గోల్కొండ: నిరంతరం సీసీ కెమెరాల నిఘా.. ఎక్కడ ఏ ఘటన జరిగినా నిముషాల్లో చేరుకుంటున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే కేసులను ఛేదిస్తుండటంతో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి.. దీంతో రాష్ట్ర జీడీపీ గుజరాత్, మహారాష్ట్రలతో పాటు పోటీపడుతూ గణనీయంగా పెరిగిందని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. టోలిచౌకి టూంబ్స్ రోడ్డులోని గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆసిఫ్‌నగర్ డివిజన్‌కు చెందిన 100 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా పోలీసులు పనితీరులో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, ఫలితంగా నేరాల శాతం గతంతో పోలిస్తే చాలా తగ్గిందన్నారు.
(చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..)
నేర విచారణలో కూడా సీసీ పుటేజీలను న్యాయస్థానంలో సాక్ష్యాలుగా చూపుతున్నట్లు ఆయన చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావాలని అన్నారు. దాతల సహకారంతోనే రూ.30 లక్షలతోనే హుమాయున్‌నగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాల్లో ఉన్న కెమెరాల వల్ల ఆ ప్రాంతాల్లో నేరాలు తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గాయని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు భావితరాలకు భద్రత కల్పిస్తుందన్నారు. ప్రతిపౌరుడు ఒక పోలీస్ అని, పోలీసులు సైతం పౌరులేనని ఆయన గుర్తు చేశారు.
సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అని పేరు వచ్చిందని చెప్పారు. శాంతిభద్రతలు అదుపులో ఉండటం, నేరాలు తగ్గడం వల్ల పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారన్నారు. 5 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్ల ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయని, దీనివల్ల యువతకు ఉపాధి కూడా లభించిందన్నారు. గతంలో ఒక్క కేసు ఛేదించడానికి, వ్యయప్రయాసలు ఉండేవని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటయ్యేవని గుర్తు చేశారు. సీసీ కెమెరాలతో అతి కొద్ది సమయంలోనే నిందితులకు శిక్షపడేలా చేయడం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో నగర జాయింట్ పోలీస్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, అడిషనర్ డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖి, ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ శివమారుతి, ఇన్‌స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పీస్ అండ్ మైత్రి కమిటీ సభ్యులు రాజు వస్తాద్ తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!)
Comments
Please login to add a commentAdd a comment