టెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి | Telangana TET Results 2023 Out, Check Results, Marks List Download Direct Link Here - Sakshi
Sakshi News home page

TS TET Results 2023 Out: టెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Published Wed, Sep 27 2023 10:14 AM | Last Updated on Wed, Sep 27 2023 12:10 PM

Telangana TET Results out Check Direct link Here - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం (సెప్టెంబర్‌ 27) ఉదయం  10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలు sakshieducation.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

TS TET 2023 Results - Paper 1 | Paper 2

కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్‌-1కు 2.26 లక్షలు(84.12శాతం), పేపర్‌-2కు 1.90 లక్షల మంది (91.11 శాతం)  హాజరయ్యారు. 

ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే. దీని కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్‌ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.
చదవండి: ప్రతి గణేష్‌ విగ్రహానికీ క్యూఆర్‌ కోడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement