రేపు ఏపీ లాసెట్‌–2024 | AP LACET Exams on June 9: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రేపు ఏపీ లాసెట్‌–2024

Published Sat, Jun 8 2024 4:29 AM | Last Updated on Sat, Jun 8 2024 4:29 AM

 AP LACET Exams on June 9: Andhra Pradesh

ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్‌– 2024 పరీక్షలను ఈ నెల 9న మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్‌ ఆచార్య బి.సత్యనారాయణ తెలిపారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ లాసెట్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కళాశాలల్లో  ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు.

ఏపీ లాసెట్‌కు 23,425  దరఖాస్తులు వచ్చాయన్నారు. పురుషులు 15,374 మంది, మహిళలు 8,051 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అభ్యర్థులు  https://cets. ap­sche.­ap.gov.in  ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తోపాటు ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తేవాలన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 105 పరీక్షా కేంద్రాలను ఏ­ర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను జూన్‌ 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.30 గంటల వరకు అనుమతిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement