సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌ను మే 21న నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ మేరకు పాలిసెట్ -2014కు అవసరమైన మార్గదర్శకాలకు సంబంధించి శుక్రవారం ఉన్నత విద్యాముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా జీవో 78 జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 68 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 21న పరీక్ష నిర్వహించి జూన్ 5న ఫలితాలను ప్రకటి స్తారు. దాదాపు 92 వేల సీట్లను పాలిసెట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
పర్యావరణ విద్య పరీక్షకు 9.04 లక్షల మంది
ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన పర్యావరణ విద్య పరీక్షకు 9,04,201 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు. 35,134 మంది గైర్హాజరు అయిన ట్లు పేర్కొన్నారు.
3 పాలిటెక్నిక్‌లకు 47పోస్టులు..
రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో చెవిటి, మూగ విద్యార్థుల కోసం అదనపు సెక్షన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటిని ఏర్పాటు చేసే కాకినాడ, వరంగల్, సికింద్రాబాద్‌లోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కాలేజీల్లో 47 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ జీవో జారీ చేసింది.
ప్రతిభా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి...
లాసెట్-2013 పరీక్షలో 350లోపు ర్యాంకు సాధించిన మైనారిటీ విద్యార్థులు ప్రతిభ స్కాలర్‌షిప్ కోసం వచ్చేనెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల విద్యా శాఖ సూచించింది. వివరాలకు www.apcce.gov.in లో చూడొచ్చని పేర్కొంది.
‘టెట్’ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టెకెట్లను శుక్రవారం నుంచే డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ పరీక్షను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. హాల్‌టికెట్లను aptet.cgg.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
మే 21న ‘పాలిసెట్’
Published Sat, Feb 1 2014 4:32 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement