Friendly police system
-
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేస్తాం: ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రైమ్ రేటు తగ్గింపు, నాటు సారా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. నెల్లూరు కోర్టులో దొంగతనంపై సాక్ష్యాలు ఆధారంగా ముందుకెళ్లామని చెప్పారు. విచారణలో వాస్తవాలని బట్టి ముందుకెళ్లాలని తెలిపారు. కేసులపై ఆరోపణలు చేయవచ్చు, కానీ వాస్తవాలు విచారణలో బయటపడతాయని తెలిపారు. ఎవరిదగ్గరైనా ఆధారాలుంటే ఇవ్వాలని సమన్లు జారీ చేశామని అన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. దిశ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే మహిళల వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఆలూరు ఘటనలో 82 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. కఠినంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఉషశ్రీ చరణ్ ర్యాలీకి, చిన్నారిని తీసుకెళ్లే సమయానికి గంట తేడా ఉందని చెప్పారు. పాడేరు, మన్యం జిల్లాల్లో పోలీసు కార్యాలయాలు 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
పోలీసులు పనితీరుతో... నేరాల శాతం తగ్గుతోంది!!
గోల్కొండ: నిరంతరం సీసీ కెమెరాల నిఘా.. ఎక్కడ ఏ ఘటన జరిగినా నిముషాల్లో చేరుకుంటున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే కేసులను ఛేదిస్తుండటంతో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి.. దీంతో రాష్ట్ర జీడీపీ గుజరాత్, మహారాష్ట్రలతో పాటు పోటీపడుతూ గణనీయంగా పెరిగిందని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. టోలిచౌకి టూంబ్స్ రోడ్డులోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో ఆసిఫ్‌నగర్ డివిజన్‌కు చెందిన 100 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా పోలీసులు పనితీరులో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, ఫలితంగా నేరాల శాతం గతంతో పోలిస్తే చాలా తగ్గిందన్నారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) నేర విచారణలో కూడా సీసీ పుటేజీలను న్యాయస్థానంలో సాక్ష్యాలుగా చూపుతున్నట్లు ఆయన చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావాలని అన్నారు. దాతల సహకారంతోనే రూ.30 లక్షలతోనే హుమాయున్‌నగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాల్లో ఉన్న కెమెరాల వల్ల ఆ ప్రాంతాల్లో నేరాలు తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గాయని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు భావితరాలకు భద్రత కల్పిస్తుందన్నారు. ప్రతిపౌరుడు ఒక పోలీస్ అని, పోలీసులు సైతం పౌరులేనని ఆయన గుర్తు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అని పేరు వచ్చిందని చెప్పారు. శాంతిభద్రతలు అదుపులో ఉండటం, నేరాలు తగ్గడం వల్ల పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారన్నారు. 5 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్ల ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయని, దీనివల్ల యువతకు ఉపాధి కూడా లభించిందన్నారు. గతంలో ఒక్క కేసు ఛేదించడానికి, వ్యయప్రయాసలు ఉండేవని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటయ్యేవని గుర్తు చేశారు. సీసీ కెమెరాలతో అతి కొద్ది సమయంలోనే నిందితులకు శిక్షపడేలా చేయడం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో నగర జాయింట్ పోలీస్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, అడిషనర్ డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖి, ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ శివమారుతి, ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పీస్ అండ్ మైత్రి కమిటీ సభ్యులు రాజు వస్తాద్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
నాలుగో సింహానికి మూడో నేత్రం
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్ ప్రొటెక్షన్ వింగ్ వంటి వినూత్న పద్ధతులతో ముందుకు సాగుతున్న రాష్ట్ర పోలీసులు మరో కొత్త ప్రయత్నా నికి శ్రీకారం చుట్టారు. పోలీసింగ్‌లో పారదర్శకత తీసుకువచ్చేందుకు శాంతి భద్రతల విభాగం పోలీసులకు బాడీ వోర్న్ కెమెరా లేదా చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు ఇవ్వనున్నారు. ఇవి స్థానిక ఎస్పీ, కమిషనరేట్లతో పాటు, డీజీపీ ఆఫీసుకు కూడా అనుసంధానమై ఉంటాయి. ఫలితంగా ఘటనాస్థలంలో జరుగుతున్న కార్యక్రమాలను డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులు కూడా ప్రత్యక్షంగా వీక్షించగలరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో అన్ని జిల్లాల్లోని ముఖ్యమైన 10 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి వీటిని పంపిణీ చేశారు. తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లకు అందజేస్తారు. అందజేసిన సిబ్బందికి హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో వీటి వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. రాజధానిలో ఫలితాలివ్వడంతో..! చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు హైదరాబాద్‌లో ట్రాఫిక్ విభాగం పోలీసులు చాలా కాలం నుంచే అమలు చేస్తున్నారు. రాజధానిలో ధర్నాలు జరిగినప్పుడు వీటిని సివిల్ పోలీసులు వినియోగించారు. హైదరాబాద్‌లో సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు పంపిణీ చేయాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ఘటనాస్థలంలో సాక్ష్యాధారాల సేకరణకు ఈ విధానం దోహదపడనుంది. ఆందోళనలు, అల్లర్లు, విపత్తులు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం ఫోన్లు, వాకీటాకీల ద్వారానే చెప్పే వీలుంది. ఈ విధానం ద్వారా ఉన్నతాధికారులు వేగంగా స్పందించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది. ప్రత్యేకతలేంటి? విదేశాల్లో వీటి వినియోగం ఎప్పట్నుంచో ఉంది. వీటికి 3జీ, 4జీ, ఆడియో, వీడియో సదుపాయంతో పాటు జీపీఎస్ కనెక్షన్ ఉంటుంది. రికార్డింగ్ బటన్ ఆప్షన్‌తో పాటు 400 నుంచి 500 గ్రాముల బరువు ఉంటాయి. ఈ కెమెరాలను భుజానికి ధరించేందుకు వీలుగా రూపొందిం చారు. వీటిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) ఆదేశాల మేరకు సిబ్బంది వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు వీటిని వాడుతున్నారు. -
రాష్ట్రంలో మహిళ, గిరిజన పోలీస్ బెటాలియన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మహిళ, గిరిజన పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన చాంబర్లో ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్స్ మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నాలుగు ఏపీఎస్పీ బెటాలియన్లు ఏర్పాటు చేసే అవకాశం వచ్చినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం మొదటగా మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దళిత మహిళనైన తనకు కీలక బాధ్యత గల హోం మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రూపొందిస్తాం రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందేలా చేస్తామన్నారు. మహిళలు గానీ, ఇతర బాధితులు గానీ భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను రూపొందిస్తామని వివరించారు. పోలీసులు కూడా వారానికి ఒక రోజు తమ కుటుంబాలతో ఆనందంగా గడపడానికి వీక్లీఆఫ్‌ని తప్పనిసరిగా అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. 2018 పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని, ఇతర ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. చాంబర్లో ప్రత్యేక పూజలు.. తొలుత మంత్రి సుచరిత, ఆమె భర్త దయాసాగర్‌తో కలసి చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గజరావు భూపాల్, ఇతర అధికారులు, నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఫోన్‌కాల్ ఫిర్యాదుతో పాస్టర్ అరెస్టు తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఒక బాధితురాలి తల్లి అనంతపురం నుంచి ఫోన్ చేసి నాలుగు నెలల కిందట జరిగిన ఒక సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు మంత్రి సుచరిత వివరించారు. ఓ చిన్నారి పట్ల ఫాస్టర్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని ఆమె తెలిపిందన్నారు. ఆ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. పోలీసులు వెళ్లేసరికి ఫాస్టర్ పారిపోయారని, అయితే ఓ వర్గం మీడియా మాత్రం.. ‘‘వెంటనే చర్యలు తీసుకోలేకపోయారు. అసమర్థులు’’ అన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత రెండు రోజులకు ఆ పాస్టర్ని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని మంత్రి తెలిపారు. ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని, తొందరపడి వార్తలు రాయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
కడప అర్బన్: రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత పోలింగ్‌కు అప్రమత్తంగా ఉంటూ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎలాంటి ఘటనలకు తావు లేకుండా ఇప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్లో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారిని, రౌడీషీటర్లను బైండోవర్ చేయాలన్నారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పారు. ఏ కేటగిరి, బి కేటగిరి గ్రామాల్లో డీఎస్పీలు, సి కేటగిరి కింద గ్రామాల్లో సీఐలు తప్పనిసరిగా సందర్శించాలని పేర్కొన్నారు. డి కేటగిరిలో ఉన్న గ్రామాలను ఎస్ఐలు సందర్శించాలన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లో వివిధ వ్యక్తులు, సంస్థల వద్ద ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిఐలు, ఎస్ఐలు అత్యంత సమస్యాత్మక గ్రామాలకు వెళ్లాలని, ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఘటనకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి కానిస్టేబుల్ వ్యక్తిగతంగా గ్రామాలకు వెళ్లాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లపై నిఘా ఉంచి అరికట్టాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. రోడ్డు భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రహదారులపై బ్లాక్ స్పాట్స్ గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మిస్సింగ్ కేసులపై దృష్టి సారించి కేసులను ఛేదించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఏ. శ్రీనివాసరెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి. లక్ష్మినారాయణ, ఏఆర్ అదనపు ఎస్పీ రిషికేశవరెడ్డి, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పోలీసుల పల్లె నిద్ర
మోర్తాడ్: ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా పల్లెల్లో నిద్ర చేయడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. పోలీసులు ప్రజలతో మమేకమైతు సమస్యల పరిష్కారం కోసం వినూత్న పద్ధతికి అంకురార్పణ చేశారు. జిల్లా పోలీసు బాస్ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు ఆయా స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపిక చేసిన గ్రామాలలో పోలీసు అధికారులు ఒక రాత్రిపూట బస చేసి శాంతియుత వాతావరణం కల్పించడంతో పాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు. సాధారణంగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని హరితహారం కార్యక్రమం అమలు చేసే సమయంలో పంచాయతీరాజ్, రెవెన్యూ, తదితర శాఖ అధికారులు చేపట్టేవారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో అప్పుడప్పుడు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఆరంభించడం ఇది తొలిసారి. వారానికి ఒక గ్రామంలో ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తాజాగా మోర్తాడ్ మండలం వడ్యాట్‌లో నిర్వహించిన పల్లె నిద్రలో భీమ్‌గల్ సీఐ సైదయ్య, మోర్తాడ్ ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడలో నిర్వహించిన పల్లె నిద్రలో ఎస్ఐ ప్రభాకర్ పాల్గొన్నారు. సమస్యలను తెలుసుకుంటున్నం ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పల్లె నిద్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. పల్లె నిద్ర వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పల్లె నిద్ర వల్ల గ్రామంలోని సమస్యలను తెలుసుకుని ఇతర శాఖలకు సిఫారసు చేసే అవకాశం ఉంది. – సురేశ్, ఎస్ఐ, మోర్తాడ్ -
ఫ్రెండ్లీ పోలీస్
ఆదిలాబాద్ క్రైం : మీ పోలీసులు ఎలా ఉండాలనుకుంటున్నారు..? పోలీసు వ్యవస్థలో మార్పులు చేసే అంశాలేవి..? మీకు కావాల్సిన రక్షణ వ్యవస్థను ఎంచుకోండి.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి, మీ అమూల్యమైన సలహాలు, సూచనలతో ‘ఫ్రెండ్లీ పోలీస్’ వ్యవస్థను రూపొందించే దిశగా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తోంది. పోలీసు వ్యవస్థను మార్చి నూతన వ్యవస్థను ఏర్పాటు చేసేలా పలు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 10లోగా ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి పూర్తి నివేదిక అందజేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది. కాగా.. ఇటీవ ల పలు మండలాల్లోని పోలీసు స్టేషన్లు, జిల్లా కేం ద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే.. దుర్గా నవరాత్రులు, దసరా, బక్రీద్ పండుగలు వరుసగా రావడంతో ప్రజాభిప్రాయ సేకరణ ఆలస్యమైంది. నేటితో పండుగలన్నీ పూర్తవుతుండడంతో జిల్లా పోలీసు శాఖ ఠాణా మొదలుకొని సబ్డివిజన్స్థాయి దాకా సమావేశాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డాయి. ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని ఈనెల 10 లోగా ప్రభుత్వానికి నివే దించనున్నారు. సామాన్యుడు సైతం సమస్య చెప్పుకునేలా.. గతంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ భయపడేవారు. స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు ఏమంటారోననే భయం ఉండేది. ఈ భయం నుంచి సామాన్యుడిని విముక్తి చే సి.. నిర్భయంగా పోలీసు మెట్లెక్కేలా చేయాలని భావిస్తోంది సర్కారు. ఇందులో భాగంగానే పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో కాలం చెల్లిన చట్టాలను, ప్రజల అవసరాలు తీర్చలేని పోలీసులను మార్చేందుకు సిద్ధమవుతోంది. నూతన పోలీసు వ్యవస్థ రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేసి వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలకనుగుణంగా నూతన పోలీసు వ్యవస్థను రూపొందించనున్నారు. ఈ మేరకు ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 50 శాతం ప్రజాభిప్రాయ సేకరణ అయినట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను ప్రభుత్వానికి అందజేసేందుకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పోలీసులు ప్రణాళికను రూపొందించారు. మంగళవారం నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఐదు రోజులపాటు ప్రజాభిప్రాయాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు లేదా మూడు సమావేశాలు నిర్వహించి.. అందులో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అంశాల వారీగా సూచనలు, సలహాలు అక్కడే నమోదు చేసుకుని జిల్లా స్థాయి అధికారులకు పంపించనున్నారు. ఆధునికీకరణలో ప్రజలే భాగస్వాములు.. పోలీసులను ఫ్రెండ్లీ అండ్ మాడ్రన్ (స్నేహ పూర్వక, అధునాతన)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పోలీసు వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇలాగే ప్రతి జిల్లాలోనూ పోలీసు వ్యవస్థను ఆధునికీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు రంగంలోకి దిగిన డీజీపీ జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించి ప్రజల నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ప్రజలతో పాటు, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, మహిళా సంఘాలు, ఎన్జీవోలు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులను భాగస్వాములుగా చేసి, వారి నుంచి అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం సూచిస్తోంది.