![TS LAWCET 2022 Results Release Today - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/17/Untitled-4.jpg.webp?itok=8GmM84Cd)
సాక్షి, హైదరాబాద్: లాసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా సెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్‌లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ లా సెట్‌లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు. మూడేళ్లు, అయిదేళ్ల పీజీ లాసెట్ జూలై 21, 22 తేదీల్లో జరిగింది. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment