date extension
-
భూమి మీద సరే.. చంద్రుడిపై టైం, తేదీలను ఎలా లెక్కిస్తారు?
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే దాకా అంతా టైమ్ ప్రకారం జరగాల్సిందే. వాచీలోనో, ఫోన్లోనో టైమ్ చూసుకుంటూ జీవితాన్ని పరుగెత్తించాల్సిందే. మనం అనుకున్నదేదైనా జరగకుంటే ‘టైం’ బాగోలేదని వాపోవడమే. ఇది సరేగానీ.. భూమిపై ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ జోన్ ఉంటుంది. ఇండియాకు పగలు అయితే.. అమెరికాకు రాత్రి అవుతుంది. మరి అంతరిక్షంలో ఏ టైమ్, తేదీ పాటించాలి? చంద్రుడిపై సమయం, తేదీలను లెక్కించేదెలా? ఇలాంటి సందేహాలు ఎప్పుడైనా వచ్చాయా.. వీటికి సమాధానాలేమిటో తెలుసుకుందామా.. అప్పట్లో చుక్కలను చూస్తూ.. మానవ నాగరికత అభివృద్ధి మొదలైన తొలి నాళ్లలో అంతరిక్షంలోని నక్షత్రాలు, సూర్య, చంద్రుల స్థితి ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. తర్వాతి కాలంలో గడియారాలతో సమ యాన్ని లెక్కించడం మొదలైంది. పగలు, రాత్రి సమయాల్లో తేడాకు అనుగుణంగా.. భూమిని వివిధ టైమ్ జోన్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో వేర్వేరు సమయాలను వినియోగిస్తున్నారు. మనుషులు భూమికే పరిమితమైనంత కాలం ఇది బాగానే ఉంది. కానీ అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్‌లోకి మను షులు వెళ్లిరావడం, భవిష్య త్తులో చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లేందుకు ప్రయోగాలు వంటి వాటితో.. ఏ ‘టైమ్’ను అనుసరించాలనే తిప్పలు మొదలయ్యాయి.\ ఇప్పుడు స్పేస్‌లో వాడుతున్నది ఏ ‘టైమ్’? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ ఎస్) భూమి చుట్టూ రోజుకు 16 సార్లు తిరుగుతుంది. ఈ సమయంలో పదహారు సార్లు సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతాయి. ఒక్కో సమయంలో ఒక్కో దేశంపై ఉంటుంది. మరి టైమ్ ఎలా!?.. దీని కోసం ‘యూనివర్సల్ టైమ్ (యూటీ)’ను పాటిస్తున్నారు. - భూమ్మీద టైమ్ జోన్లను ఏర్పాటు చేసు కున్నప్పుడు బ్రిటన్‌లోని గ్రీన్ విచ్ ప్రాంతాన్ని మూలంగా తీసుకున్నారు. అక్కడ మొదలయ్యే మొదటి టైమ్ జోన్‌ను ‘గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ)’గా వ్యవహరిస్తారు. ప్రస్తుతానికి దీనినే ‘యూనివర్సల్ టైమ్’గా పాటిస్తున్నారు. - అయితే ఈ ‘యూటీ’ కేవలం భూమి చుట్టూ ఉన్న స్పేస్ వరకే.. చంద్రుడిపై, అంగారకుడిపై టైమ్‌ను లెక్కించేందుకు ప్రపంచ దేశాల మధ్య ప్రస్తుతం ఎలాంటి ఒప్పందాలూ లేవు. స్పేస్ ప్రయోగాలకు.. ‘ఎంఈటీ’.. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి వాటిని లాంచ్ చేసిన క్షణం నుంచి.. ఎంతెంత సమయం గడిచిన కొద్దీ ఏమేం జరిగిందనేది కీలకమైన అంశం. ఈ క్రమంలోనే స్పేస్ ప్రయోగాల్లో ప్రత్యేకంగా ‘మిషన్ ఎలాప్స్‌డ్ టైమ్ (ఎంఈటీ)’ని వాడుతారు. అంటే ఒక రాకెట్ లాంచ్ అయినప్పటి నుంచీ టైమ్ లెక్కించడం మొదలుపెడతారు. దీనినే ‘టీ ప్లస్ టైమ్’గా చూపిస్తారు. - ఉదాహరణకు ఒక చంద్రుడి వద్దకు కృత్రిమ ఉపగ్రహాన్ని పంపి, 2రోజుల 5 గంటల పది నిమి షాలు అయితే.. ఆ శాటిలైట్‌కు సంబంధించిన టైమ్‌ను ‘టీ+ 2డేస్ 5 హవర్స్ 10 మినట్స్’గా లెక్కిస్తారు. ఈ విధానాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగాలు చేపట్టినప్పటి నుంచీ వాడుతున్నారు. అప్పట్లో దీనిని ‘గ్రౌండ్ ఎలాప్స్‌డ్ టైమ్ (జీఈటీ)’గా పిలిచారు. తర్వాత ఎంఈటీగా మార్చారు. చంద్రుడిపై ఇలా లెక్కిస్తే సరి అంటూ.. - స్పేస్ ప్రయోగాల వరకు సరేగానీ.. చంద్రుడిపై నివాసం ఏర్పర్చు కున్నాక అక్కడ ‘టైమ్’ ఎలాగనే సందేహాలు మొదలయ్యాయి. భూమ్మీదిలా పగలు, రాత్రి కలిపి ఒక రోజుగా లెక్కిద్దామంటే కష్టం. - సాధారణంగా సూర్యోదయం నుంచి అస్తమయం వరకు పగలు.. అప్పటి నుంచి మళ్లీ సూర్యోదయం వరకు రాత్రి. ఈ లెక్కన చంద్రుడిపై సుమారు 15 రోజులు పగలు, మరో 15 రోజులు రాత్రి ఉంటాయి (భూమ్మీది సమయం ప్రకారం). అంటే చంద్రుడిపై ఒక రోజు (మూన్ డే) అంటే.. మనకు నెల రోజులు అన్నమాట. - ఈ సమస్యను అధిగమించడానికి, భూమ్మీది సమయానికి సులువుగా అనుసంధానం చేయగలగడానికి ఒక ప్రతిపాదన ఉంది. చంద్రుడిపై సెకన్లు, నిమిషాలు, గంటలను యథాతథంగా లెక్కిస్తూనే.. రోజు (24 గంటల సమయం)ను మాత్రం ఒక సైకిల్‌గా పిలవాలని, 30 సైకిల్స్ కలిస్తే ఒక పూర్తి మూన్డేగా పరిగణించాలని ఆలోచన. అంటే మనకు ఒక నెల ఒక మూన్డే.. మనకు ఒక రోజు ఒక మూన్ సైకిల్‌గా లెక్కించొచ్చు. దీన్ని ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. -సాక్షి, సెంట్రల్ డెస్క్ -
తెలంగాణ: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు అభ్యర్థుల కోసం మరో ప్రకటన చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవాళ్టితో గడువు ముగియాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ నెల(మే) 26వ తేదీ వరకు తుది గడువు ఉంటుందని తెలిపింది. పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. దీంతో.. ఇప్పుడు దరఖాస్తుదారుల కోసం గడువు తేదీని పొడిగించినట్లు తెలుస్తోంది. పోలీసుశాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎస్ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల(మే) 2వ తేదీ నుండి పోలీస్ ఉద్యోగాల కోసం ధరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒకే అభ్యర్ధి ఎన్ని పోస్టులకైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 20 రాత్రి 10 గంటల వరకు సమయమని తొలుత పేర్కొంది. అయితే వయోపరిమితి పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువు తేదీని కూడా పెంచింది. మరోవైపు వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయంటూ కొందరు దరఖాస్తుదారులు ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. చదవండి: తెలంగాణలో డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ -
‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 23 వరకూ పొడిగించినట్లు ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కొత్తగా బీఏ (ఆనర్స్) కోర్సును రెండు కాలేజీల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిం చారు. పొడిగించిన తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని, కొత్త కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చని ఆయన వివరించారు. -
Telangana: సెట్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్–2021 దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లాసెట్ తెలంగాణలో న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీలాసెట్ – 2021 దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. విద్యార్థులు వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తద్వారా వారు ఎంచుకున్న సమీప ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాన్ని కేటాయించే వీలు ఉంటుందని చెప్పారు. పీఈసెట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్–2021 దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. టీఎస్ ఐసెట్ కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగించారు. పరీక్షకు ఈ నెల 23వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుండడం, కొన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలు జరగకపోవడంవల్ల ఈ నెల 15వ తేదీతో ముగియనున్న గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలతో పెంచామని ఆయన పేర్కొన్నారు. -
లాసెట్ సహా ఇతర సెట్స్ దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: లాసెట్ దరఖాస్తుల గడువును రూ.4 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు. గతంలో ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులను సబ్మిట్ చేయని విద్యార్థులు కూడా దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని వెల్లడించారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. మరోవైపు రూ.1,000 ఆలస్య రుసుముతో ఐసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును రూ. 2 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్ మృణాళిని పేర్కొన్నారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్ దరఖాస్తుల గడువులను ఆలస్య రుసుముతో ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయా సెట్ల కన్వీనర్లు వెల్లడించారు. పీజీఈసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఇక పాలిసెట్ దరఖాస్తు గడు వును రూ.200 ఆలస్య రుసుముతో ఈనెల 25వతేదీ వరకు పొడిగించినట్లు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ వెల్లడించారు. -
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని అభ్యర్థులు గడువు పెంచమని కోరారని అధికారులు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును ఈ నెల 11 (రేపు ఆదివారం) అర్థరాత్రి 12గంటల వరకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో 13 జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆదివారం రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి 21 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మరోక రోజు గడువు పెంచడంతో 22 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
ఎల్ఆర్ఎస్కు మరో అవకాశం!
సాక్షి, హైదరాబాద్: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకుని గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన వారికి శుభవార్త. క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం కల్పించాలనే ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. గత నెలాఖరుతో ముగిసిపోయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన గడువును మరో నెల రోజులు పొడిగించడంతో పాటు ఫీజు చెల్లించని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015, నవంబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టి నిర్దేశిత ఫీజులతో సహా దరఖాస్తుల సమర్పణకు 2016, మార్చి వరకు సమయమిచ్చింది. ఎల్ఆర్ఎస్ కింద 2.6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 20 వేలకు పైగా దరఖాస్తుదారులు గడువులోగా ఫీజులు చెల్లించలేకపోయారు. రెండేళ్లుగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఫీజు బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తే ఈ దరఖాస్తులను సైతం పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో హెచ్ఎండీఏతో పాటు ఇతర పురపాలికలకు మరింత ఆదాయం రానుందని భావిస్తోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు గత నెలాఖరుతో ముగిసింది. అప్పటికి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 40 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ నెలాఖరులోగా గడువు పొడిగించనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ నుంచి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. -
వీఐడీకి గడువు పెంపు
న్యూఢిల్లీ : ప్రతిచోటా ఆధార్ కార్డు చూపడం, నంబరు చెప్పడం వంటివి లేకుండా వర్చువల్ ఐడీ (వీఐడీ)ని జూన్ 1, 2018 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏ).. యూజర్ ఏజెన్సీలను ఆదేశించింది. కాగా యూజర్ ఏజెన్సీ(బ్యాంకులు, టెలికం, రాష్ట్ర ప్రభుత్వాలు)ల విజ్ఞప్తి మేరకు గడువును మరొక నెల పొడిగించి జూలై 1, 2018లోపు వీఐడీని ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. వీఐడీలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ అమలు చేయడానికి మరికొంత సమయం కావాలని యూజర్ ఏజెన్సీలు విన్నవించడంతో ఈ గడువును మరొక నెల పొడిగించామని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరిలో వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత కల్పించేందుకు వీఐడీలను యూఐడీఏఐ తప్పనిసరి చేసింది. దీంతో ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ వెబ్సైట్లో 12 అంకెల ఐడీ నంబరుకు బదులుగా బయోమెట్రిక్ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం బీటా వెర్షన్‌తో కూడిన వీఐడీని అందుబాటులోకి తెచ్చింది. -
డిగ్రీ పరీక్షల దరఖాస్తు ఫీజు గడువు పెంపు
ఎస్కేయూ : ఎస్కేయూ పరిధిలో డిగ్రీ పరీక్షల దరఖాస్తు ఫీజు గడువు 9 వరకు పొడిగించినట్లు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ఆచార్య రెడ్డి వెంకటరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
సంక్రాంతి కానుక పంపిణీకి గడువు పొడిగింపు
అనంతపురం అర్బన్ : తెల్ల రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం మరో రెండు రోజులు పొడిగించినట్లు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. శని, ఆదివారం కూడా కానుక పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం 10.40 లక్షల మంది కార్డుదారులు సంక్రాంతి కానుక తీసుకున్నారని తెలిపారు. తొలుత ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 13 నాటికి కానుక పంపిణీ ప్రక్రియని ముగించాల్సి ఉందన్నారు. అయితే పూర్తి స్థాయిలో కార్డుదారులుకు కానుక అందించాలనే ఉద్దేశంతో గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించినట్లు తెలిపారు. 15వ తేదీ తర్వాత మిగిలిన కానుకలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలకు తరలించాలని పౌర సరఫరాల సంస్థ అధికారులను ఆదేశించామని తెలిపారు. కానుక కోసం వచ్చిన వారికి డీలర్లు తప్పకుండా ఇవ్వాలని, అలా ఇవ్వని డీలర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. -
రీసెట్ గడువు పొడిగింపు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్ గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య బీవీ రాఘవులు తెలిపారు. వీసీ ఆచార్య కె.రాజగోపాల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
బకాయిల చెల్లింపునకు వెసులుబాటు
అనంతపురం అర్బ¯న్ : పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో మున్సిపల్ పన్నులు, ఇతరత్రా ప్రభుత్వ సంస్థలకు చెల్లించే బకాయిలను శుక్రవారం సాయంత్రం లోగా ఆయా సంస్థలో చెల్లించవచ్చునని జాయింట్ కలెక్టర్ లక్ష్మికాంతం ఒక ప్రకటలో తెలిపారు. పాత నోట్లను కౌంటర్లో స్వీకరిస్తారని తెలిపారు. -
తాడిపత్రి మార్కెట్ కమిటీ గడువు పొడిగింపు
అనంతపురం అగ్రికల్చర్ : తాడిపత్రి వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ పాలక వర్గం గడువు ఆరు నెలలు పొడిగిస్తూ ఆ శాఖ సెక్రటరీ, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదట నిర్ణయించినట్లు ఒక సంవత్సరం కాలపరిమితి గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నందున ఉన్న పాలకవర్గానికి మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. -
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు అపరాధ రుసుంతో ఫీజు చెల్లించడానికి ఈనెల 31 వరకు గడువు పొడిగించారు. అడ్మిషన్ ఫీజుతోపాటు పదో తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.200 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని డీఈఓ అంజయ్య, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దగ్గర్లో ఉన్న స్టడీ సెంటర్ల కో–ఆర్డినేటర్లను సంప్రదించి వారి లాగిన్ ఐడీ ద్వారా దరఖాస్తులను ఆన్లైన్ చేయించాలని సూచించారు. అనంతరం వచ్చిన రెఫరెన్స్ నంబరు ఆధారంగా మీసేవా, ఏపీ ఆన్లైన్లో ఫీజులు చెల్లించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2016–17 సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశానికి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10 వరకు గడువు పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఎస్వీయూ దూరవిద్య అడ్మిషన్ల గడువు పెంపు
తిరుపతి: శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ దూర విద్యా విభాగంలో పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ల గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు డీడీఈ (డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడుకేషన్) డెరైక్టర్ ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. వివిధ స్టడీ సెంటర్ల కో-ఆర్డినేటర్ల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆసక్తి గలవారు దగ్గరలోని స్టడీ సెంటర్లో సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చని సూచించారు. అసైన్మెంట్ మార్కులు పొందని విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించి తిరిగి అసైన్మెంట్లు సమర్పించాలని చెప్పారు. -
మైనార్టీలకు స్కాలర్షిప్ గడువు పెంపు
హైదరాబాద్: మైనార్టీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునే గడువును పొడిగించినట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ షఫీయులా తెలిపారు. ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కమ్ స్కాలర్షిప్ కోసం అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.