తెలంగాణ: టెట్‌ ప్రాథమిక కీ వచ్చేసింది | Telangana TET Primary Key Released | Sakshi
Sakshi News home page

తెలంగాణ: టెట్‌ ప్రాథమిక కీ వచ్చేసింది

Published Wed, Jun 15 2022 8:58 PM | Last Updated on Thu, Jun 16 2022 2:58 PM

Telangana TET Primary Key Released - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-టెట్‌) ప్రాథమిక కీ  విడుదల అయ్యింది. జూన్‌ 12న టెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. కీ ద్వారా  సమాధానాలపై అభ్యంతరాలుంటే.. జూన్‌ 18లోపు ఆన్‌లైన్‌లో సమర్పించొచ్చు. 

Telangana TET Key రిలీజ్‌ అయ్యిందని బుధవారం సాయంత్రం కన్వీనర్‌ రాధారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 27న టెట్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కీ డౌన్‌లోడ్‌ చేస్కోవచ్చు.

తెలంగాణ టెట్‌ పరీక్షకు 90 శాతం హాజరు నమోదు అయ్యింది. ఉదయం జరిగిన పేపర్‌-1 పరీక్షకు 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,18,506 మంది (90.62 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 పరీక్షకు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,070 మంది (90.35 శాతం) హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement