ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల | Andhra Pradesh Lawcet Results Released | Sakshi
Sakshi News home page

AP LAWCET Results: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల

Published Thu, Oct 21 2021 5:03 PM | Last Updated on Thu, Oct 21 2021 5:32 PM

Andhra Pradesh Lawcet Results Released - Sakshi

సాక్షి, తిరుపతి: ఏపీ లాసెట్ పరీక్ష ఫలితాలు గురువారం విడదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. న్యాయ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తెలిపారు.

ఏపీ లాసెట్‌-2021 ఫ‌లితాల కోసం క్లిక్‌  చేయండి

కాగా మూడేళ్ల లా కోర్సులో విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన లీలా రాజా సెకండ్‌ ర్యాంక్‌.. కందలగడ్డ హరికృష్ణ మూడో ర్యాంకు సాధించారు. చీరాలకు చెందిన గొర్ల హారిబాబు,  అనంతపురానికి చెందిన సాతర్ల మంజునాధ 4, 5 ర్యాంకులు సాధించారు.
చదవండి: ఏపీ: ఇంజనీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఐదేళ్ల లా కోర్సుల్లో

►మొదటి ర్యాంక్- మోనికా భాయి, బనగానపల్లె, కర్నూల్ జిల్లా.

►సెకండ్ ర్యాంక్- వెలిచేటి నాగ సాయి ప్రశాంతి,  బంటుపల్లి, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా

►మూడో ర్యాంక్- ఇనపకుర్తి శ్రీనివాస సునీల్, బూడి వీధి పూసపాటి రేగడ, విజయనగరం జిల్లా,

►నాలుగవ ర్యాంక్-నర్మద భారతి, మాకవరపాలెం, విశాఖపట్నం.

►అయిదో ర్యాంక్‌- బొప్పరాజు వెంకట బ్రహ్మం, తర్ల పాడు, ప్రకాశం జిల్లా

పీజీ లాసెట్‌లో

►మొదటి ర్యాంక్‌- యారబాల గీతిక, శివాజిపాలెం, విశాఖపట్నం

►సెకండ్ ర్యాంక్.- కాగడాల కృష్ణం నాయుడు, శ్రీకాకుళంజిల్లా..

► మూడో ర్యాంక్, రరమేష్ బాబు తాత పూడి,  విజయవాడ

► నాలుగో ర్యాంక్‌- మన్నం సుసన్యా, విజయవాడ

► అయిదో ర్యాంక్‌-  సనతనా భారత్, శాంతి నగర్, నెల్లూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement