30 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
నంద్యాలఅర్బన్: పాలిసెట్-2017లో అర్హత సాధించిన విద్యార్థులకు సీట్ల కేటాయింపు కోసం ఈ నెల 30 నుంచి జూన్ 6 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఈఎస్‌సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వై. విజయభాస్కర్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక కళాశాలలో ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఉదయం 9గంటల నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్, పాలిసెట్ ర్యాంకు కార్డు, 10వ తరగతి సర్టిఫికెట్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ «ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు మొదలగు ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కళాశాలలకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చన్నారు. జూన్ 8వ తేదీ ఆప్షన్లను మార్చుకొనే అవకాశం ఉంటుందన్నారు. 10వ తేదీ కళాశాలల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఎస్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కర్నూలులో జరుగుతుందని, ఎన్‌సీసీ, పీహెచ్, క్యాబ్, స్పొర్ట్స్ కేటగిరీల సంబంధించిన వారికి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు. వివరాలకు https://appolycet.nic.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
తేదీ - ర్యాంకులు
30.05.17 1 - 10వేలు
31.05.17 10001 - 20,000
01.06.17 20,001 - 32,000
02.06.17 32,001 -45000
03.06.17 45,001 - 60,000
04.06.17 60,001 - 75,000
05.06.17 75,001 - 87,000
06.06.17 87,001 - చివరి వరకు