రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ను ఈ నెల 14 నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించిన సాంకేతిక విద్యా శిక్షణ మండలి రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేయలేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు పొందిన 162 కాలేజీల్లో రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఇప్పటివరకు 62 కాలేజీలకే అనుబంధ గుర్తింపునిచ్చింది.