టీఎస్‌ ఎంసెట్‌ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు  | TS EAMCET 2021 Application Deadline Again Without Late Fee Extended | Sakshi

టీఎస్‌ ఎంసెట్‌ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు

Published Fri, Jul 2 2021 1:52 PM | Last Updated on Fri, Jul 2 2021 1:52 PM

TS EAMCET 2021 Application Deadline Again Without Late Fee Extended - Sakshi

టీఎస్‌ ఎంసెట్‌– 2021 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించారు.

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఎంసెట్‌– 2021 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్‌ కన్వీనర్‌ ఎ.గోవర్ధన్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురువారం ఓ ప్రకటనలో ఆయన సూచించారు. 

ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశాలు 
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్‌): రాష్ట్రంలోని 6 ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్నాటిక్‌ సంగీతం, కూచిపూడి, కథక్‌ నృత్యాలు, భరతనాట్యం, సితార్, మృదంగం, వీణ, నాదస్వరం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

కనీసం 10 సంవత్సరాల వయసు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–24758090, భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–27801788, అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–23523850, విద్యా రణ్య ప్రభుత్వ సంగీత కళాశాల కోసం 87024 23628 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement