సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలు విడుదల చేశారు. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షల్లో మొత్తం 31.21 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 1,35,802 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయగా.. 42,384 మంది అర్హత సాధించారు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాలను https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
కాగా, ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత ఏడాది 11 వేల టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా 17 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ అర్హత సాధించినవారు దాదాపు 3 లక్షల మంది ఉన్నా రు.
Comments
Please login to add a commentAdd a comment