అనంతపురం అర్బన్ : తెల్ల రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం మరో రెండు రోజులు పొడిగించినట్లు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. శని, ఆదివారం కూడా కానుక పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం 10.40 లక్షల మంది కార్డుదారులు సంక్రాంతి కానుక తీసుకున్నారని తెలిపారు. తొలుత ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 13 నాటికి కానుక పంపిణీ ప్రక్రియని ముగించాల్సి ఉందన్నారు.
అయితే పూర్తి స్థాయిలో కార్డుదారులుకు కానుక అందించాలనే ఉద్దేశంతో గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించినట్లు తెలిపారు. 15వ తేదీ తర్వాత మిగిలిన కానుకలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలకు తరలించాలని పౌర సరఫరాల సంస్థ అధికారులను ఆదేశించామని తెలిపారు. కానుక కోసం వచ్చిన వారికి డీలర్లు తప్పకుండా ఇవ్వాలని, అలా ఇవ్వని డీలర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.
సంక్రాంతి కానుక పంపిణీకి గడువు పొడిగింపు
Published Fri, Jan 13 2017 10:00 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
Advertisement
Advertisement