
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లాసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు లాసెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. లా కోర్సులకు సంబంధించి వివిధ కాలేజీల్లోని కోర్సులకు ప్రభుత్వం బుధవారం ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఫీజులు ఖరారవ్వడంతో తొలివిడత ప్రవేశాల ప్రక్రియను కన్వీనర్ ప్రకటించారు.
షెడ్యూల్ ఇలా..
ప్రక్రియ తేదీ
ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం
అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ 16 నుంచి 18
ధ్రువపత్రాల పరిశీలన 16 నుంచి 18
వెబ్ ఆప్షన్ల నమోదు 16 నుంచి 18
సీట్ల కేటాయింపు 20
కాలేజీల్లో రిపోర్టింగ్ 22, 23
(చదవండి: రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్)
ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!
Comments
Please login to add a commentAdd a comment