TS ICET And LAWCET 2022 Application Form Last Date Extension, Details Inside - Sakshi
Sakshi News home page

TS ICET And LAWCET 2022: టీఎస్ ఐసెట్‌, లాసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

Published Tue, Jun 28 2022 9:16 AM | Last Updated on Tue, Jun 28 2022 10:24 AM

TS ICET And LAWCET Extension Of Application Deadline - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీ లాసెట్‌ దరఖాస్తు గడువును ఆలస్య రుసుముతో వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి తెలిపారు. ఇకపై గడువు పొడిగించలేమని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. 

టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2022–2023)లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అపరాధ రుసుము లేకుండా జూలై 4 వరకు గడువు పొడిగించినట్లు టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్‌ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా సోమవారంతో గడువు ముగియడంతో మరోసారి పొడిగించినట్లు పేర్కొన్నారు. టీఎస్‌ ఐసెట్‌ను జూలై 27, 28 తేదీల్లో మూడు సెషన్‌లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  

(చదవండి: రేపే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement