 27 నుంచి మొదలవుతాయని తెలిపారు. (చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్) -
Telangana: ఆగస్టు 23,24న లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23, 24 తేదీల్లో తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్స్‌కి 28,904 మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకోగా.. ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్స్‌కి 7,676 మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఎల్‌ఎంకి 3,286 మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వీటిలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏపీలో ఉన్నాయి. -
Telangana: ఎంసెట్, లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువును జూన్ 3వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. బుధవారం వరకు 2,01,367 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో ఇంజనీరింగ్ కోసం 1,35,151 మంది, అగ్రికల్చర్ కోసం 66,216 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు తెలంగాణ లాసెట్ దరఖాస్తుల గడువును వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని లాసెట్ కమిటీ పేర్కొంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించింది. చదవండి: Telangana: జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు! -
నేటి నుంచి లాసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్‌ను ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో ఈసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆన్లైన్లో చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇందు కోసం ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లోనే ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి స్లాట్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. స్లాట్ బుక్ చేసుకున్న తేదీల్లోనే ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కానింగ్ కాపీలను అప్లోడ్ చేయాలని పేర్కొంది. అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్ల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చామని తెలిపింది. ఈనెల 18 నుంచి 22 వరకు స్పెషల్ కేటగిరి విద్యార్థు లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, వారు కూడా ఫీజు చెల్లించినప్పుడే స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 26, 27వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ఎంపిక, 28వ తేదీన ఆప్షన్లు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది. ఈనెల 29న సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు పొందిన విద్యార్థులంతా 31వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని పేర్కొంది. 31వ తేదీ నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. రేపు ఐసెట్ సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 15న సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. ప్రవేశాల కోసం 16,800 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా, అందులో 15,067 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. సీట్ల కేటాయింపు వివరాలను tsicet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. -
లాసెట్ సహా ఇతర సెట్స్ దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: లాసెట్ దరఖాస్తుల గడువును రూ.4 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు. గతంలో ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులను సబ్మిట్ చేయని విద్యార్థులు కూడా దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని వెల్లడించారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. మరోవైపు రూ.1,000 ఆలస్య రుసుముతో ఐసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును రూ. 2 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్ మృణాళిని పేర్కొన్నారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్ దరఖాస్తుల గడువులను ఆలస్య రుసుముతో ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయా సెట్ల కన్వీనర్లు వెల్లడించారు. పీజీఈసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఇక పాలిసెట్ దరఖాస్తు గడు వును రూ.200 ఆలస్య రుసుముతో ఈనెల 25వతేదీ వరకు పొడిగించినట్లు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ వెల్లడించారు. -
లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్న త విద్యామండలి విడుదల చేసింది. మార్చి 2న లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ కన్వీనర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆలస్య రుసుముతో మే 20 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఇచ్చారు. మే 27న లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహిస్తారు. లాసెట్ దరఖాస్తు రుసుము రూ. 800 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. పీజీఎల్‌సెట్‌కు దరఖాస్తు రుసుము 1000 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 800 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మే 21 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్ర దించాలని సూచించారు. -
రేపే టీఎస్ లాసెట్-2016
కేయూ క్యాంపస్ (వరంగల్) : తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న లాసెట్ మంగళవారం జరగనుంది. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు ప్రవేశపరీక్షకు 13,323 మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 4,104 మంది, ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షకు 1,793 మంది.. మొత్తంగా 19,220 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశపరీక్ష మంగళవారం ఉదయం 10 నుంచి 11-30గంటల వరకు, ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్ష మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రంలోని 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, అభ్యర్థులు అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు సూచించారు. నిర్ణీత సమయానికి ఒక నిముషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని, బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల వేలిముద్రలు సేకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు సెల్ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సూచించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు 37మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 50 మంది పరిశీలకులతో పాటు ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు ఆయన వివరించారు.