eset
-
టీఎస్ ఈసెట్, లాసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఈసెట్, లాసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్సీహెచ్ఈ పేర్కొంది. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు, రూ.1000 చెల్లిస్తే ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే1 నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, 6న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 28న లాసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 3న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు నిర్వహించనున్నారు. -
14 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈసెట్–2023 కౌన్సెలింగ్‌ను ఈ నెల 14 నుంచి ప్రారంభిస్తున్నట్టు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆమె కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసెట్‌లో అర్హత సాధించినవారు ఈ నెల 14 నుంచి 17 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సూచించారు. అనంతరం 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 19 నుంచి 21 వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుందన్నారు. 22న అభ్యర్థులు ఆప్షన్లను మార్చుకోవచ్చని తెలిపారు. 25న సీట్లు కేటాయిస్తామన్నారు. సీట్లు పొందినవారు 25 నుంచి 30లోగా ఆయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 14 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థులు ఈసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, పదో తరగతి మార్కుల సర్టిఫికెట్, పాలిటెక్నిక్ డిప్లొమా మార్కుల జాబితా, ప్రొవిజినల్ సర్టిఫికెట్, ఏడో తరగతి నుండి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2020 జనవరి 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, రిజర్వుడ్ అభ్యర్థులు.. అందుకు తగిన పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సిద్ధం చేసుకోవాలన్నారు. కాగా ఈ ఏడాది 38,181 మంది ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 34,503 మంది పరీక్ష రాశారన్నారు. ఇందులో 31,933 (92.55 శాతం) మంది అర్హత సాధించారని తెలిపారు. మరిన్ని వివరాలకు 7995681678, 7995865456, 9177927677 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు. -
ఈసెట్‌లో 93 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పలు డిప్లొమా కోర్సులు పూర్తిచేసి, ఇంజనీరింగ్ ద్వితీ య సంవత్సరంలో ప్రవేశానికి గత నెలలో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్–2003) ఫలితాల ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 20,988 మంది (93.07 శాతం) అర్హత సాధించారని వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించినవారి లో 14,415 మంది పురుషులు, 6,484 మంది మహిళలు ఉన్నారు. బీఎస్సీ (మ్యాథ్స్), కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాని క్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికే షన్ ఇంజనీరింగ్, ఇనుస్ట్రు మెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్, ఫార్మసీ బ్రాంచీల్లో 9 వేల సీట్లు ఉన్నా యని, వీటికి త్వరలో కౌన్సెలింగ్ చేపడతామని లింబాద్రి తెలిపారు. విలే కరుల సమావేశంలో ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ఓయూ వీసీ డి.రవీందర్ పాల్గొన్నారు. -
జూలై 14 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ను జూలై 14 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసెట్‌ను ఇదే నెల 13న నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మంగళవారం ఈ మేరకు షెడ్యూల్ వెల్లడించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా పలువురు ఉన్నతాధికారులతో ఆమె వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై చర్చించారు. వీటికి అవసరమైన నోటిఫికేషన్లను సంబంధిత విభాగాలు త్వరలో విడుదల చేస్తాయని ఆమె ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ జూలై 14, 15 తేదీల్లో, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు చేపట్టే ఎంసెట్ పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో ఉంటుందని చెప్పారు. మొత్తం 23 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 105 పరీక్ష కేంద్రాలను ఈ సెట్స్ కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు సమష్టిగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ వెయిటేజీ లేదు.. ఇంటర్మీడియెట్ మార్కులను ఎంసెట్‌లో వెయిటేజ్‌గా తీసుకోవడం లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి స్పష్టంచేశారు. కరోనా నేపథ్యంలో గతేడాది కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంసెట్ రాసే ఇంటర్ సెకండియర్ విద్యార్థులు గత ఏడాది ఆఖరులో జరిగిన ఇంటర్ ఫస్టియర్‌లో కేవలం 49 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ వాస్తవానికి ఎంసెట్‌ను జూన్‌లోనే నిర్వహించాలని తొలుత భావించారు. అనూహ్యంగా జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేయడంతో ఎంసెట్‌ను ఆలస్యంగా చేపట్టాల్సి వస్తోందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టులో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాతే ఎంసెట్ కౌన్సెలింగ్ చేపట్టడం సరైన నిర్ణయంగా భావించినట్టు చెప్పాయి. ఈ విధానం వల్ల సీట్ల లభ్యతపై స్పష్టత ఉంటుందని, గత ఏడాది కూడా ఇలాగే చేసినట్టు ఎంసెట్ నిర్వహణ విభాగం పేర్కొంది. -
నేడు ఏపీ ఈసెట్–2020
అనంతపురం విద్య: ‘ఏపీ ఈసెట్–2020’ సోమవారం రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ ఈసెట్ కన్వీనర్ పీఆర్ భానుమూర్తి తెలిపారు. వరుసగా ఏడో దఫా జేఎన్టీయూఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్‌లో మొత్తం 14 బ్రాంచిలకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బీఎస్సీ (మేథమేటిక్స్), సిరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఈఈఈ బ్రాంచిలకు పరీక్ష జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మైనింగ్, ఫార్మసీ బ్రాంచిల వారికి పరీక్ష ఉంటుందన్నారు. ఇక కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు విధానం రద్దు చేసి ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పరీక్ష కేంద్రంలో పూర్తిగా నిషేధించామన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్ వెనుక ఉన్న సెల్ఫ్ డిక్లరేషన్ స్థానంలో తప్పనిసరిగా సంతకం చేయాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన అభ్యర్థి టెస్ట్ సర్టిఫికెట్‌ను అందజేస్తే.. ఐసోలేషన్ కేంద్రంలో ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
మే 10న ఉమ్మడి ఎంసెట్
* షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: వచ్చే మే 10వ తేదీన ఉమ్మడి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) నిర్వహించనున్నారు. ఎంసెట్ సహా అన్ని సెట్లనూ ఉమ్మడిగానే మే నెలలో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) మే 14న, ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) 16న, ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్)ను 28న, లా కోర్సుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్, పీజీఎల్‌సెట్) 30న నిర్వహించనున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీ ఈసెట్) మే 25 నుంచి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్) మే 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి తెలిపారు. సోమవారం మండలి కార్యాలయంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ తామే ఎంసెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించి విద్యార0ు్థలకు ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 75, 95ల ప్రకారం రెండు రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అధికారం ఏపీ ఉన్నత విద్యామండలికే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి చట్టబద్ధత లేదని తేల్చి చెప్పారు. -
ఈసెట్ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి- విద్యార్థులు