assistant public prosecutor posts
-
ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ)ల నియామకానికి నోటిఫికేషన్ వచ్చింది. ఆదివారం ఉదయం వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాస రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతలు గలిగిన అభ్యర్థులంతా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత ప్రభుత్వం వెలువరించిన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. ఏపీపీల రిక్రూట్‌మెంట్‌ను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపడుతుందని ‘సాక్షి’ (ఆదివారం నాటి సంచికలో) ముందే తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఏ క్షణంలోనైనా పోలీసుశాఖలోని దాదాపు 19వేల పైచిలుకు పోస్టుల ఖాళీలకు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏపీపీ పోస్టుల వివరాలు ఇలా... 8 మొత్తం పోస్టులు: 151 వేతనం: రూ.54,220–రూ.1,33,630. వయోపరిమితి: 2021, జూలై 1 నాటికి 34 ఏళ్లు దాటకూడదు. కనీస విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ/ బీఎల్ లేదా ఇంటర్ తరువాత ఐదేళ్ల లా కోర్సు పూర్తిచేసి ఉండాలి. అనుభవం: జూలై 4 నాటికి కనీసం మూడేళ్లపాటు క్రియాశీలకంగా క్రిమినల్ కోర్టుల్లో అడ్వోకేటుగా పనిచేసి ఉండాలి. ఫీజు: తెలంగాణ స్థానికత కలిగిన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.750. మిగిలిన అభ్యర్థులు (ఓసీ/బీసీ) అంతా రూ.1500. అభ్యర్థుల దరఖాస్తు ప్రకియ ఆదివారం నుంచే మొదలవడం విశేషం. ఎంపిక, వయోపరిమితి ఇతర వివరాల కోసం https://www.tslprb.in/లో సంప్రదించగలరు. కొత్త జోన్ల ఆధారంగా కేటాయింపులు.. ప్రస్తుతం వెలువడిన ఏపీపీ నోటిఫికేషన్ ను కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ప్రకటించడం గమనార్హం. మొత్తం 151 పోస్టుల్లో మల్టీజోన్ 1 పరిధిలో 68 పోస్టులు ఉండగా, మల్టీజోన్ –2 పరిధిలో 83 పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టుల భర్తీలోనూ జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, విమెన్ రిజర్వేషన్లతోపాటు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్, వికలాంగుల రిజర్వేషన్ లను పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి కల్పించారు. వికలాంగులకు గరిష్టంగా పదేళ్ల మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు (టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీ తదితరాలకు వర్తించదు) వయోపరిమితి, ఎక్స్ సర్వీస్‌మెన్ (మాజీ సైనికాధికారులు), ఎన్ సీసీలో సేవలందించిన వారికి వమోపరిమితిలో మూడేళ్లపాటు మినహాయింపు కల్పించారు. -
తల మీద గన్ను పెడితేగానీ పనిచేయరా?
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) నియామకాల్లో తీవ్ర జాప్యంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. హోంశాఖ అధికారులు తల మీద గన్ను పెడితేగానీ పనిచేయరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ జస్టిస్ సిస్టంను బలోపేతం చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదా అని అసహనం వ్యక్తం చేసింది. ‘హోంశాఖ గాఢనిద్రలో ఉందా.. న్యాయవ్యవస్థ కూడా నిద్రపోవాలని భావిస్తోందా.. ఏపీపీ నియామకాలను పూర్తి చేయాలని లేకుంటే, కేసుకు తగిన ముగింపు ఇస్తాం’అని హెచ్చరించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో అదేభాషలో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. 174 ఏపీపీల నియామకాలు పూర్తి చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో రెండువారాల్లో చెప్పాలని, లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను ధర్మాసనం హెచ్చరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో ఏపీపీల పోస్టులను భర్తీ చేయడం లేదని, దీంతో క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాసిన లేఖను ధర్మాసనం 2018లో సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం మరోసారి విచారింఇచింది. ఏపీపీల నియామకాలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని గత ఏప్రిల్ 1న ధర్మాసనం ఆదేశించినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ హోంశాఖ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. అఫిడవిట్ దాఖలు చేయనందుకు క్షమించాలని, మరికొంత సమయం ఇస్తే పూర్తి వివరాలు సమర్పిస్తామని శ్రీకాంత్‌రెడ్డి నివేదించగా ‘మీ క్షమాపణలు ఎవరికి కావాలి ? ఏపీపీల నియామకం ద్వారా మాకేమైనా లబ్ధి జరుగుతుందా? క్రిమినల్ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుంది’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. డీవోపీ నియామకానికి మూడేళ్లు.. ‘‘ప్రాసిక్యూషన్ విభాగం పూర్తికాలం డైరెక్టర్ నియామకానికి మూడేళ్ల సమయం తీసుకున్నారు. 414 ఏపీపీల నియామకాల్లో 200 భర్తీ చేశామని గత విచారణ సందర్భంగా చెప్పారు. ఇటీవల భర్తీ చేసిన 40 పోస్టులు పోను మిగిలిన నియామకాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని ఆదేశించి దాదాపు రెండున్నర నెలలు గడిచినా అఫిడవిట్ దాఖలుకు ఇంకా సమయం కోరుతున్నారు. కోర్టుల్లో ఏపీపీలు లేకపోవడంతో క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నియామక ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేస్తూ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, లేకపోతే తదుపరి విచారణకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విచారణను జూలై 7కు వాయిదా వేసింది. -
సచివాలయం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు విడుదల
-
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : పోలీస్ శాఖకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటకరీ కిశోర్ కుమార్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ అమిత్ గార్గ్‌లతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టులకు 49 మంది ఎంపికయ్యారు. హోమంత్రి సుచరిత మాట్లాడుతూ.. 2013 తర్వాత మళ్లీ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేపట్టామని తెలిపారు. పోస్టులకు ఎంపికయిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.కాగా ఎంపికైన అభ్యర్థులు రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి సేవలను అందిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.విభజన చట్టం ప్రకారం చాలా సంస్థలు కోల్పోయామని,ఇదే విషయమై సీఎం జగన్ కేంద్ర హోంమంత్రిని కలిసి ఏపిపీఎస్సీకి అకాడమీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.ఏపీలో ఇప్పటికే దిశ యాప్ చట్టాన్ని ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారని, దిశకి వచ్చిన ఫిర్యాదులపై రెస్పాన్స్ బాగానే ఉందని సుచరిత వెల్లడించారు. వెయిటింగ్లో ఉన్న వాళ్లకు పోస్టింగ్‌లు ఇచ్చామని, జీతాలు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
ముగిసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష
సాక్షి, విజయవాడ: పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగంలో 50 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సెప్టెంబర్ 30న రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోని ఆరు సెంటర్లలో పరీక్ష ముగిసింది. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 20 వరుకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా సేకరించిన వివరాలను, మిగతా ఎంపిక ప్రక్రియలో కూడా బోర్డు ఉపయోగించనుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు 52 పరికరాల ద్వారా బయోమెట్రిక్ వివరాలు నిక్షిప్తం చేశారు. -
ఏపీపీ రాత పరీక్ష తుది కీలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీసెస్‌లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గ్రేడ్-2, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు జరిగిన రాత పరీక్ష తుది కీలో కొన్ని మార్పులున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచంద్రరావు గురువారం వెల్లడించారు. తాజా కీ వివరాలను www.apstatepolice.org వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.