ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్
ఉత్తీర్ణుల్లో బాలికలే ఎక్కువ.. 12 నుంచి కౌన్సెలింగ్
రాష్ట్రంలో మొత్తం 42,192 పీజీ సీట్లు
ఈ ఏడాది మరో 2 వేలు అదనంగా వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కాలేజీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగేట్) ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. సెట్‌లో 94.57 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 45 కోర్సులకు సంబంధించిన ఈ సెట్‌ను గత నెల 6 నుంచి 16వ తేదీ వరకూ నిర్వహించారు. 73,342 మంది పరీక్షకు దరఖాస్తు చేస్తే, 64,765 మంది పరీక్షకు హాజరయ్యారు.
వీరిలో 61,246 మంది (94.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పీజీ సెట్ పరీక్ష రాసిన వారు, అర్హత సాధించిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. బాలురు 21,757 మంది పరీక్ష రాస్తే, 20,569 మంది పాసయ్యారు. బాలికలు 43,008 మంది రాస్తే 40,677 మంది పాసయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మహమూద్, ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సెట్ కనీ్వనర్ పాండు రంగారెడ్డి పాల్గొన్నారు.
12 నుంచి కౌన్సెలింగ్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కనీ్వనర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు సరి్టఫికెట్లను ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ కోసం అప్‌లోడ్ చేయాలని సూచించారు. కాలేజీల్లో చేరేటప్పుడు మాత్రమే ఒరిజినల్ సరి్టఫికెట్లు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 42,192 పీజీ సీట్లున్నాయని, ఈ సంవత్సరం మరో 2 వేల సీట్లు అదనంగా వచ్చే వీలుందని తెలిపారు. 278 కాలేజీలు కౌన్సెలింగ్ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment