ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష జరగనుంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు ఒక్క నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 311 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలిసెట్కు ప్రశ్నాపత్రం కోడ్ నెంబర్:ఎస్-2ను ఎంపిక చేశారు.