
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలను పెంచే దిశగా సాంకేతిక విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాలిసెట్‌కు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్‌ను అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలతో కూడిన వాల్ పోస్టర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా విస్తృత స్థాయిలో విద్యార్థుల్లో అవగాహన కల్పించనుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు అత్యధికంగా రూ.9.02 లక్షలు ప్యాకేజీలను దక్కించుకోవడంపై ప్రచారం చేపడుతూ విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే ఉన్నత విద్య, నైపుణ్యా శిక్షణ కార్యదర్శి కోన శశిధర్, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ జి.గణేష్ కుమార్, కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment