
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్) వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను వాయిదా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం మే 17న పాలిసెట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 24న నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి ఎ.పుల్లయ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
కాగా దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్నారు.. తెలంగాణలో నాలుగో విడుతలో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.
చదవండి: ప్రణీత్ రావు పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment