కేయూ క్యాంపస్ (వరంగల్) : తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న లాసెట్ మంగళవారం జరగనుంది. మూడేళ్ల ఎల్‌ఎల్ బీ కోర్సు ప్రవేశపరీక్షకు 13,323 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు 4,104 మంది, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షకు 1,793 మంది.. మొత్తంగా 19,220 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశపరీక్ష మంగళవారం ఉదయం 10 నుంచి 11-30గంటల వరకు, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశపరీక్ష మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతుంది.
రాష్ట్రంలోని 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, అభ్యర్థులు అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు సూచించారు. నిర్ణీత సమయానికి ఒక నిముషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని, బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల వేలిముద్రలు సేకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు సెల్‌ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సూచించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు 37మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 50 మంది పరిశీలకులతో పాటు ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు ఆయన వివరించారు.
రేపే టీఎస్ లాసెట్-2016
Published Mon, May 23 2016 7:28 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM
Advertisement