ఏపీ సెట్‌ల ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధప్రదేశ్ లాసెట్, ఎడ్‌సెట్, పాలిసెట్‌ల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం www.sakshieducation.comను చూడొచ్చు. ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎడ్‌సెట్:
- హాజరైన వారు 7,152 మంది
- అర్హత సాధించినవారు 7,010 మంది
- 98.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు
- ఎడ్‌సెట్‌లో ఉత్తీర్ణులైన వారికి జూన్ చివరి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
పాలిసెట్:
- పరీక్షకు హాజరైన విద్యార్థులు ఒక లక్షా ఇరవై రెండు వేల మంది
- 96155 మంది అర్హత సాధించారు
- ఉత్తీర్ణత శాతం 78.20
- 66,191 అబ్బాయిలు, 29,904 అమ్మాయిలు పాలీసెట్‌లో అర్హత సాధించారు
- తూర్పు గోదావరికి చెందిన సాయి ప్రవీణ్ గుప్తా మొదటి ర్యాంకు సాధించాడు. కృష్ణా జిల్లాకు చెందిన మధు మురళి రెండో ర్యాంకు సాధించాడు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ జూన్ మొదటివారంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
లాసెట్: ఏపీ లాసెట్‌లో ఐదు సంవత్సరాల కోర్సుకు 85 శాతం మంది, మూడు సంవత్సరాల కోర్సుకు 82 శాతం మంది, 2 సంవత్సరాల కోర్సుకు 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.