న్యూఢిల్లీ : ప్రతిచోటా ఆధార్ కార్డు చూపడం, నంబరు చెప్పడం వంటివి లేకుండా వర్చువల్ ఐడీ (వీఐడీ)ని జూన్ 1, 2018 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏ).. యూజర్ ఏజెన్సీలను ఆదేశించింది. కాగా యూజర్ ఏజెన్సీ(బ్యాంకులు, టెలికం, రాష్ట్ర ప్రభుత్వాలు)ల విజ్ఞప్తి మేరకు గడువును మరొక నెల పొడిగించి జూలై 1, 2018లోపు వీఐడీని ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. వీఐడీలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ అమలు చేయడానికి మరికొంత సమయం కావాలని యూజర్ ఏజెన్సీలు విన్నవించడంతో ఈ గడువును మరొక నెల పొడిగించామని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు.
కాగా ఈ ఏడాది జనవరిలో వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత కల్పించేందుకు వీఐడీలను యూఐడీఏఐ తప్పనిసరి చేసింది. దీంతో ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ వెబ్‌సైట్‌లో 12 అంకెల ఐడీ నంబరుకు బదులుగా బయోమెట్రిక్ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం బీటా వెర్షన్‌తో కూడిన వీఐడీని అందుబాటులోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment