lawcet
-
టీఎస్ ఈసెట్, లాసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఈసెట్, లాసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్సీహెచ్ఈ పేర్కొంది. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు, రూ.1000 చెల్లిస్తే ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే1 నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, 6న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 28న లాసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 3న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు నిర్వహించనున్నారు. -
Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఎంసెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ తదితర కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వీ వెంకటరమణతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూల్ కింది విధంగా ఉంది. ► మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ► మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీలు. ► మే 18న టీఎస్ ఎడ్ సెట్ ►మే 20న టీఎస్ ఈసెట్ ► మే 25న లాసెట్(ఎల్ఎల్బీ), పీజీ లాసెట్ ► మే 26, 27న టీఎస్ పీజీ ఐసెట్ ►మే, 29 నుంచి జూన్ ఒకటి వరకు పీజీ ఈసెట్య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా -
ఏపీ లాసెట్, ఎడ్‌సెట్- 2022 ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీ లాసెట్, ఏపీ ఎడ్‌సెట్- 2022 ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్, పీజీఎల్ సెట్, ఏపీ ఎడ్‌సెట్ పరీక్షలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించింది. లాసెట్ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో మొదటి ఆరు ర్యాంకులు సాధించి మహిళలు సత్తా చాటారు. ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు ► బైలాజికల్ సైన్లో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి ఓరం అమర్నాథ్ రెడ్డికి మొదటి ర్యాంకు. ► మాథమ్యాటిక్స్‌లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మల్లెల గిరీష్ కుమార్ రెడ్డికి తొలి ర్యాంకు. ► ఇంగ్లీష్‌లో కేరళ రాష్టానికి చెందిన అంజనాకు మొదటి ర్యాంకు. ► సోషల్ స్టడీస్‌లో నంద్యాల జిల్లాకు చెందిన ఏ శివానీకి మొదటి ర్యాంకు. ► ఫిజికల్ సైన్స్‌లో విజయనగరం జిల్లాకు చెందిన కె.వాణికి మొదటి ర్యాంకు. ఏపీ లాసెట్ ఫలితాల్లో సత్తాచాటిన మహిళలు.. ఏపీ లాసెట్ ఫలితాల్లో మహిళలు సత్తా చాటారు. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన బి.కీర్తికి లాసెట్ 5 ఇయర్స్ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంకు వచ్చింది. టాప్ టెన్ ర్యాంకుల్లో మొదటి ఆరు ర్యాంకులు మహిళలకే దక్కాయి. ఇదీ చదవండి: పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు -
6 నుంచి లాసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: మూడు, ఐదేళ్లు, పోస్టు గ్రాడ్యుయేట్ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 6 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పంపవచ్చని చెప్పారు. పరీక్ష ఫీజును ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500, మిగతావారికి రూ.800గా నిర్ణయించారు. పీజీ లాసెట్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.800, మిగతావారికి రూ.1,000 ఉంటుంది. ఈ కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో 3, 5 ఏళ్ల ఎల్ఎల్ బీ, 2 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి గ త నెల 22న నిర్వహించిన ఏపీ లాసెట్–2021 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తిరుపతిలో గురువారం విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ లాసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మూడు కోర్సుల్లోనూ మహిళలే మొదటి ర్యాంకులు సాధిం చారని తెలిపారు. వర్సిటీ వీసీ డి.జమున, లాసెట్ కన్వీనర్ చంద్రకళ, రెక్టార్ డి.శారద, రిజిస్ట్రార్ మమత పాల్గొన్నారు. మూడేళ్ల ఎల్ఎల్బీలో హరిప్రియకు మొదటి ర్యాంకు మూడేళ్ల ఎల్ఎల్బీలో మోపూరు హరిప్రియ (విజయవాడ రూరల్) మొదటి ర్యాంకు పొందారు. ఏపీ ట్రాన్స్‌కోలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మోపూరు హరిప్రియ 53 ఏళ్ల వయసులో ఈ ర్యాంక్ సాధించడం విశేషం ఎల్.రాజా (గుంటూరు) రెండో ర్యాంకు, కె.హరికృష్ణ (అనంతపురం) మూడో ర్యాంకు సాధించారు. ఐదేళ్ల ఎల్ఎల్బీకి సంబంధించి ఎం.మౌనిక బాయి (బనగానపల్లె, కర్నూలు జిల్లా) మొదటి ర్యాంకు పొందారు. వి.నాగసాయి ప్రశాంతి (రణస్థలం, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, సునీల్ (పూసపాటిరేగ, విజయనగరం జిల్లా) మూడో ర్యాంకు సాధించారు. ఇక రెండేళ్ల ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్షలో వై.గీతిక (విశాఖపట్నం) మొదటి ర్యాంకు పొందారు. కె.కృష్ణమ నాయుడు (ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, టి.రమేష్ బాబు (విజయవాడ) మూడో ర్యాంకు సాధించారు. -
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, తిరుపతి: ఏపీ లాసెట్ పరీక్ష ఫలితాలు గురువారం విడదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. న్యాయ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు. ఏపీ లాసెట్-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి కాగా మూడేళ్ల లా కోర్సులో విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన లీలా రాజా సెకండ్ ర్యాంక్.. కందలగడ్డ హరికృష్ణ మూడో ర్యాంకు సాధించారు. చీరాలకు చెందిన గొర్ల హారిబాబు, అనంతపురానికి చెందిన సాతర్ల మంజునాధ 4, 5 ర్యాంకులు సాధించారు. చదవండి: ఏపీ: ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐదేళ్ల లా కోర్సుల్లో ►మొదటి ర్యాంక్- మోనికా భాయి, బనగానపల్లె, కర్నూల్ జిల్లా. ►సెకండ్ ర్యాంక్- వెలిచేటి నాగ సాయి ప్రశాంతి, బంటుపల్లి, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా ►మూడో ర్యాంక్- ఇనపకుర్తి శ్రీనివాస సునీల్, బూడి వీధి పూసపాటి రేగడ, విజయనగరం జిల్లా, ►నాలుగవ ర్యాంక్-నర్మద భారతి, మాకవరపాలెం, విశాఖపట్నం. ►అయిదో ర్యాంక్- బొప్పరాజు వెంకట బ్రహ్మం, తర్ల పాడు, ప్రకాశం జిల్లా పీజీ లాసెట్‌లో ►మొదటి ర్యాంక్- యారబాల గీతిక, శివాజిపాలెం, విశాఖపట్నం ►సెకండ్ ర్యాంక్.- కాగడాల కృష్ణం నాయుడు, శ్రీకాకుళంజిల్లా.. ► మూడో ర్యాంక్, రరమేష్ బాబు తాత పూడి, విజయవాడ ► నాలుగో ర్యాంక్- మన్నం సుసన్యా, విజయవాడ ► అయిదో ర్యాంక్- సనతనా భారత్, శాంతి నగర్, నెల్లూరు -
ఏపీ సెట్.. ఈజీగా అప్లై చేసుకోండి ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న పలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిల్లో ఏపీ ఈఏపీసెట్, ఏపీఈసెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఎడ్‌సెట్, ఏపీ పీజీఈసెట్, ఏపీ లాసెట్ తదితరాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఆయా సెట్లకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. సదరు ఏపీ సెట్లకు అర్హతలు, ప్రవేశం కల్పించే కోర్సులు, ప్రవేశ పరీక్షల విధానంపై ప్రత్యేక కథనం... ఏపీ ఈఏపీసెట్ ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే ఎంట్రన్స్ టెస్టు.. ‘ఈఏపీసెట్’ (పూర్వపు ఎంసెట్). ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ, కాకినాడ నిర్వహిస్తోంది. ► ప్రవేశం కల్పించే కోర్సులు: ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ. అర్హతలు ► ఇంజనీరింగ్, ఫార్మసీ(ఎంపీసీ), ఫార్మా డీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత/తత్సమాన అర్హత ఉండాలి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► బీఎస్సీ అగ్రికల్చర్/బీఎస్సీ హార్టికల్చర్/బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్ఎస్సీ /బీటెక్ (ఎఫ్ఎస్టీ)/బీఎస్సీ(సీఏ అండ్ బీఎం)/బీఫార్మసీ/బీటెక్(బయోటెక్నాలజీ)(బైపీసీ), ఫార్మా డీ(బైపీసీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ బైపీసీ/తత్సమాన అర్హత ఉండాలి. ► ఇంజనీరింగ్ పరీక్ష విధానం: ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ) విధానంలో జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు–80మార్కులకు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు సెట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ► అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష విధానం: అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో బయాలజీ 80 ప్రశ్నలు–80 మార్కులకు(బోటనీ 40, జువాలజీ 40); ఫిజిక్స్ 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు –40 మార్కులకు పరీక్ష ఉంటుంది. ► ఈఏపీసెట్‌లో అర్హత సాధించేందుకు కనీసం 25 శాతం మార్కులు రావాలి. ఎంట్రెన్స్‌లో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ కల్పించి.. తుది ర్యాంకు ప్రకటిస్తారు. ఎస్సీ/ఎస్టీలకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021(ఆలస్య రుసం లేకుండా) ► పరీక్ష తేదీలు: ఆగస్టు 19 నుంచి 25 వరకు ► ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్: https://sche.ap.gov.in/EAPCET/EapcetHomePages/Home.aspx ఏపీ ఈసెట్ ఏపీ ఈసెట్(ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్/బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది(లేటరల్ ఎంట్రీ)లో ప్రవేశం లభిస్తుంది. అర్హతలు ► డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫార్మసీ/బీఎస్సీ(మ్యాథమెటిక్స్) అభ్యర్థులు ఈసెట్‌కు దరఖాస్తుకు అర్హులు. కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. పరీక్ష విధానం ► ఈసెట్ పరీక్ష మూడు విధాలుగా జరుగుతుంది. ఇంజనీరింగ్/ఫార్మసీ/బీఎస్సీ విభాగాల అభ్యర్థులకు భిన్నంగా ప్రశ్న పత్రం ఉంటుంది. 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ► ఇంజనీరింగ్ విభాగంలో.. మ్యాథ్స్ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఫిజిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, కెమిస్ట్రీ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంజనీరింగ్(సంబంధిత బ్రాంచ్) 100 ప్రశ్నలు–100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ► ఫార్మసీ విభాగంలో.. ఫార్మాస్యూటిక్స్–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మకాలజీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాకోగ్నసీ–50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► బీఎస్సీ(మ్యాథ్స్) విభాగంలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు–100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు–50 మార్కులకు, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021 ► పరీక్ష తేది: 19.09.2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx ఏపీ ఐసెట్ ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఐసెట్–2021 కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది ఐసెట్‌ను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. అర్హతలు ► 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు ఎంబీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఎంసీఏకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ► డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాల అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. పరీక్ష విధానం ► ఐసెట్ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్సన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులు; సెక్షన్ బీలో కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 ప్రశ్నలు–70 మార్కులకు; సెక్షన్ సీలో మ్యాథమెటికల్ ఎబిలిటీ55ప్రశ్నలు–55 మార్కు లకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.08.2021 ► ఏపీ ఐసెట్ పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్ 17,18 ► వెబ్సైట్: https://sche.ap.gov.in/icet ఏపీ ఎడ్‌సెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ/గవర్నమెంట్/ఎయిడెడ్/ప్రైవేట్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో.. రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఏపీ ఎడ్‌సెట్–2021 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ► బీఏ/బీకామ్/బీఎస్సీ/బీఎస్సీ/బీబీఎంలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్/బీఈలో 50 మార్కులు తెచ్చుకున్నవారు సైతం బీఈడీలో చేరేందుకు అర్హులు. పరీక్ష విధానం ► ఎడ్‌సెట్ ఆన్లైన్ విధానంలో మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు జరుగుతుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటలు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు–15 మార్కులు, టీచింగ్ అప్టిట్యూడ్10 ప్రశ్నలు–10 మార్కులు; –మెథడాలజీలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు–100 మార్కులు/ఫిజికల్ సైన్స్: ఫిజిక్స్–50, కెమిస్ట్రీ–50/బయలాజికల్ సైన్స్: బోటనీ–50, జువాలజీ–50/సోషల్ స్టడీస్: జాగ్రఫీ–35, చరిత్ర–30, సివిక్స్–15, ఎకనామిక్స్–20(మొత్తం 100)/ ఇంగ్లిష్: 100 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► దరఖాస్తులకు చివరి తేది: 17.08.2021 ► ఎడ్‌సెట్ పరీక్ష తేది: 21.09.2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx ఏపీపీజీఈ సెట్ ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్(ఎంటెక్/ఎంఈ/ఎంఫార్మా,ఫార్మాడీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ పీజీఈసెట్–2021 నోటిఫికేషన్ విడుదలైంది. ► అర్హత: బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించాలి, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 45శాతం మార్కులు వచ్చి ఉండాలి. పరీక్ష ‘ఆన్లైన్’ విధానంలో ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. ప్రశ్నలు అభ్యర్థి ఏ విభాగంలో పీజీ చేయదలచారో దాని ఆధారంగా ఉంటాయి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021 ► ఏపీపీజీఈ సెట్ తేదీలు:27–30 సెప్టెంబర్ 2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/PGECET -
Career Guidance: న్యాయవాదిగా రాణించాలంటే..?
కెరీర్లో న్యాయవాదిగా రాణించాలనుకుంటున్నాను.. నాకు అందుబాటులో ఉన్న కోర్సులు, ఉద్యోగ అవకాశాల గురించి తెలపండి? ► నైపుణ్యాలుంటే.. చక్కటి అవకాశాలు లభించే కోర్సు.. లా! గతంలో న్యాయ విద్య కోర్సులు అభ్యసించిన వారు కోర్టులకే పరిమితమయ్యే పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు కార్పొరేట్ రంగంలో సైతం లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచం విస్తరించాక ఈ కెరీర్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచీకరణ, బహుళజాతి కంపెనీల విస్తరణే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు దేశంలో ముఖ్యమైన కేసులు వాదించేందుకు గంటల లెక్కన భారీ ఫీజులు తీసుకునే అడ్వకేట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చట్టాలపై పట్టు, వాదనా పటిమ, చురుకుదనం ఉన్నవారికి లా చక్కటి కెరీర్. ► ఇంటర్మీడియెట్/10+2తోనే దేశవ్యాప్తంగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ప్రధానంగా బీఏ ఎల్ఎల్బీ/బీకామ్ ఎల్ఎల్బీ/ బీఎస్సీ ఎల్ఎల్బీ/బీబీఏ ఎల్ఎల్బీలో చేరొచ్చు. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ‘కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ప్రతిభ చూపాలి. క్లాట్‌తోపాటు దేశంలో న్యాయవిద్యకు సంబంధించి ఆలిండియా లా ఎంట్రన్స్ టెస్ట్, లా స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్– ఇండియా(ఎల్‌శాట్–ఇండియా); టీఎస్‌లాసెట్/ఏపీలాసెట్ (తెలుగు రాష్ట్రాల్లో) వంటి ప్రవేశ పరీక్షలకు హాజరుకావచ్చు. ► అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత పొస్టు గ్రాడ్యుయేషన్‌లో.. సివిల్/క్రిమినల్/ కార్పొరేట్/ఎన్విరాన్మెంటల్/కాన్స్టిట్యూషనల్/సైబర్/ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా/రియల్ ఎస్టేట్ లా/మీడియా లా/ఇంటర్నేషనల్/బిజినెస్ లా/ట్యాక్స్‌లా.. ఇలా పలు స్పెషలైజేషన్స్ చేయవచ్చు. డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్ -
ఏపీ: 16 నుంచి లాసెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లాసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు లాసెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. లా కోర్సులకు సంబంధించి వివిధ కాలేజీల్లోని కోర్సులకు ప్రభుత్వం బుధవారం ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఫీజులు ఖరారవ్వడంతో తొలివిడత ప్రవేశాల ప్రక్రియను కన్వీనర్ ప్రకటించారు. షెడ్యూల్ ఇలా.. ప్రక్రియ తేదీ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ 16 నుంచి 18 ధ్రువపత్రాల పరిశీలన 16 నుంచి 18 వెబ్ ఆప్షన్ల నమోదు 16 నుంచి 18 సీట్ల కేటాయింపు 20 కాలేజీల్లో రిపోర్టింగ్ 22, 23 (చదవండి: రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్) ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం! -
ఏపీ లాసెట్‌లో 91.39% ఉత్తీర్ణత
అనంతపురం: రాష్ట్రంలో న్యాయ విద్య డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీలాసెట్–2020 ఫలితాల్లో 91.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏపీలాసెట్ ఫలితాలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ చాంబర్లో రెక్టార్ ప్రొఫెసర్ కృష్ణనాయక్, ఏపీలాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జ్యోతి విజయకుమార్‌లు గురువారం వెల్లడించారు. అక్టోబర్ 1న ఏపీ లాసెట్ ప్రవేశ పరీక్ష జరుగగా, కోవిడ్ పాజిటివ్ వచ్చిన అభ్యర్థులకు అక్టోబర్ 31న ప్రత్యేకంగా ఏపీ లాసెట్ నిర్వహించారు. అక్టోబర్ 3న ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. ఇందులో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మూడేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 3 మార్కులు, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 1 మార్కు, రెండేళ్ల పీజీ లా కోర్సు ప్రవేశ పరీక్షకు 2 మార్కులు చొప్పున కలిపారు. మొత్తం 18,371 మంది దరఖాస్తు చేయగా, 12,284 మంది పరీక్ష రాశారు. వీరిలో 11,226 మంది (91.39%) అర్హత సాధించారు. అభ్యర్థులు htt p;//rche.ap.gov.in/LAWCET వెబ్సైట్లో తమ ఫలితాలను, ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూడేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షలో టాపర్స్.. 1) టి.రవీంద్రబాబు (కృష్ణా జిల్లా), 2) కేశమ్ వేణు (ప్రకాశం), 3) అప్పానంద (తూర్పుగోదావరి), 4) పవన్‌కుమార్ (గుంటూరు), 5) జూటూరు దివ్యశ్రీ (అనంతపురం), 6) ఉప్పర సాగర్ (కర్నూలు), 7) పి.నరేంద్ర (కర్నూలు), 8) విజయలక్ష్మి.టి (కృష్ణా), 9) బల్లా ప్రసాదరావు (శ్రీకాకుళం), 10) విజయ్‌కిరణ్ (కృష్ణా) ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షలో టాపర్స్.. 1) ఆర్.నాగశ్రీ (తెలంగాణ), 2) వి.వీణ (చిత్తూరు), 3) కేజీ కార్తికేయ్ (నెల్లూరు) 4) రాజశ్రీరెడ్డి (తూర్పుగోదావరి) 5) చక్రధర్‌రెడ్డి (కర్నూలు) ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్ష టాపర్స్ వీరే.. 1) డి.రవిచంద్ర (తూర్పుగోదావరి), 2) అహల్య చలసాని (కృష్ణా), 3) ఎం.హరికృష్ణ (శ్రీకాకుళం), 4) పి.రచన (చిత్తూరు) 5)యు.తోషిత (కృష్ణా) ఫలితాల కోసం చూడండి.. http://sakshieducation.com/ -
సెట్స్ దరఖాస్తులు 4,68,271
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్) రాసేందుకు 4.68 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పాలీసెట్‌కు ఈనెల 10తో దరఖాస్తు గడువు ముగిసిపోగా, ఆ తరువాత నుంచి ఆలస్య రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఆయా సెట్స్‌కు 4,68,271 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఎంసెట్‌కు 2,21,505 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ తరువాత పాలీసెట్‌కు 64,454 మంది, ఐసెట్‌కు 55,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3 వరకు ఎంసెట్ హాల్‌టికెట్ల డౌన్లోడ్ జూలై 6–9 తేదీల మధ్య నిర్వహించే ఎంసెట్‌కు గతేడాది కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 2.17 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈసారి 2,21,505 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,42,645 మంది, అగ్రికల్చర్ కోసం 78,565 మంది, రెండింటి కోసం 295 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. జూలై 1న 250 కేంద్రాల్లో పాలీసెట్ పదో తరగతి ఉత్తీర్ణులై.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూలై 1న పాలీసెట్ 2020 ప్రవేశపరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి యూవీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. విద్యార్థులు ఫీజు చెల్లించినప్పుడే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే పాలీసెట్‌కు 38,404 మంది బాలురు, 26,050 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందే వెళ్లి చూసుకోవాలని సూచించారు. జూలై 4న ఈసెట్ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) ఉద్దే శించిన ఈసెట్‌ను జూలై 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఆన్లైన్లో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు తమ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కాగా, జూలై 1 నుంచి 4 వరకు నిర్వహించే పీజీఈసెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు ఇప్పటికే చర్యలు చేపట్టామని పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు. విద్యార్థులు ఈ నెల 30 వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జూలై 5 నుంచి ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు జూలై 15న నిర్వహించే ఎడ్‌సెట్ కోసం జూలై 5 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తెలిపారు. ఇక పీఈసెట్‌కు హాజరయ్యేందుకు 5,457 మంది దరఖాస్తు చేసుకున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ చెప్పారు. ఈసారి స్కిల్టెస్టును రద్దు చేశామని, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు మాత్రమే ఉంటుందని, త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. జూలై 13న జరిగే ఐసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 30 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. జూలై 2 నుంచి లాసెట్ హాల్‌టికెట్లు లాసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 28,805 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 20,575 మంది పురుషులే. ఈసారి న్యాయవిద్య కోర్సుల్లో చేరేందుకు ఐదుగురు ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ముగ్గురు మూడేళ్ల న్యాయవిద్య కోర్సులో చేరేందుకు, ఇద్దరు ఐదేళ్ల కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. జూలై 10న నిర్వహించే లాసెట్ కోసం.. 2వ తేదీనుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. -
ఏపీ లాసెట్ ఫలితాల విడుదల
సాక్షి, అమరావతి : ఏపీ లాసెట్ - 2019 ప్రవేశ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 92.4శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. బుధవారం నుంచి ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. -
మార్చి 15 నుంచి లాసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించనున్న లాసెట్–2019కి వచ్చే నెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని లాసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన లాసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశాల షెడ్యూలును ఖరారు చేసింది. మే 20న ఉదయం 10 నుంచి 11:30 వరకు ఆన్లైన్లో ప్రవేశపరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 10న జారీ చేయనుంది. సిలబస్, అర్హతలు, ప్రాంతీయ కేంద్రాలపై చర్చించింది. ఎల్ఎల్బీ పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.800గా నిర్ణయించింది. పీజీ లా పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.800, ఇతరులకు రూ.1,000గా నిర్ణయించింది. వివరాలను https://lawcet.tsche.ac.in లో పొందవచ్చని వివరించింది. సమావేశంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, మండలి కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి పాల్గొన్నారు. -
25 నుంచి లాసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్ : న్యాయ విద్య డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న లాసెట్–2018 నోటిఫికేషన్‌ను ఈ నెల 22న విడుదల చేయాలని సెట్ కమిటీ నిర్ణయించింది. సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో ప్రవేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దరఖాస్తులను ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో స్వీకరించాలని నిర్ణ యించింది. రిజిస్ట్రేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.800గా ఖరారు చేసింది. పీజీ లాసెట్ ప్రవేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీనికి రిజి స్ట్రేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.600, ఇతరులకు రూ.1000గా నిర్ణయించింది. -
ఏపీ సెట్ల ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధప్రదేశ్ లాసెట్, ఎడ్‌సెట్, పాలిసెట్‌ల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం www.sakshieducation.comను చూడొచ్చు. ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్‌సెట్: - హాజరైన వారు 7,152 మంది - అర్హత సాధించినవారు 7,010 మంది - 98.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు - ఎడ్‌సెట్‌లో ఉత్తీర్ణులైన వారికి జూన్ చివరి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పాలిసెట్: - పరీక్షకు హాజరైన విద్యార్థులు ఒక లక్షా ఇరవై రెండు వేల మంది - 96155 మంది అర్హత సాధించారు - ఉత్తీర్ణత శాతం 78.20 - 66,191 అబ్బాయిలు, 29,904 అమ్మాయిలు పాలీసెట్‌లో అర్హత సాధించారు - తూర్పు గోదావరికి చెందిన సాయి ప్రవీణ్ గుప్తా మొదటి ర్యాంకు సాధించాడు. కృష్ణా జిల్లాకు చెందిన మధు మురళి రెండో ర్యాంకు సాధించాడు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ జూన్ మొదటివారంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. లాసెట్: ఏపీ లాసెట్‌లో ఐదు సంవత్సరాల కోర్సుకు 85 శాతం మంది, మూడు సంవత్సరాల కోర్సుకు 82 శాతం మంది, 2 సంవత్సరాల కోర్సుకు 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. -
ఏపీ సెట్ల ఫలితాలు విడుదల
-
మార్చి 4 నుంచి లాసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లు, ఐదేళ్ల లాసెట్, పీజీ లాసెట్ కోసం వచ్చే నెల 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని లాసెట్ కమిటీ నిర్ణయించింది. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న జారీ చేయనుంది. లాసెట్ కోసం ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.350 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్లు, ఐదేళ్ల లాసెట్ మే 27న ఉదయం 10 గంటలకు, పీజీ లాసెట్ అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మూడేళ్ల లా కోర్సుకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించినట్లు కమిటీ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5ఏళ్ల సడలింపు ఉంటుంది. ఐదేళ్ల లా కోర్సుకు గరిష్ట వయోపరిమితి 20 ఏళ్లుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, లాసెట్ చైర్మన్, కేయూ వీసీ సాయన్న, కన్వీనర్ ఎంవీ రంగారావు పాల్గొన్నారు. -
లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణలో లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఇవాళ లాసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశ పరీక్షకు భగీరథ ఎస్-1, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు రామప్ప ఎస్-1 ప్రశ్నాపత్రాన్ని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ చిరంజీవులు ఎంపిక చేశారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశ పరీక్షకు 13,323 మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 4,104 మంది, ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్షకు 1,793 మంది.. మొత్తంగా 19,220 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇక మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశపరీక్ష ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రంలోని 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
నేడే లాసెట్
► ఎల్ఎల్బీకి 17,427 మంది, ఎల్ఎల్ఎంకు 1,793 మంది.. ► 37 పరీక్షా కేంద్రాల ఏర్పాటు కేయూ క్యాంపస్: రాష్ర్టంలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న లాసెట్ మంగళవారం జరగనుంది. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశ పరీక్షకు 13,323 మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 4,104 మంది, ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్షకు 1,793 మంది.. మొత్తంగా 19,220 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశపరీక్ష మంగళవారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రంలోని 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, అభ్యర్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు సూచించారు. నిర్ణీత సమయూనికి ఒక నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని, బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల వేలిముద్రలు సేకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు సెల్ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సూచించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 50 మంది పరిశీలకులతోపాటు ఆరు ఫ్లరుుంగ్ స్క్వాడ్లను నియమించినట్లు ఆయన వివరించారు. -
మే2న తెలంగాణ ఎంసెట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కామన్ ఎంట్రెన్స్ టెస్టు తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు సెట్ల తేదీలను ప్రకటించారు. ఈ ఏడాది ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్టీయూ నిర్వహించనుంది. ఎడ్ సెట్, పీజీ సెట్ల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్శిటీకి అప్పగించారు. ఐసెట్, లా సెట్ నిర్వహణ బాధ్యతలు కాకతీయ యూనివర్శిటీ నిర్వహించనుంది. మే2న ఎంసెట్ మే12న ఈసెట్ మే19న ఐసెట్ మే24న లాసెట్ మే27న ఎడ్ సెట్ మే29 న పీజీసెట్ -
తెలంగాణ లాసెట్, ఐసెట్ ఫలితాల విడుదల
హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన లాసెట్, ఐసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఐసెట్‌లో కష్ణా జిల్లాకు చెందిన కృష్ణ చైతన్య తొలి ర్యాంక్ సాధించాడు. (ఐసెట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి) (లాసెట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి) -
లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాప్రతాల ఎంపిక
హైదరాబాద్: లాసెట్-2014 ప్రవేశ పరీక్ష నేడు జరగనుంది. ప్రశ్నాపత్నం కోడ్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎంపిక చేశారు. మూడేళ్ల లాసెట్ కు యమున ఎస్ -2 ప్రశ్నాపత్రం, ఐదేళ్ల లాసెట్ కు వెంకటాద్రి ఎస్-1 ప్రశ్నాప్రతం ఎంపిక చేసినట్టు ప్రకటించారు. తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కరీంనగర్, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం పట్టణాల్లో లాసెట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల మధ్య జరుగుతుంది. అలాగే పీజీ లా ప్రవేశ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య తిరుపతి, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంలో నిర్వహించనున్నారు.