![Assistant Public Prosecutor Results Are Released In AP - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/18/sucharitha.jpg.webp?itok=50aJu2Eb)
సాక్షి, అమరావతి : పోలీస్ శాఖకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటకరీ కిశోర్ కుమార్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ అమిత్ గార్గ్‌లతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టులకు 49 మంది ఎంపికయ్యారు.
హోమంత్రి సుచరిత మాట్లాడుతూ.. 2013 తర్వాత మళ్లీ ఇప్పుడు రిక్రూట్‌మెంట్ చేపట్టామని తెలిపారు. పోస్టులకు ఎంపికయిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.కాగా ఎంపికైన అభ్యర్థులు రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి సేవలను అందిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.విభజన చట్టం ప్రకారం చాలా సంస్థలు కోల్పోయామని,ఇదే విషయమై సీఎం జగన్ కేంద్ర హోంమంత్రిని కలిసి ఏపిపీఎస్సీకి అకాడమీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.ఏపీలో ఇప్పటికే దిశ యాప్ చట్టాన్ని ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని, దిశకి వచ్చిన ఫిర్యాదులపై రెస్పాన్స్ బాగానే ఉందని సుచరిత వెల్లడించారు. వెయిటింగ్‌లో ఉన్న వాళ్లకు పోస్టింగ్‌లు ఇచ్చామని, జీతాలు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment