results out
-
ఏపీలో ఎస్సై ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎస్సై పోస్టుల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఎస్సై పోస్టులకు మొత్తం 315 మంది ఎంపికయ్యారు. వీరిలో 102 మంది మహిళలు ఉన్నారు. సివిల్, ఎపీఎస్పీ విభాగాల్లో ఎస్సైల ఎంపిక జరిగింది. విశాఖ జోన్లో 50, ఏలూరు జోన్లో 105, గుంటూరు జోన్లో 55, కర్నూలు జోన్లో 105 మంది ఎంపియ్యారు. ఎస్సై పరీక్షల్లో గోనబోయిన విజయ భాస్కరరావు, మహిళల్లో లోగిస కృష్ణవేణి టాపర్‌గా నిలిచారు. త్వరలో ఎంపికైన వారికి సర్టిఫికెట్లు పరిశీలన, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ పేర్కొంది. -
టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం (సెప్టెంబర్ 27) ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలు sakshieducation.com వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. TS TET 2023 Results - Paper 1 | Paper 2 కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1కు 2.26 లక్షలు(84.12శాతం), పేపర్-2కు 1.90 లక్షల మంది (91.11 శాతం) హాజరయ్యారు. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే. దీని కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, తిరుపతి: ఏపీ లాసెట్ పరీక్ష ఫలితాలు గురువారం విడదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. న్యాయ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు. ఏపీ లాసెట్-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి కాగా మూడేళ్ల లా కోర్సులో విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన లీలా రాజా సెకండ్ ర్యాంక్.. కందలగడ్డ హరికృష్ణ మూడో ర్యాంకు సాధించారు. చీరాలకు చెందిన గొర్ల హారిబాబు, అనంతపురానికి చెందిన సాతర్ల మంజునాధ 4, 5 ర్యాంకులు సాధించారు. చదవండి: ఏపీ: ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐదేళ్ల లా కోర్సుల్లో ►మొదటి ర్యాంక్- మోనికా భాయి, బనగానపల్లె, కర్నూల్ జిల్లా. ►సెకండ్ ర్యాంక్- వెలిచేటి నాగ సాయి ప్రశాంతి, బంటుపల్లి, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా ►మూడో ర్యాంక్- ఇనపకుర్తి శ్రీనివాస సునీల్, బూడి వీధి పూసపాటి రేగడ, విజయనగరం జిల్లా, ►నాలుగవ ర్యాంక్-నర్మద భారతి, మాకవరపాలెం, విశాఖపట్నం. ►అయిదో ర్యాంక్- బొప్పరాజు వెంకట బ్రహ్మం, తర్ల పాడు, ప్రకాశం జిల్లా పీజీ లాసెట్‌లో ►మొదటి ర్యాంక్- యారబాల గీతిక, శివాజిపాలెం, విశాఖపట్నం ►సెకండ్ ర్యాంక్.- కాగడాల కృష్ణం నాయుడు, శ్రీకాకుళంజిల్లా.. ► మూడో ర్యాంక్, రరమేష్ బాబు తాత పూడి, విజయవాడ ► నాలుగో ర్యాంక్- మన్నం సుసన్యా, విజయవాడ ► అయిదో ర్యాంక్- సనతనా భారత్, శాంతి నగర్, నెల్లూరు -
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : పోలీస్ శాఖకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటకరీ కిశోర్ కుమార్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ అమిత్ గార్గ్‌లతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టులకు 49 మంది ఎంపికయ్యారు. హోమంత్రి సుచరిత మాట్లాడుతూ.. 2013 తర్వాత మళ్లీ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేపట్టామని తెలిపారు. పోస్టులకు ఎంపికయిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.కాగా ఎంపికైన అభ్యర్థులు రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి సేవలను అందిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.విభజన చట్టం ప్రకారం చాలా సంస్థలు కోల్పోయామని,ఇదే విషయమై సీఎం జగన్ కేంద్ర హోంమంత్రిని కలిసి ఏపిపీఎస్సీకి అకాడమీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.ఏపీలో ఇప్పటికే దిశ యాప్ చట్టాన్ని ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారని, దిశకి వచ్చిన ఫిర్యాదులపై రెస్పాన్స్ బాగానే ఉందని సుచరిత వెల్లడించారు. వెయిటింగ్లో ఉన్న వాళ్లకు పోస్టింగ్‌లు ఇచ్చామని, జీతాలు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
స్టీల్ ప్లాంట్ జూనియర్ ట్రైనీ ఫలితాల విడుదల
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ పోస్టుల ఫలితాలను విడుదల చేశారు. 366 జూనియర్ ట్రైనీ పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాత పరీక్ష నిర్వహించారు. తుది జాబితాను వైజాగ్‌స్టీల్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 17 నుంచి 30 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేసిన సంగతి తెలిసిందే.