జేఎన్‌టీయూ: ఏపీ పాలిసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 30 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆష్రప్ ఆలీ తెలిపారు. జూన్ 6 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు.
తీసుకరావాల్సిన సర్టిఫికెట్లు : ఏపీ పాలిసెట్ –2017 ర్యాంకు కార్డు , హాల్‌టికెట్ –పదవ తరగతి మార్క్స్ మెమో –4 నుంచి 10 వరకు స్టడీ సర్టిఫికెట్లు –రెసిడెన్స్ సర్టిఫికెట్ –విద్యార్థి ఆధార్ కార్డు, –కుల ధ్రువీకరణ పత్రం, –కౌన్సెలింగ్ ఫీజు రూ. 250 ఎస్సీ, ఎస్టీ కేటగిరి విద్యార్థులు, రూ.500 ఓసీ, బీసీ విద్యార్థులు .
వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సిన తేదీలు: జూన్2 ,3 తేదీల్లో 1–30 వేల ర్యాంకుల వరకు, 4,5 తేదీల్లో 30001–60 వేల వరకు , 6,7 తేదీల్లో 60,001–చివరి ర్యాంకు వరకు
=జూన్ 10న సీటు అలాట్‌మెంట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
=ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, విజయవాడ హెల్ప్‌లైన్ సెంటర్‌లో హాజరుకావాలి.
హాజరుకావాల్సిన ర్యాంకర్ల వివరాలు
కౌన్సెలింగ్ తేదీ ప్రభుత్వపాలిటెక్నిక్ కళాశాల,
అనంతపురం. (ర్యాంకు సంఖ్య)
మే 30 1–10 వేల ర్యాంకు వరకు
మే 31 10,001 –20 వేల వరకు
జూన్ 1 20,001–32 వేల వరకు
2 32,001–45 వేల వరకు
3 45,001–60 వేల వరకు
4 60001–75 వేల వరకు
5 75,001– 87 వేల వరకు
6 87,001– చివరి ర్యాంకు వరకు