
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువును జూన్ 3వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. బుధవారం వరకు 2,01,367 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో ఇంజనీరింగ్ కోసం 1,35,151 మంది, అగ్రికల్చర్ కోసం 66,216 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.
లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
తెలంగాణ లాసెట్ దరఖాస్తుల గడువును వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని లాసెట్ కమిటీ పేర్కొంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment