
26,294 మందిలో 1,884 మందికి అర్హత
ఉస్మానియా యూనివర్సిటీ: అధ్యాపక ఉద్యోగాల అర్హత పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్–2024 (టీజీసెట్–2024) ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ శనివారం విడుదల చేశారు. ఫలితాలను http://telanganaset.org అనే వెబ్‌సైట్లో చూడవచ్చు.
గత సెప్టెంబర్‌లో జరిగిన పరీక్షకు 26,294 మంది అభ్యర్థులు హాజరుకాగా 1,884 మంది (7.17 శాతం) అర్హత సాధించారు. అందులో 50.21 శాతం పురుషులు కాగా 49 శాతం మహిళలున్నారు. అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్లను త్వరలో పరిశీలించనున్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment