
సాక్షి, విజయవాడ: ఏపీ పాలిసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. 91.84 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. 1,31,608 మంది పరీక్షలు రాశారు. బాలురు 90.56 శాతం, బాలికలు 93.96 శాతం ఉత్తీర్ణులయ్యారు. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన పాలీసెట్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడొచ్చు.
చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం