
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23, 24 తేదీల్లో తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్స్‌కి 28,904 మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకోగా.. ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్స్‌కి 7,676 మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఎల్‌ఎంకి 3,286 మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వీటిలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏపీలో ఉన్నాయి.