సాక్షి, హైదరాబాద్: గత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఫలితాలను విడుదల చేశారు.
➤ టీఎస్ ఎంసెట్-2022 (ఇంజనీరింగ్) ఫలితాల కోసం క్లిక్ చేయండి
➤ టీఎస్ ఎంసెట్-2022 (అగ్రికల్చర్) ఫలితాల కోసం క్లిక్ చేయండి
➤ టీఎస్ ఈసెట్-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఇంజనీరింగ్:
ఫస్ట్ ర్యాంక్-లక్ష్మీసాయి లోహిత్
సెకండ్ ర్యాంక్- సాయిదీపిక
థర్డ్ ర్యాంక్- కార్తికేయ
అగ్రికల్చర్:
ఫస్ట్ ర్యాంక్- నేహ
సెకండ్ ర్యాంక్-రోహిత్
థర్డ్ ర్యాంక్-తరుణకుమార్
గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం, 30, 31 తేదీల్లో అగ్రి, మెడికల్ ఎంసెట్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విభాగానికి 1.52 లక్షలమంది, అగ్రి ఎంసెట్‌కు 80 వేలమంది హాజరయ్యారు. ఎంసెట్, ఈసెట్ ఫలితాల కోసం www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment