Telangana TET
-
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET) 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనే హాల్ టికెట్లు విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ప్రకటించినప్పటికీ ఒక రోజు ఆలస్యమైంది. అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.కాగా టెట్ కోసం 2,83,441 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మే 20 నుంచి జూన్ 6 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు జూన్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది.హాల్ టికె ట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులను స్వీకరించననున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించనున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 17 నుంచి 31 వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్షలు జరపనున్నారు ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. -
టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం (సెప్టెంబర్ 27) ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలు sakshieducation.com వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. TS TET 2023 Results - Paper 1 | Paper 2 కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1కు 2.26 లక్షలు(84.12శాతం), పేపర్-2కు 1.90 లక్షల మంది (91.11 శాతం) హాజరయ్యారు. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే. దీని కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. కాగా, ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 15 వ తేదీన రెండు సెషన్స్ లో పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు., రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష.., సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యమైన తేదీలు దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2 దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16 రాతపరీక్ష: సెప్టెంబర్ 15 పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఫీజు: రూ.400 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో వెబ్సైట్: https://tstet.cgg.gov.in 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు? తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది. -
తెలంగాణ: టెట్ ప్రాథమిక కీ వచ్చేసింది
హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-టెట్) ప్రాథమిక కీ విడుదల అయ్యింది. జూన్ 12న టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. కీ ద్వారా సమాధానాలపై అభ్యంతరాలుంటే.. జూన్ 18లోపు ఆన్లైన్లో సమర్పించొచ్చు. Telangana TET Key రిలీజ్ అయ్యిందని బుధవారం సాయంత్రం కన్వీనర్ రాధారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 27న టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. tstet.cgg.gov.in వెబ్సైట్ ద్వారా కీ డౌన్లోడ్ చేస్కోవచ్చు. తెలంగాణ టెట్ పరీక్షకు 90 శాతం హాజరు నమోదు అయ్యింది. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,18,506 మంది (90.62 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,070 మంది (90.35 శాతం) హాజరయ్యారు. -
తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్ పరీక్ష..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 336 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 83,465 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 212 పరీక్ష కేంద్రాలున్నాయి. రాజ ధానిలో మొత్తం 50,600 మంది పరీక్ష రాస్తున్నారు. ములుగులో అతి తక్కువగా 15 పరీక్ష కేంద్రాలున్నాయి. ఈ జిల్లాలో దాదాపు 2,200 మంది పరీక్ష రాస్తున్నారు. ప్రతి కేంద్రానికి 11 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రతి కేంద్రానికి 11 మంది ఇన్విజిలేటర్లు, మరో ముగ్గురు పర్యవేక్షణ అధికారుల చొప్పున వినియోగిస్తున్నారు. వారికి పరీక్ష నిర్వహణ విధానంపై శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. ప్రశ్నపత్రం ఓపెన్ చేయడం మొదలు కొని, ప్యాక్ చేసే వరకూ వీడియో రికార్డింగ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పేపర్– 1 అభ్యర్థులకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, పేపర్– 2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, తాగునీరు, నిరంతర విద్యుత్ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయానికి కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. పరేషాన్లో అభ్యర్థులు.. టెట్ హాల్ టికెట్లు తప్పుల తడకగా మారడంతో అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. ఇప్పటికే కొందరు హాల్ టికెట్ సరిచేసుకోగా మరికొందరు అవగాహన లేక చేసుకోలేక పోయారు. వాస్తవంగా ప్రైవేటు ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో అనేక తప్పులు దొర్లాయి. హాల్ టికెట్లలో అభ్యర్థి పేరు, తండ్రి, తల్లి పేరు, పుట్టిన తేదీ, కులం, లింగం, డిసెబిలిటీ (పీహెచ్సీ) వంటి వివరాలతో పాటు ఫొటో లు సరిగా కనిపించకపోవడం, ఫొటో కింద సంతకాలు లేకపోవడం ఇబ్బందిగా తయారైంది. పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేకపోయినా, అస్సలు లేకపోయినా అభ్యర్థులు తాజా ఫొటోను అతికించి, గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేష¯న్ చేయించుకొని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో చాలా మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మరికొందరు అవగాహన లేక తిప్పలు పడుతున్నారు. ► గుర్తుంచోవాల్సిన అంశాలు ►పేపర్1(ఎస్జీటీ) ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు, పేపర్2(ఎస్ఏ) మధ్యాహ్నం2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ►అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించారు. ►ఓఎమ్ఆర్ షీట్లను చించడం, మతడపెట్టడం చేయరాదు. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి తెలిసినవి ఆన్సర్ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా తెలియని, ఊహించి చెప్పగలిగేవి ఆన్సర్ చేయండి. ►ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో హెల్ప్‌లైన్ టెట్ అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్లు, రూట్‌మ్యాప్, రవాణా సౌకర్యాలు, ఇతర సందేహాలు, సలహాల కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు. ►హైదరాబాద్ : 98488 39244 ►రంగారెడ్డి జిల్లా : 96661 62092, 93968 56548, 77999 99242, 99666 53653 ►మేడ్చల్ జిల్లా : 91604 19991 -
ఆ అభ్యర్థులకు నిరాశ! టెట్‌లో ప్రత్యేక పేపర్ లేనట్టే...
సాక్షి, హైదరాబాద్: భాషాపండితులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రత్యేకంగా నిర్వహించే ఆలోచనేమీలేదని అధికారవర్గాలు స్పష్టమైన సంకేతాలిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని దాదాపు 30 వేల మంది భాషాపండితులు నిరాశకు గురయ్యారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఈ అవకాశం కల్పించారని వారు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి సానుకూల స్పందనరాలేదు. విజ్ఞప్తులు, విన్నపాలు కొనసాగుతున్న క్రమంలోనే టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 12తో ముగిసింది. మొత్తం 6,29,352 దరఖాస్తులు అందాయని, ఇందులో పేపర్–1 రాసేవారి సంఖ్య 3,51,468, పేపర్–2 రాసేవారి సంఖ్య 2,77,884 ఉందని అధికారులు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభించే వీలుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ జరుగుతుంది. తమకు తెలియని సిలబస్‌తో టెట్ రాయడం కష్టమనే భావనలో భాషా పండితులున్నారు. హిందీ, తెలుగు భాషాపండిట్ కోర్సు పూర్తి చేసిన ఈ అభ్యర్థులు టెట్ పేపర్–2 రాసేందుకు అర్హులు. (చదవండి: బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు!) అయితే, వీరు ప్రధానంగా సంబంధిత భాషపైనే శిక్షణపొంది ఉంటారు. 60 శాతం భాషాపరమైన సిలబస్ నుంచి పరీక్ష నిర్వహిస్తే టెట్‌లో పోటీ పడగలమని వీరు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం గణితం, సైన్స్‌సహా మిగతా సిలబస్‌తో వీళ్లు టెట్ రాయాల్సి వస్తోంది. ఇది తమకు ఇబ్బందిగానే ఉంటుందని వారి వాదన. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల మంది తెలుగు పండిట్లు, 10 వేల మంది హిందీ పండితులున్నారు. ఆన్లైన్ అవస్థలు.. టెట్ దరఖాస్తుల సమయంలో అనేక సమస్యలు ఎదురైనట్టు అభ్యర్థులు చెబుతున్నారు. దరఖాస్తుపై కొంతమంది ఫొటోలు ఆప్‌లోడ్ అయినా, సంతకాలు నిర్దేశిత ప్రాంతంలో పొందుపర్చలేకపోయామని, సాంకేతిక ఇబ్బందులే దీనికి కారణమని చెబుతున్నారు. సమీపంలోని పరీక్ష కేంద్రాలు ఆన్లైన్లో చూపించలేదని ఎల్బీనగర్కు చెందిన చైతన్య, రఘురాం అనే అభ్యర్థులు తెలిపారు. అయితే, దరఖాస్తులు తాము చెప్పిన రీతిలో లేని పక్షంలో తిరస్కరిస్తామని అధికారులు అంటున్నారు. దీంతో పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ తరహాలో పేపర్–3 ఉండాలి భాషాపండితులకు 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేపర్–3 నిర్వహించింది. అదే తరహాలో ఇక్కడా భాషపైనే ఎక్కువ సిలబస్‌తో ప్రశ్నలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా అయితేనే 30 వేల భాషాపండితులకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది. కానీ, దీన్ని పట్టించుకోకపోవడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. – సి.జగదీశ్ (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, రాష్ట్ర అధ్యక్షుడు) (చదవండి: టెట్ పరీక్ష కేంద్రాలు బ్లాక్) -
టెన్త్ వరకు చదివిన భాషే లాంగ్వేజ్-1
టెట్‌పై కన్వీనర్ జగన్నాథరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: మే 1న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి వచ్చిన వివిధ సందేహాలపై టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి స్పష్టతనిచ్చారు. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు వాటిని కచ్చితంగా సరిచూసుకోవాలని తెలిపారు. ఆయన చేసిన పలు సూచనలు.. ► అభ్యర్థులు ఏ సబ్జెక్టులో ఉపాధ్యాయులు కావాలనుకుంటారో ఆ సబ్జెక్టులోనే టెట్ రాయాలి. ► పదో తరగతి వరకు అభ్యర్థి చదివిన మీడియాన్నే ప్రథమ భాషగా (లాంగ్వేజ్-1) ఎంచుకోవాలి. ► భాషా పండితులు/స్కూల్ అసిస్టెంట్లు తమ కోర్సుకు సంబంధించిన భాషనే లాంగ్వేజ్-1గా ఎంచుకోవాలి. ►దరఖాస్తులో పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, లాంగ్వేజ్-1 కింద ఎంచుకున్న భాష, పరీక్ష రాయదలచిన సబ్జెక్టులు, (మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్), పరీక్ష కేంద్రాల వివరాల్లో సబ్మిట్ చేసిన తర్వాత మార్పు ఉండదు. ► అయినప్పటికీ ఏవైనా మార్పులు ఉంటే ఫిర్యాదుల బాక్స్ ద్వారా పంపించాలి. ► గతంలో టెట్‌కు హాజరైతే దానికి సంబంధించిన హాల్ టికెట్ నంబరు కోసం aptet.cgg.gov.in వెబ్సైట్లో పొందవచ్చు. ఒకవేళ లేకపోతే తెలంగాణ టెట్ సెల్‌ను ఫోన్ ద్వారా సంప్రదించాలి. -
మే 1న టెట్
షెడ్యూలు విడుదల... నేడు నోటిఫికేషన్ జారీ ► ఈనెల 15 నుంచి 30 వరకు ఫీజు చెల్లింపు గడువు ► 16 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ► పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో ఇంకా అనుమానాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను మే 1న నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఆదివారం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30 వరకు టీఎస్ ఆన్లైన్ లేదా పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది. అలాగే ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో (http://tstet.cgg.gov.in) దరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొంది. శనివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించిన అనంతరం విద్యాశాఖ ఈ మేరకు షెడ్యూలును జారీ చేసింది. ఈసారైనా పరీక్ష జరిగేనా? టెట్‌ను నిర్వహించేందుకు విద్యాశాఖ ఇప్పటికే రెండుసార్లు నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూలును ప్రకటించినా వివిధ కారణాలతో వాయిదా వేసింది. తాజాగా మళ్లీ నోటిఫికేషన్ జారీకి సిద్ధమై షెడ్యూలును ప్రకటించింది. అయితే ఈసారైనా పరీక్ష నిర్వహిస్తారా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ప్రభుత్వం తొలుత గతేడాది నవంబర్ 14న టెట్ నోటిఫికేషన్ జారీ చేసి జనవరి 24న పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే అప్పట్లో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం రాయడంతో ఆగిపోయింది. ఆ తరువాత నుంచి వివిధ కారణాలతో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడుతూ వచ్చింది. గత నెల 27న మరోసారి టెట్ నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూలు జారీ చేసింది. ఏప్రిల్ 9న టెట్ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 29 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. అయితే టెట్ నిర్వహణ విషయంలో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 5న కమిటీని వేసిందన్న అంశాన్ని పేర్కొంటూ దరఖాస్తుల స్వీకరణను మరోసారి వాయిదా వేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సెంట్రల్ టెట్‌ను ఫిబ్రవరి 21న యథావిధిగా నిర్వహించింది. తాజాగా మూడోసారి టెట్ నిర్వహణకు అధికారులు షెడ్యూలు జారీ చేయడంతో అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతున్నా.. పరీక్ష జరుగుతుందా అనే ఆందోళన మాత్రం వారిని ఇంకా వెంటాడుతోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. అందుకు సంబంధించిన కేసు త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలో టెట్, ఆ తరువాత డీఎస్సీ నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పుకునేందుకే ప్రభుత్వం టెట్ షెడ్యూలు జారీ చేసిందా అనే ప్రశ్నలు అభ్యర్థుల్లో తలెత్తుతున్నాయి. ఏదేమైనా ఈసారైనా పరీక్షను కచ్చితంగా నిర్వహించాలని వారు కోరుతున్నారు. డీఎస్సీపై పరిశీలన టెట్ షెడ్యూల్ జారీ అయిన నేపథ్యంలో డీఎస్సీ నిర్వహిణను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. డీఎస్సీకి సంబంధించి మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇదీ టెట్ షెడ్యూలు 13-3-2016: టెట్ నోటిఫికేషన్ 15-3-2016 నుంచి 30-3-2016 వరకు: టీఎస్ ఆన్లైన్, పేమెంట్ గేట్ ద్వారా ఫీజు చెల్లింపు. 15-3-2016 నుంచి: వెబ్సైట్ ద్వారా టెట్ సమాచార బులెటిన్, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 16-3-2016 నుంచి 31-3-2016 వరకు: ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ. 15-3-2016 నుంచి 1-5-2016 వరకు: అందుబాటులోకి హెల్ప్ డెస్క్ సేవలు. 15-3-2016 నుంచి 31-3-2016 వరకు: ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ 20-4-2016 నుంచి: హాల్ టికెట్ల డౌన్లోడ్ 1-5-2016: టెట్ పరీక్ష (ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష)