* షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ఉన్నత విద్యా మండలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే మే 10వ తేదీన ఉమ్మడి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) నిర్వహించనున్నారు. ఎంసెట్ సహా అన్ని సెట్లనూ ఉమ్మడిగానే మే నెలలో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.
ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) మే 14న, ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) 16న, ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్)ను 28న, లా కోర్సుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్, పీజీఎల్‌సెట్) 30న నిర్వహించనున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీ ఈసెట్) మే 25 నుంచి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్) మే 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి తెలిపారు.
సోమవారం మండలి కార్యాలయంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ తామే ఎంసెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించి విద్యార0ు్థలకు ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 75, 95ల ప్రకారం రెండు రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అధికారం ఏపీ ఉన్నత విద్యామండలికే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి చట్టబద్ధత లేదని తేల్చి చెప్పారు.
మే 10న ఉమ్మడి ఎంసెట్
Published Tue, Dec 30 2014 2:10 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement