![AP DGP Twitter Fake Account Deletion - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/31/AP-DGP_0.jpg.webp?itok=awzO3y0u)
సాక్షి, అమరావతి: డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అధికారిక ట్విటర్ అకౌంట్‌ను పోలిన నకిలీ అకౌంట్‌ను సృష్టించిన ఆగంతకుడు అందర్నీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇది ‘డీజీపీ అంధ్రప్రదేశ్’ అధికారిక అకౌంట్ అంటూ అపరిచితుడు చేసిన ట్వీట్‌తో అనుమానించిన డీజీపీ కార్యాలయం ఆరా తీస్తే అది నకిలీ అకౌంట్ అని బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఏపీ పోలీస్ టెక్ సర్వీసెస్ అధికారులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్ ః ఏపీస్టేట్‌డీజీపీ’ పేరుతో ఉన్న నకిలీ అకౌంట్‌ను బ్లాక్‌చేసి దాన్ని వినియోగించే అవకాశం లేకుండా తొలగించారు.
చదవండి: సక్సెస్ మంత్ర: రైతు బిడ్డ నుంచి ఇస్రో శాస్త్రవేత్తగా..
నైపుణ్య కళాశాలలు: ఏపీ సర్కార్ కీలక ముందడుగు..
Comments
Please login to add a commentAdd a comment