
సాక్షి, హైదరాబాద్: ఈసెట్, లాసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌సీహెచ్‌ఈ పేర్కొంది.
రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు, రూ.1000 చెల్లిస్తే ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే1 నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, 6న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ నెల 28న లాసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 3న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు నిర్వహించనున్నారు.