దేశంలోనే పురాతన యూనివర్సిటీల్లో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ. దీనితోపాటు రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీలు వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ ఏడు యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీజీఈటీ)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
కోర్సులు
► సీపీజీఈటీ2021 పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులతోపాటు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ తదితర కోర్సుల్లోనూ ప్రవేశం లభిస్తుంది.
► ఈ పరీక్ష ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో..పలు ఎంఏ కోర్సులు, జర్నలిజం /లైబ్రరీ సైన్స్/సోషల్ వెల్ఫేర్/ డెవలప్‌మెం ట్ స్టడీస్ /హెచ్‌ఆర్‌ఎం/టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు.
► ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో.. పురాతన భారతీయ చరిత్ర–సంస్కృతి, పురావస్తు శాస్త్రం(ఏఐహెచ్‌సీఏ), హిందీ, ఇస్లామిక్ స్టడీస్, పర్షియన్, తెలుగు, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళ సబ్జెక్టులు, థియేటర్ ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి.
► ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్‌లో.. ఎంకామ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యు కేషన్‌లో ఎంఈడీ, ఎంపీఈడీ;
► ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ విభాగంలో.. బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రాని క్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ఫోరెన్సిక్ సైన్స్/ మైక్రోబయాలజీ/ జెనెటి క్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వంటి సబ్జెక్టులు ఉన్నాయి.
అర్హతలు
► సీపీజీఈటీ–2021కు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్(బీఏ/బీకామ్/బీఎస్సీ తత్సమాన కోర్సులు) పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
► బీఏ/బీఎస్సీ/బీకామ్/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ ఎల్‌ఎల్‌బీ(ఐదేళ్లు)/బీసీఏ వంటి కోర్సులు చదివినవారు ఏయే కోర్సులకు తమ విద్యార్హతలు సరిపోతాయో దరఖాస్తు చేసుకునే ముందు సరిచూసుకోవాలి.
► ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన ఎమ్మెస్సీ/ఎంబీఏ/ఎంఏ కోర్సులకు ఇంటర్మీడియట్ (10+2) పూర్తి చేసినవారు అర్హులు. ∙పీజీ డిప్లొమా కోర్సులకు గ్రాడ్యుయేషన్ (ఆయా కోర్సులను బట్టి) పూర్తిచేసి ఉండాలి.
► ఓపెన్/దూర విద్య విధానంలో ఒకే సబ్జెక్టుతో గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసినవారు పీజీ కోర్సులకు అర్హులు కారు.
► బీకామ్ అభ్యర్థులు ఎంఏ ఎకనామిక్స్ చేసేందుకు అనర్హులు. ∙ఎంఏ లాంగ్వేజెస్ కోర్సులకు బీఈ/బీటెక్ వంటి కోర్సులు చేసినవారు అనర్హులు.
► బీఎస్సీ(ఎంఎల్‌టీ)/బీఎస్సీ(నర్సింగ్)/బీఎస్సీ (అగ్రికల్చర్)/బీఫార్మసీ/బీఎస్సీ(హోమ్‌సైన్స్) /బీటెక్/బీఈ వారు ఎమ్మెస్సీ కోర్సులకు అనర్హులు.
► బీఈ/బీటెక్ అభ్యర్థులు ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ , ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో పరీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ సీపీజీఈటీను మొత్తం 94 సబ్జెక్టుల్లో నిర్వహిస్తుంది. అభ్యర్థి తన అర్హతలను బట్టి ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఆన్‌లైన్ విధానంలో(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. అభ్యర్థుల అర్హత, ఎంచుకునే కోర్సులను బట్టి పరీక్ష పేపర్లలో తేడాలుంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
► ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 25.08.2021
► రూ.500 ఆలస్య రుసుంతో చివరి తేది: 30.08.2021
► రూ.2000 ఆలస్య రుసుంతో చివరి తేది: 03.09.2021
► సీపీజీఈటీ– 2021 పరీక్ష తేది: 08.09.2021
► వివరాలకు వెబ్‌సైట్: www.tscpget.com
Comments
Please login to add a commentAdd a comment