తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల | TS TET Exam Date 2024 Released: Check Here Notification And Exam Date - Sakshi
Sakshi News home page

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Published Thu, Mar 14 2024 9:25 PM | Last Updated on Thu, Mar 14 2024 9:48 PM

Telangana Tet Notification 2024 Release - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తులను స్వీకరించననున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించనున్నారు. మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 17 నుంచి 31 వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్షలు జరపనున్నారు

ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు.

ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement