సాక్షి, అమరావతి: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రైమ్ రేటు తగ్గింపు, నాటు సారా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.
నెల్లూరు కోర్టులో దొంగతనంపై సాక్ష్యాలు ఆధారంగా ముందుకెళ్లామని చెప్పారు. విచారణలో వాస్తవాలని బట్టి ముందుకెళ్లాలని తెలిపారు. కేసులపై ఆరోపణలు చేయవచ్చు, కానీ వాస్తవాలు విచారణలో బయటపడతాయని తెలిపారు. ఎవరిదగ్గరైనా ఆధారాలుంటే ఇవ్వాలని సమన్లు జారీ చేశామని అన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. దిశ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే మహిళల వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.
ఆలూరు ఘటనలో 82 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. కఠినంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఉషశ్రీ చరణ్ ర్యాలీకి, చిన్నారిని తీసుకెళ్లే సమయానికి గంట తేడా ఉందని చెప్పారు. పాడేరు, మన్యం జిల్లాల్లో పోలీసు కార్యాలయాలు 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment