సాక్షి, హైదరాబాద్: పలు డిప్లొమా కోర్సులు పూర్తిచేసి, ఇంజనీరింగ్ ద్వితీ య సంవత్సరంలో ప్రవేశానికి గత నెలలో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్–2003) ఫలితాల ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 20,988 మంది (93.07 శాతం) అర్హత సాధించారని వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించినవారి లో 14,415 మంది పురుషులు, 6,484 మంది మహిళలు ఉన్నారు.
బీఎస్సీ (మ్యాథ్స్), కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాని క్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికే షన్ ఇంజనీరింగ్, ఇనుస్ట్రు మెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్, ఫార్మసీ బ్రాంచీల్లో 9 వేల సీట్లు ఉన్నా యని, వీటికి త్వరలో కౌన్సెలింగ్ చేపడతామని లింబాద్రి తెలిపారు. విలే కరుల సమావేశంలో ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ఓయూ వీసీ డి.రవీందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment