టెట్‌పై కన్వీనర్ జగన్నాథరెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మే 1న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి వచ్చిన వివిధ సందేహాలపై టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి స్పష్టతనిచ్చారు. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు వాటిని కచ్చితంగా సరిచూసుకోవాలని తెలిపారు.
ఆయన చేసిన పలు సూచనలు..
► అభ్యర్థులు ఏ సబ్జెక్టులో ఉపాధ్యాయులు కావాలనుకుంటారో ఆ సబ్జెక్టులోనే టెట్ రాయాలి.
► పదో తరగతి వరకు అభ్యర్థి చదివిన మీడియాన్నే ప్రథమ భాషగా (లాంగ్వేజ్-1) ఎంచుకోవాలి.
► భాషా పండితులు/స్కూల్ అసిస్టెంట్లు తమ కోర్సుకు సంబంధించిన భాషనే లాంగ్వేజ్-1గా ఎంచుకోవాలి.
►దరఖాస్తులో పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, లాంగ్వేజ్-1 కింద ఎంచుకున్న భాష, పరీక్ష రాయదలచిన సబ్జెక్టులు, (మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్), పరీక్ష కేంద్రాల వివరాల్లో సబ్మిట్ చేసిన తర్వాత మార్పు ఉండదు.
► అయినప్పటికీ ఏవైనా మార్పులు ఉంటే ఫిర్యాదుల బాక్స్ ద్వారా పంపించాలి.
► గతంలో టెట్‌కు హాజరైతే దానికి సంబంధించిన హాల్ టికెట్ నంబరు కోసం aptet.cgg.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు. ఒకవేళ లేకపోతే తెలంగాణ టెట్ సెల్‌ను ఫోన్ ద్వారా సంప్రదించాలి.
టెన్త్ వరకు చదివిన భాషే లాంగ్వేజ్-1
Published Sun, Mar 27 2016 5:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM
Advertisement
Advertisement