
ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఇడ్లీ కడై’(Idli Kadai) (ఇడ్లీ కొట్టు) సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు మేకర్స్. ఈ చిత్రంలో ధనుష్‌కి జోడీగా నిత్యా మీనన్ నటించారు.
ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ మూవీ నిర్మించారు. ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ, ధనుష్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ‘తిరు’ (2022) సినిమా తర్వాత ధనుష్–నిత్యా మీనన్ నటించిన రెండో చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ సినిమాలో అరుణ్ విజయ్, ప్రకాశ్‌రాజ్, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ మూవీ పోస్ట్‌ప్రోడక్షన్ పనులు పూర్తి కానందునే వాయిదా వేశారని కోలీవుడ్ టాక్.